Stock market news : స్టాక్ మార్కెట్లో ఎగ్జిట్ పోల్స్ జోరు.. సెన్సెక్స్- నిఫ్టీకి కనీవినీ ఎరుగని రీతిలో లాభాలు!
Stock market today : ప్రధాని మోదీ మూడోసారి అధికారంలోకి రావడం అనివార్యం అని ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పడంతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ఉన్నాయి.
Stock market news today : 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వస్తారని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పడంతో దేశీయ స్టాక్ మార్కెట్లో అత్యంత సానుకూల పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా సోమవారం ట్రేడింగ్ సెషన్లో సెన్సెక్స్, నిఫ్టీలు.. కనీవినీ ఎరుగని రీతిలో లాభాల్లో ఓపెన్ అయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 2,622 పాయింట్ల లాభంతో 76,583 వద్ద ఓపెన్ అయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 807 పాయింట్లు పెరిగి 23,338 వద్ద ఉంది. ఇక 1906 పాయింట్లు పెరిగిన బ్యాంక్ నిఫ్టీ.. 50,890 వద్ద ఓపెన్ అయ్యింది.
ఓపెనింగ్‌లో ఈ రెంజ్లో సూచీలు లాభాలు చూడటం చాాలా అరుదైన విషయం. పైగా.. ఇండెక్స్‌లన్నీ ఆల్-టైమ్ హై నెంబర్లు కావడం విశేషం.
స్టాక్ మార్కెట్లో ఎగ్జిట్ పోల్స్ జోరు..
దేశీయ స్టాక్ మార్కెట్లో ఎన్నికల ఫీవర్ గత కొన్ని నెలలుగా కొనసాగుతోంది. తొలినాళ్లల్లో మోదీ ప్రభుత్వం మూడోసారి రావడం ఖాయమని అందరు అనుకున్నారు. కానీ మధ్యలో.. పలు నివేదికలు షాక్ ఇచ్చాయి. బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవచ్చని నివేదికలు బయటకు రావడంతో.. కేంద్రంలో ఈసారి స్థిరమైన ప్రభుత్వం ఉండదని అంచనాలు పెరిగాయి. ఇది స్టాక్ మార్కెట్లకు నెగిటివ్! అందుకే.. కొన్ని వారాల పాటు నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీల్లో తీవ్ర ఒడుగొడుకులు కనిపించాయి.
Lok Sabha election exit polls 2024 : కానీ.. 2024 లోక్‌సభ ఎన్నికల 7వ దశ పోలింగ్ అనంతరం శనివారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్.. స్టాక్ మార్కెట్ జోరుకు కారణమయ్యాయి. మూడోసారి మోదీ రాక అనివార్యం అని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ స్పష్టంగా చెప్పాయి. ఎగ్జిట్ పోల్స్‌పై నమ్మకం పెట్టిన మదుపర్లకు ఇది గొప్ప పాజిటివ్ ఎనర్జీ ఇచ్చింది. ఫలితంగా.. సోమవారం ట్రేడింగ్ సెషన్లో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ఓపెన్ అయ్యాయి.
కాగా.. అసలైన ఎన్నికల ఫలితాలు మంగళవారం, జూన్ 4న వెలువడనున్నాయి. అందువల్ల మదుపర్లు జాగ్రత్తగా ఉండాలని స్టాక్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులైతే.. పోర్ట్‌ఫోలియో పతనం అయ్యే అవకాశం ఉందని, అందుకే.. బిగినర్లు కొన్ని రోజుల పాటు స్టాక్ మార్కెట్లకు దూరంగా ఉండి, గమనించాలని అంటున్నారు. కానీ.. ఎగ్జిట్ పోల్స్ 2024 అంచనాలను నిజం చేస్తూ.. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ- బీజేపీ గెలిస్తే.. స్టాక్ మార్కెట్లో సానుకూల పరిస్థితి కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు.
Lok Sabha elections stock market : ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్ విషయానికొస్తే.. సెన్సెక్స్ 30లోని స్టాక్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి. పవర్ గ్రిడ్ 6.3శాతం, ఎన్టీపీసీ 4.9శాతం, ఎం అండ్ ఎం 4.8శాతం, ఎల్టీ 4.7శాతం మేర లాభాల్లో ఉన్నాయి.
సంబంధిత కథనం
టాపిక్