నేడు స్టాక్ మార్కెట్‌కు సెలవు: గుడ్ ఫ్రైడేకు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ పనిచేయవు-stock market holiday today bse nse to remain closed for good friday ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  నేడు స్టాక్ మార్కెట్‌కు సెలవు: గుడ్ ఫ్రైడేకు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ పనిచేయవు

నేడు స్టాక్ మార్కెట్‌కు సెలవు: గుడ్ ఫ్రైడేకు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ పనిచేయవు

HT Telugu Desk HT Telugu
Mar 29, 2024 08:07 AM IST

Good Friday 2024: ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్ఎల్బీ సెగ్మెంట్లలో ఈ రోజు కూడా ఎలాంటి కార్యకలాపాలు ఉండవు.

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ కార్యాలయం
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ కార్యాలయం (Reuters)

గుడ్ ఫ్రైడే కారణంగా ఈ రోజు (మార్చి 29) బిఎస్ఇ (బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్), ఎన్ఎస్ఇ (నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్) లలో ట్రేడింగ్ ఉండదు. స్టాక్ మార్కెట్ మొత్తం సెషన్ పనిచేయదు. తిరిగి సోమవారం సాధారణ సమయాల్లో ట్రేడింగ్ ప్రారంభమవుతుంది. ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్ఎల్బీ సెగ్మెంట్లలో కూడా ఎలాంటి కార్యకలాపాలు ఉండవు. ఈ రోజు భారత స్టాక్ మార్కెట్లో కరెన్సీ డెరివేటివ్స్ సెగ్మెంట్ల ట్రేడింగ్ కూడా నిలిచిపోనుంది.

yearly horoscope entry point

మార్చి 28న, 2024 ఆర్థిక సంవత్సరం చివరి రోజున మార్కెట్ ఘనమైన లాభాలను సాధించింది. వరుసగా రెండవ సెషన్లో విజయ పరంపరను కొనసాగించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 655.04 పాయింట్లు (0.90 శాతం) పెరిగి 73,651.35 వద్ద, నిఫ్టీ 203.20 పాయింట్లు లేదా 0.92 శాతం పెరిగి 22,326.90 వద్ద ట్రేడయ్యాయి.

ఈ రోజు కమోడిటీ మార్కెట్ తెరిచి ఉందా?

రెండు సెషన్లలో కమోడిటీ డెరివేటివ్స్ సెగ్మెంట్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ (ఇజిఆర్) సెగ్మెంట్లో ట్రేడింగ్ ఉండదు. అంటే మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసిఎక్స్), నేషనల్ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎన్సిడిఇఎక్స్) లలో ఎటువంటి ట్రేడింగ్ కార్యకలాపాలు జరగవు.

స్టాక్ మార్కెట్ సెలవులు 2024

స్టాక్ మార్కెట్ సెలవుల జాబితా ప్రకారం, మార్చిలో మూడు సెలవులు ఉన్నాయి. మార్చి 8 (మహాశివరాత్రి), 25 (హోలీ), మరియు 29 (గుడ్ ఫ్రైడే). తదుపరి స్టాక్ మార్కెట్ సెలవు ఈద్-ఉల్-ఫితర్ లేదా రంజాన్ (ఏప్రిల్ 11). శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 17న భారత స్టాక్ మార్కెట్‌కు కూడా సెలవు ఉంటుంది.

గుడ్ ఫ్రైడేకు బ్యాంకులకు సెలవు ఉంటుందా?

గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని మార్చి 29న పలు రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) సెలవుల జాబితా ప్రకారం 2024 మార్చిలో బ్యాంకులు 14 రోజులు పనిచేయవు.

Whats_app_banner