తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Samsung Galaxy S25 Ultra : సూపర్​ కూల్​ ఫీచర్స్​తో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా!

Samsung Galaxy S25 Ultra : సూపర్​ కూల్​ ఫీచర్స్​తో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా!

Sharath Chitturi HT Telugu

08 June 2024, 12:07 IST

google News
  • Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా ఇప్పుడు ఐఎంఈఐ డేటాబేస్​లో కనిపించింది. ఈ గ్యాడ్జెట్​ ఫీచర్స్​ ఇప్పటికే ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. ఆ వివరాలు..

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రాలో సూపర్​ కూల్​ ఫీచర్స్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రాలో సూపర్​ కూల్​ ఫీచర్స్! (HT Tech)

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రాలో సూపర్​ కూల్​ ఫీచర్స్!

Samsung Galaxy S25 Ultra price in India : శాంసంగ్​ గెలాక్సీ ఎస్24 సిరీస్ విజయం సాధించడం, గెలాక్సీ ఏఐ పరిచయం తరువాత.. వచ్చే సంవత్సరం లాంచ్​ అయ్యే గెలాక్సీ ఎస్ 25 సిరీస్​పై ఫోకస్​ పెట్టింది దిగ్గజ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ. శాంసంగ్ ఇప్పటికే గెలాక్సీ ఎస్25 అల్ట్రాపై అధికారికంగా పనిచేయడం ప్రారంభించిందని తాజా నివేదికలు చెబుతున్నాయి. ఈ స్మార్ట్​ఫోన్​ అధికారిక ప్రకటనకు ఇంకా ఆరు నెలల సమయం ఉన్నప్పటికీ, శాంసంగ్ వచ్చే ఏడాది కొత్త తరం ఎస్-సిరీస్​ని మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా గురించి కొత్త లీక్ ఏం చెబుతున్నాయో ఇక్కడ తెలుసుకుందాము.

శాంసంగ్​ గెలాక్సీ ఎస్​25 అల్ట్రా..

ఆండ్రాయిడ్ హెడ్​లైన్ నివేదిక ప్రకారం రాబోయే గెలాక్సీ ఎస్25 అల్ట్రా మోడల్ నంబర్ ఎస్ఎమ్-ఎస్ 938 యూతో ఐఎంఈఐ డేటాబేస్​లో కనిపించింది. మోడల్ నెంబరులో ఉన్న “యూ”.. “యూఎస్”ను సూచిస్తుందని తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్​ఫోన్ గ్లోబల్ మార్కెట్లో కూడా అందుబాటులో ఉండనుంది. శాంసంగ్ తన పాపులర్ ఫ్లాగ్​షిప్ స్మార్ట్​ఫోన్​లను ప్రపంచంలోని పలు ప్రాంతాలకు విస్తరించాలని యోచిస్తోందని నివేదిక హైలైట్ చేసింది.

Samsung Galaxy S25 Ultra features : ఈ స్మార్ట్​ఫోన్​ స్పెసిఫికేషన్లు ఫీచర్లపై ఎటువంటి అధికారిక సమాచారం లేదు. అయితే శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ చిప్​సెట్ అనేది మార్కెట్​ బట్టి మారవచ్చు అని తెలుస్తోంది. అంటే కొన్ని దేశాల్లో ఈ స్మార్ట్​ఫోన్లు స్నాప్​డ్రాగన్ 8 జెన్ 4 చిప్​సెట్​తో పనిచేస్తాయి. ముఖ్యంగా అమెరికాలో!అయితే, కొన్ని ప్రదేశాల్లో.. గెలాక్సీ ఎస్25 సిరీస్ ఎక్సినోస్ 2500ను కలిగి ఉండవచ్చు. ఈ వ్యూహాన్ని గెలాక్సీ ఎస్24 సిరీస్​లో కూడా అనుసరించారు. ఇందులో గెలాక్సీ ఎస్​24, ఎస్​24 ప్లస్ స్మార్ట్​ఫోన్​లు.. ప్రాంతాలు ఆధారంగా స్నాప్​డ్రాగన్ లేదా ఎక్సినోస్ ప్రాసెసర్​తో వస్తున్నాయి.

ఐస్ యూనివర్స్ అనే టిప్​స్టర్ నుంచి వచ్చిన రూమర్స్​ ప్రకారం.. శాంసంగ్​ గెలాక్సీ ఎస్25 అల్ట్రా.. క్వాడ్ కెమెరా సెటప్ కలిగి ఉండవచ్చు. ఇందులో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉండవచ్చు. అవి.. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్​తో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో, 5ఎక్స్ ఆప్టికల్ జూమ్​తో 50 మెగాపిక్సెల్ సూపర్ టెలిఫోటో. శామ్సంగ్ వచ్చే ఏడాది అల్ట్రా వేరియంట్ కోసం యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్​ని ఇంటిగ్రేట్ చేయవచ్చని మరో టిప్​స్టర్​ వెల్లడించారు. ఇది 16 జీబీ ర్యామ్- 512జీబీ/ 1 టీబీ స్టోరేజ్ ఎంపికలతో కూడా రావచ్చు.

Samsung Galaxy S25 Ultra launch date in India : శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా ఇంకా అభివృద్ధి దశలో ఉన్నందున, వచ్చే సంవత్సరం ఎస్-సిరీస్ స్మార్ట్​ఫోన్ కోసం శాంసంగ్ ఏం ప్లాన్ చేస్తుందో వేచి చూడాలి.

మరో విషయం! మనం ఇప్పుడు వాట్సప్ ఛానల్స్​లో ఉన్నాం! టెక్నాలజీ ప్రపంచం నుంచి లేటెస్ట్​ అప్డేట్స్​ మిస్ కాకుండా ఉండటానికి హెచ్​టీ తెలుగు వాట్సాప్​ ఛానెల్​ని ఫాలో అవ్వండి!

తదుపరి వ్యాసం