Motorola X50 Ultra price in India : మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రాను పోలిన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ని సంస్థ చైనాలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ పేరు మోటోరోలా ఎక్స్50 అల్ట్రా. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టం, స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్, 144 హెర్ట్జ్ డిస్ ప్లే, 50 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వంటి కొన్ని సూపర్ ఫీచర్స్ ఈ గ్యాడ్జెట్ సొంతం. పూర్తి ఫీచర్స్, ధర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మోటోరోలా ఎక్స్50 అల్ట్రాలో మూడు వేరియంట్లు ఉన్నాయి. అవి.. 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర 3,999 యువాన్లు (సుమారు రూ.46,240.38), 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,299 యువాన్లు (సుమారు రూ.49,709). 16 జీబీ ర్యామ్ విత్ 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,699 యువాన్లు (సుమారు రూ.54,334)
డిజైన్ పరంగా చూసుకుంటే.. ఈ మోటోరోలా ఎక్స్50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లో చెక్క లేదా ఎకో-లెదర్ బ్యాక్ ప్యానెల్‌తో కూడిన గ్లాస్ ఫ్రంట్ ఉంది. ఇది అల్యూమినియం ఫ్రేమ్‌తో కలిసి ఉంటుంది. ఫ్రంట్ కెమెరా సెంట్రల్ పంచ్ హోల్ కటౌట్లో ఉండగా.. వెనుక భాగంలో మోటో లోగోతో కెమెరా బంప్ ఉంది. 68 ఐపీ రేటెడ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ వస్తోంది. ఈ డివైజ్ మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది: ఫారెస్ట్ గ్రే, నార్డిక్ వుడ్ మరియు పీచ్ ఫజ్.
Motorola X50 Ultra launch date in India : ఈ స్మార్ట్‌ఫోన్ డిస్ప్లే 1220 x 2712 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.7 ఇంచ్ పీఓలెడ్ ప్యానెల్‌ను కలిగి ఉంది. ఇది 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ని అందిస్తుంది. అండర్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ రీడర్, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉన్నాయి.
ఆండ్రాయిడ్ 14 ఆధారిత హలో యూఐ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ మోటోరోలా ఎక్స్50 అల్ట్రాలో క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్ ఉంది.
4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 125 వాట్ వైర్డ్ ఛార్జింగ్, 50వాట్ వైర్లెస్ ఛార్జింగ్, 10వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్‌కు ఈ స్మార్ట్‌ఫోన్ సపోర్ట్ చేస్తుంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 64 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీల కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 4కే60 ఎఫ్పీఎస్ వీడియోను రికార్డ్ చేయగలదు.
Motorola X50 Ultra : కనెక్టివిటీ ఆప్షన్లలో అల్ట్రా-వైడ్‌బ్యాండ్ (యూడబ్ల్యూబీ), వై-ఫై 7, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్-సి 3.1 జెన్ 2, జీపీఎస్, 5జీ ఎన్ఎఫ్సి ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ సౌండ్, డాల్బీ అట్మాస్, డాల్బీ హెడ్ ట్రాకింగ్ తో స్టీరియో స్పీకర్లు, లెనోవోకు చెందిన షియోటియన్ ఏఐ అసిస్టెంట్, లెనోవో ల్యాప్‌టాప్‌లకు అనుకూలమైన ఏఐ పీసీ సహకార టూల్ వంటివి ఇతర ఫీచర్స్‌గా ఉన్నాయి.
ఈ మోటోరోలై ఎక్స్50 అల్ట్రా ఇండియా లాంచ్‌పై ప్రస్తుతం క్లారిటీ లేదు. దీని మీద సంస్థ ఇంకా స్పందించలేదు. త్వరలోనే ఓ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.
సంబంధిత కథనం