Samsung Galaxy Ring : శాంసంగ్ గెలాక్సీ రింగ్ లాంచ్‌కు రెడీ- సూపర్ కూల్ ఫీచర్స్!
Samsung Galaxy Ring price : ఎండబ్ల్యూసీ 2024లో తొలిసారిగా ప్రదర్శించిన శాంసంగ్ గెలాక్సీ రింగ్ ఈ ఏడాది ద్వితీయార్థంలో లాంచ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్‌పై ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
Samsung Galaxy Ring features : ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ)లో శాంసంగ్.. తన గెలాక్సీ రింగ్‌ను ఆవిష్కరించింది. 2024 ద్వితీయార్థంలో ఈ స్మార్ట్ రింగ్‌ను లాంచ్ చేసే ప్రణాళికలను కంపెనీ ధృవీకరించింది. ఇటీవల ఆన్లైన్ బజ్‌తో పాటు బ్లూటూత్ ఎస్ఐజి సర్టిఫికేషన్ వైరల్ అవ్వడంతో.. ఈ శాంసంగ్ గెలాక్సీ రింగ్ విడుదల త్వరలోనే ఉండొచ్చని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్ ఫీచర్స్‌తో పాటు ఇప్పటవరకు అందుబాటులో ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..
శాంసంగ్ గెలాక్సీ రింగ్ ఫీచర్లు..
శాంసంగ్ గెలాక్సీ రింగ్ 5 నుంచి 13 సైజుల్లో, ఎస్ నుంచి ఎక్స్ ఎల్ వరకు తొమ్మిది రకాల సైజుల్లో అందుబాటులో ఉండనుంది. అందరికి ఫిట్ అయ్యేలా చాలా జాగ్రత్తగా దీనిని శాంసంగ్ రూపొందిస్తోందని అర్థం చేసుకోవచ్చు. బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ గెలాక్సీ రింగ్ మోడల్స్‌ను వెల్లడించింది. వీటిలో ఎస్ఎమ్-క్యూ 500, ఎస్ఎమ్-క్యూ 501, ఎస్ఎమ్-క్యూ 502, ఎస్ఎమ్-క్యూ 503, ఎస్ఎమ్-క్యూ 505, ఎస్ఎమ్-క్యూ 506, ఎస్ఎమ్-క్యూ 507, ఎస్ఎమ్-క్యూ 508 మరియు ఎస్ఎమ్-క్యూ 509 ఉన్నాయి.
Samsung Galaxy Ring launch date : ఈ శాంసంగ్ గెలాక్సీ రింగ్ బ్యాటరీ సామర్థ్యం మరో ప్రత్యేకత! అతిచిన్న పరిమాణంలో 14.5 ఎంఏహెచ్ బ్యాటరీ, అతిపెద్ద పరిమాణంలో 21.5 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఈ సామర్థ్యం మోడల్ పరిమాణాన్ని బట్టి ఒక్కసారి ఛార్జ్ చేస్తే 5 నుంచి 9 రోజుల బ్యాటరీ లైఫ్ కలిగి ఉండే అవకాశం ఉంది. ఇది నిజంగా వావ్! అనాల్సిన విషయమే.
హెల్త్ ట్రాకింగ్ సామర్థ్యాలు..
గెలాక్సీ రింగ్ హెల్త్ ట్రాకింగ్ కోసం రూపొందించిన ఇంటిగ్రేటెడ్ సెన్సార్ శ్రేణితో వస్తుందని శాంసంగ్ హోన్ పాక్ ధృవీకరించింది. ఈ పరికరంలో హృదయ స్పందన పర్యవేక్షణ, బ్రీథింగ్ రేటు ట్రాకింగ్, స్లీప్ మూవ్మెంట్ ట్రాకింగ్, స్లీప్ స్టార్ట్ టైమ్ వంటి ఫీచర్లు ఉండొచ్చు. వీటితో పాటు శాంసంగ్ స్థాపించిన పార్టనర్ యాప్ నేచురల్స్ సైకిల్స్ ఇంటిగ్రేషన్‌తో.. ఈ శాంసంగ్ రింగ్‌లో సైకిల్- ఫర్టిలిటీ ట్రాకింగ్ ఫీచర్స్ కూడా ఉందే అవకాశం ఉంది.
Samsung Galaxy Ring expected price : రాబోయే శాంసంగ్ గెలాక్సీ రింగ్ వివిధ పరిమాణాలు, గణనీయమైన బ్యాటరీ లైఫ్ మద్దతుతో హెల్త్ ట్రాకింగ్‌కు అనుగుణంగా అనేక ఫీచర్లతో వస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరికరం ఇప్పుడు బ్లూటూత్ ఎస్ఐజి సర్టిఫికేషన్ వెబ్సైట్లో కనిపించినందున, దాని లాంచ్ 2024 ద్వితీయార్ధంలో కచ్చితంగా ఉంటుందని అంచనాలు పెరిగాయి.
ఈ గ్యాడ్జెట్ లాంచ్ డేట్‌తో పాటు ధర వంటి వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సప్ ఛానల్స్‌లో అందుబాటులో ఉంది! టెక్ ప్రపంచం నుంచి ఎటువంటి అప్డేట్ని మీరు మిస్ కాకుండా ఉండటానికి హెచ్‌టీ తెలుగు వాట్సాప్ ఛానెల్‌ని ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
సంబంధిత కథనం