తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Samsung Galaxy A55 : సామ్​సంగ్​ గెలాక్సీ ఏ55, గెలాక్సీ ఏ35 ధరల వివరాలు..

Samsung Galaxy A55 : సామ్​సంగ్​ గెలాక్సీ ఏ55, గెలాక్సీ ఏ35 ధరల వివరాలు..

Sharath Chitturi HT Telugu

16 March 2024, 9:00 IST

  • శాంసంగ్ గెలాక్సీ ఏ55, శాంసంగ్ గెలాక్సీ ఏ35 ధరల వివరాలు వెల్లడయ్యాయి. దీని ధర, లభ్యత మరియు మరెన్నో తెలుసుకోండి.

సామ్​సంగ్​ గెలాక్సీ ఏ55, ఏ35 ధర వివరాలను చెక్​ చేశారా?
సామ్​సంగ్​ గెలాక్సీ ఏ55, ఏ35 ధర వివరాలను చెక్​ చేశారా? (Samsung)

సామ్​సంగ్​ గెలాక్సీ ఏ55, ఏ35 ధర వివరాలను చెక్​ చేశారా?

Samsung Galaxy A55 price in India : సామ్​సంగ్​ తన గెలాక్సీ ఏ సిరీస్​లోని సామ్​సంగ్ గెలాక్సీ ఏ55 5జీ, గెలాక్సీ ఏ 35 5జీలను ఇటీవలే ఇండియాలో లాంచ్​ చేసింది. ఇక ఇప్పుడు.. ఈ మోడల్స్​కి చెందిన ధరలను రివీల్​ చేసింది ఈ దిగ్గజ టెక్​ సంస్థ. ఈ నేపథ్యంలో ఈ సామ్​సంగ్​ కొత్త స్మార్ట్​ఫోన్స్​ ధరలు, ఆఫర్స్​, ఫీచర్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ట్రెండింగ్ వార్తలు

Tesla in India : ఇండియాలో ఎంట్రీపై టెస్లా మౌనం.. ఎలాన్​ మస్క్​కి ఇంకేం కావాలో!

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

సామ్​సంగ్​ కొత్త స్మార్ట్​ఫోన్స్​- ధరలు..

సామ్​సంగ్ గెలాక్సీ ఏ55.. మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి.. ఆసమ్​ ఐస్ బ్లూ, ఆసమ్​ లీలాక్, ఆసమ్​ నేవీ. ఇక ఈ సామ్​సంగ్ గెలాక్సీ ఏ55లో మూడు ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్లు ఉంటాయి. 8 జీబీ + 128 జీబీ ధర రూ.36999, 8 జీబీ + 256 జీబీ ధర రూ.39999, 12 జీబీ + 256 జీబీ ధర వరుసగా రూ.42,999గా ఉన్నాయి.

ఇక సామ్​సంగ్ గెలాక్సీ ఏ35.. రెండు కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటుంది. 8 జీబీ + 128 జీబీ, 8 జీబీ + 256 జీబీ. ఇవి వరుసగా రూ .27999- రూ .30999 కు లభిస్తాయి.

Samsung Galaxy A35 price in India : సామ్​సంగ్ ఆన్​లైన్​ స్టోర్, సామ్​సంగ్ స్టోర్స్​తో పాటు వివిధ ఛానెళ్ల ద్వారా ఈ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. దీనికి తోడు త్వరలోనే ఆన్​లైన్​ ప్లాట్​ఫామ్స్​లో కూడా కొనుగోలు చేసుకోవచ్చు.

ఎక్స్​క్లూజివ్ ఆఫర్స్​..

ఈ కొత్త స్మార్ట్​ఫోన్స్​పై.. అదనపు బోనస్​గా సామ్​సంగ్ కాంప్లిమెంటరీ యాక్సెసరీస్, గణనీయమైన బ్యాంక్ డిస్కౌంట్లతో మంచి డీల్​ను పొందొచ్చు! సామ్​సంగ్ గెలాక్సీ ఏ35 స్మార్ట్​ఫోన్​ కొనుగోలు చేసేవారికి రూ.1499 విలువైన ఉచిత కార్డ్ స్లాట్ కేస్​తో పాటు రూ.3000 ఇన్​స్టంట్​ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. అదేవిధంగా.. సామ్​సంగ్ గెలాక్సీ ఏ55 కొనుగోలుదారులకు అదే బ్యాంక్ డిస్కౌంట్​తో పాటు రూ .1999 విలువైన కాంప్లిమెంటరీ సిలికాన్ కేస్ లభిస్తుంది.

సామ్​సంగ్​ గెలాక్సీ ఎ 55 5 జి స్పెసిఫికేషన్స్..

Samsung Galaxy A55 features : సామ్​సంగ్​ గెలాక్సీ ఏ55లో.. 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్ వచ్చే 6.6 ఇంచ్​ సూపర్​ అమోలెడ్​ డిస్​ప్లే వస్తుంది. దీనికి గొరిల్లా గ్లాస్​ విక్టస్​ ప్రొటెక్షన్​ లభిస్తుంది. గెలాక్సీ ఏ55లో ఇన్​-హైస్​ ఎక్సినోస్​ 1480 ప్రాసెసర్​ ఉండనుంది. 8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​, 8జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ వేరియంట్స్​ ఇందులో ఉంటాయి. ఇక ఈ సామ్​సంగ్​ స్మార్ట్​ఫోన్​.. ఆండ్రాయిడ్​ 14 ఆధారిత వన్​ యూఐ 6.1 సాఫ్ట్​వేర్​పై పనిచేస్తుందని సంస్థ చెప్పింది.

ఈ సామ్​సంగ్​ గెలాక్సీ ఏ55 స్మార్ట్​ఫోన్​లో 50ఎంపీ ప్రైమరీ, 12ఎంపీ అల్ట్రావైడ్​, 5ఎంపీ మాక్రో లెన్స్​తో కూడిన ట్రిపుల్​ కెమెరా సెటప్​ రేర్​లో ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 32 ఎంపీ ఫ్రెంట్​ కెమెరా లభిస్తుంది. 5000 ఎంఏహెచ్​ బ్యాటరీపై ఈ గ్యాడ్జెట్​ పనిచేస్తుంది.

సామ్​సంగ్​ గెలాక్సీ ఏ35 స్పెసిఫికేషన్లు..

Samsung Galaxy A35 specifications : సామ్​సంగ్​ గెలాక్సీ ఏ35లో 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​ కలిగిన ఫుల్​ హెచ్​డీ+ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. ఎక్సినోస్​ 1380 ప్రాసెసర్​ దీని సొంతం. ఆండ్రాయిడ్​ 14 ఆధారిత వన్​ యూఐ 6.1 సాఫ్ట్​వేర్​పై ఇది పనిచేస్తుందని సంస్థ చెప్పింది. ఈ సామ్​సంగ్​ గెలాక్సీ ఏ35 5జీ స్మార్ట్​ఫోన్​లో 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రావైడ్​, 5ఎంపీ మాక్రో లెన్స్​తో కూడిన ట్రిపుల్​​ కెమెరా సెటప్ రేర్​లో​ వస్తోంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 13ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఉంటుంది. ఇందులో కూడా 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ లభిస్తోంది.

తదుపరి వ్యాసం