Samsung 5G smartphones: సామ్సంగ్ 5 జీ స్మార్ట్ ఫోన్స్ లో బెస్ట్ ఇవే..
స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు ఇప్పుడు 5జీ మొబైల్స్ ను ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ సామ్సంగ్ అందుబాటు ధరలో 5 జీ ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది.
స్మార్ట్ ఫోన్ (smart phone) తయారీ కంపెనీలు ఇప్పుడు 5జీ మొబైల్స్ ను ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ సామ్సంగ్ (Samsung) అందుబాటు ధరలో 5 జీ ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. రూ. 20 వేల లోపు ధరలో సామ్సంగ్ 5జీ ఫోన్స్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
Samsung Galaxy M33 5G : సామ్సంగ్ గెలాక్సీ ఎం 33
రూ. 20 వేల లోపు ధరలో అడ్వాన్స్డ్ ఫీచర్లతో ఈ ఫోన్ ను రూపొందించారు. ఇందులో బెస్ట్ ఫర్మార్మెన్స్ ఇచ్చే ఆక్టా కోర్ 5 ఎన్ఎం ప్రాసెసర్ ను అమర్చారు. స్పష్టమైన వాయిస్ ను అందించే వాయిస్ ఫోకస్ (Voice Focus) టెక్నాలజీని వాడారు. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంది. 6 జీబీ ర్యామ్ ను పొందుపర్చారు.
Samsung Galaxy A 14 : సామ్సంగ్ గెలాక్సీ ఏ 14
సామ్సంగ్ (Samsung) నుంచి వచ్చిన మరో 5 జీ ఫోన్ ఇది. ఇది ప్రత్యేకంగా 5 జీ బ్రౌజింగ్ కోసం డిజైన్ చేయబడింది. ఇందులో 16.72 సెంటీమీటర్ల ఇన్ఫినిటీ వీ డిస్ ప్లేను, 50 ఎంపీ కెమెరాను, 6 జీబీ ర్యామ్ ను, అక్టాకోర్ 5జీ ప్రాసెసర్ ను, 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఈ మోడల్ మూడు రంగుల్లో లభిస్తుంది. ఆండ్రాయిడ్ ఓఎస్ 13 పై పని చేస్తుంది.
Samsung M13 5 G: సామ్సంగ్ ఎం 13
ఇందులోని 4జీబీ ర్యామ్ ను 12 జీబీ వరకు పెంచుకోవడం ఈ 5 జీ ఫోన్ లోని ప్రత్యేకత. ఇందులో కూడా 50 ఎంపీ కెమెరాను అమర్చారు. ఈ సామ్సంగ్ బడ్జెట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. 6 జీబీ ర్యామ్ (6 GB RAM) తో మరో వేరియంట్ ను కూడా మార్కెట్లో విడుదల చేశారు.
Samsung Galaxy Z Flip4: సామ్సంగ్ గెలాక్సీ జీ ఫ్లిప్ 4
సామ్సంగ్ (Samsung) నుంచి వచ్చిన ఫోల్డబుల్ 5 జీ ఫోన్ ఇది. పూర్తి అడ్వాన్స్ డ్ ఫీచర్లతో దీన్ని రూపొందించారు. ఇది బడ్జెట్ ఫోన్ కేటగిరీలోకి రాదు. దీని 6.7 అంగుళాల డిస్ ప్లే కు వాటర్ రెసిస్టెంట్, యాంటీ స్క్రాచ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ (corning gorilla glass victus plus) సెక్యూరిటీని కల్పించారు. 8 జీబీ ర్యామ్ (8GB RAM)ఉంది. ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీ ఉంది. ఫోల్డెడ్ స్క్రీన్ తో కూడా ఫొటోలు తీసుకోవచ్చు. అందుకు గానూ ఫ్లెక్స్ కామ్ (FlexCam) ఫీచర్ ను పొందుపర్చారు.
Three best features for consumers: ఈ ఫోన్లలోని బెస్ట్ ఫీచర్స్..
Product | Feature 1 | Feature 2 | Feature 3 |
Samsung galaxy m33 5g | Superfast performance with 5nm Processor | Long-lasting 6000 mAh Battery | Voice focus technology for excellent sound clarity |
Samsung galaxy A14 5G | 50 MP main camera for capturing excellent mages | Octacore 5G processor for super fast browsing | Availability of 3 awesome colour variants |
Samsung M13 5 G | 11 bands supported 5 G speed | Monster camera with 50 MP camera for flawless capturing of images | Highly stylish and attractive |
Samsung Galaxy Z Flip4 | Folding screen | FlexCam feature | Quick charging |