తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Jio Freedom Offers : జియో ఫ్రీడం ఆఫర్​- తక్కువ ధరకే ఎయిర్​ఫైబర్​ కనెక్షన్​ పొందండి..

Jio Freedom Offers : జియో ఫ్రీడం ఆఫర్​- తక్కువ ధరకే ఎయిర్​ఫైబర్​ కనెక్షన్​ పొందండి..

Sharath Chitturi HT Telugu

26 July 2024, 12:05 IST

google News
    • Jio Freedom Offer 2024 : జియో ఫ్రీడం ఆఫర్​ని ప్రకటించింది. ఇప్పుడు తక్కువ ధరకే ఎయిర్​ఫైబర్​ కనెక్షన్​ పొందొచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
జియో ఫ్రీడమ్​ ఆఫర్స్​..
జియో ఫ్రీడమ్​ ఆఫర్స్​..

జియో ఫ్రీడమ్​ ఆఫర్స్​..

సరికొత్త 'ఫ్రీడం' ఆఫర్స్​ని ప్రకటించింది రిలయన్స్​ జియో. కొత్తగా తీసుకునే ఎయిర్​ఫైబర్​ కనెక్షన్స్​కి ఈ ఆఫర్స్​ వర్తిస్తాయని వెల్లడించింది. 30శాతం డిస్కౌంట్​లో భాగంగా నూతన వినియోగదారులకు ఈ బ్రాడ్​బ్యాండ్ కోసం చెల్లించాల్సిన​ రూ. 1000 విలువ చేసే ఇన్​స్టాలేషన్​ ఛార్జీలను జియో తొలగించింది. 2024 జులై 26 నుంచి ఆగస్ట్​ 15 వరకు ఈ జియో ఫ్రీడం ఆఫర్స్​ అందుబాటులో ఉంటాయి.

జియో ఎయిర్​ఫైబర్​ ప్లాన్​ వివరాలు..

  • 3 నెలల స్టాండర్డ్​ ప్లాన్​- రూ. 2,121
  • ఇన్​స్టాలేషన్​ ఛార్జీలు- రూ. 1,000
  • మొత్తం- రూ. 3,121

కానీ ఫ్రీడం ఆఫర్​లో భాగంగా ఇన్​స్టాలేషన్​ ఛార్జీలు తొలగించడంతో కొత్త వినియోగదారులకు ఎయిర్​ఫైబర్​ కనెక్షన్​ రూ. 2,121కే లభిస్తోంది.

ఫ్రీడం ఆఫర్​ని ఎలా పొందాలి? ఎవరు అర్హులు?

  • కొత్త జియో ఎయిర్​ఫైబర్​ కనెక్షన్​ కోసం రిలయన్స్​ వెబ్​సైట్​ని సందర్శించి, రిజిస్టర్​ చేసుకోండి. లేదా 60008-60008 కి మిస్డ్​ కాల్​ ఇవ్వండి.
  • ఆగస్ట్​ 15లోపు జరిగే కొత్త బుకింగ్స్​తో పాటు ప్రస్తుతం ఉన్న బుకింగ్స్​కి కూడా ఈ జియో ఫ్రీడం ఆఫర్​ వర్తిస్తుంది.
  • 3 నెలలు, 6న నెలలు, 12 నెలల ప్లాన్​లకు ఈ ఆఫర్​ వర్తిస్తుంది.
  • జియో ఎయిర్​ఫైబర్​ 5జీ, కొత్త యూజర్లు ఈ ఆఫర్​ పొందొచ్చు.

జియోఫైబర్​/ ఎయిర్​ఫైబర్​ సేవలు దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నాయి. భారత్​ను డిజిటల్​ సొసైటీగా మలచే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ ఎయిర్​ఫైబర్​పై ఇప్పుడు 30శాతం డిస్కౌంట్​ లభిస్తుండటం వినియోగదారులకు చక్కటి అవకాశంగా మారుతుందని జియో చెప్పుకొచ్చింది.

జియో రీఛార్జ్​ ధరలు పెరిగాయి..

మరోవైపు రిలయన్స్​ జియో తన మొబైల్​ రీఛార్జ్​ ధరలను ఇటీవలే పెంచిన విషయం తెలిసిందే. దాదాపు 25శాతం ధరలను పెంచింది. వార్షిక ప్లాన్స్​పై గరిష్ఠంగా రూ. 600 పెరిగింది. నెలవారీ రీఛార్జ్​ ప్లాన్​ ధరలు సైతం పెరిగాయి.

జియో కొత్త టారిఫ్ లో ప్రముఖ ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలు భారీగా పెరిగాయి. ఎంట్రీ-లెవల్ నెలవారీ ప్లాన్ గతంలో 28 రోజుల పాటు 2 జీబీ డేటా కోసం రూ. 155 ధరలో ఉండేది. ఇప్పుడు ఆ ప్లాన్ ధర రూ. 189 చేరింది. 28 రోజుల వ్యవధిలో రోజుకు 1 జీబీ ప్లాన్‌ని ఎంచుకునేందుకు రూ. 209 నుంచి రూ. రూ. 249 చెల్లించాల్సి ఉంది. రోజుకు 1.5 జీబీ ప్లాన్ ధర రూ. 239 నుంచి రూ. 299కు పెరిగింది. రోజుకు 2 జీబీ ప్లాన్ ఇప్పుడు రూ. 299 నుంచి రూ. 349కి పెరిగింది. అధిక డేటా వినియోగం కోసం రోజుకు 2.5 జీబీ ప్లాన్ రూ. 349 నుంచి రూ. 399కి పెంచింది. రోజుకు 3 GB ప్లాన్ ను రూ. 399 నుంచి రూ. 449కి పెంచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

రిలయన్స్​ జియో మాత్రమే కాదు.. ఎయిర్​టెల్​, వొడాఫోన్​ఐడియాలు సైతం ప్రైజ్​ హైక్​ తీసుకున్నాయి. భారీగా పెరుగుతున్న రీఛార్జ్​ ధరలతో ప్రజల చూపు బీఎస్​ఎన్​ఎల్​పై పడినట్టు కనిపిస్తోంది. దిగ్గజ టెలికాం సంస్థలు ధరలను పెంచిన వెంటనే.. బీఎస్​ఎన్​ఎల్​కు దాదాపు 2.5లక్షల పోర్టెబులిటీ రిక్వెస్ట్​లు అందాయట.

తదుపరి వ్యాసం