Reliance Jio Q1 Results: క్యూ1 లో రిలయన్స్ జియో నికర లాభం రూ.5,445 కోట్లు
19 July 2024, 18:47 IST
- Reliance Jio Q1 Results: 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఫలితాలను రిలయన్స్ జియో శుక్రవారం ప్రకటించింది. ఈ క్యూ 1 (Q1FY25) లో రిలయన్స్ జియో నికర లాభం రూ. 5,445 కోట్లు. గత సంవత్సరం క్యూ 1 తో పోలిస్తే, ఇది 2.03 శాతం అధికం.
రిలయన్స్ జియో క్యూ1 నికర లాభం రూ.5,445 కోట్లు
Reliance Jio Q1 Results: రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ 2024 జూన్ తో ముగిసిన త్రైమాసికానికి (Q1FY25) స్టాండ్ఎలోన్ నికర లాభం 2.02 శాతం పెరిగి రూ.5,445 కోట్లకు చేరుకుంది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్యకలాపాల ద్వారా టెలికాం కార్యకలాపాల ఆదాయం జూన్ తో ముగిసిన త్రైమాసికంలో 2 శాతం పెరిగి రూ .26,478 కోట్లకు చేరుకుంది. శుక్రవారం బీఎస్ ఈలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర 1.92 శాతం నష్టంతో రూ.3,109.50 వద్ద ముగిసింది.
గత త్రైమాసికంలో..
2024 జూన్ తో ముగిసిన త్రైమాసికం (Q1FY24) లో రిలయన్స జియో (Reliance Jio) స్టాండలోన్ నికర లాభం 12 శాతం పెరిగిందని, గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (Q4FY24) లో రిలయన్స్ జియో (Reliance Jio) నికకర లాభం రూ.4,863 కోట్లుగా ఉందని సంస్థ తెలిపింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.24,042 కోట్ల నుంచి 10.1 శాతం పెరిగింది. ఈ త్రైమాసికంలో నిర్వహణ మార్జిన్ 26.7 శాతంగా ఉంది. గత ఏడాది క్యూ 1 లో అది 26.2 శాతంగా ఉంది. జూన్ చివరి నాటికి (Q1FY25) డెట్-టు-ఈక్విటీ నిష్పత్తి Q1FY24 తో పోలిస్తే 0.21 రెట్లు ఎక్కువగా ఉంది. Q1FY24 లో డెట్ టు ఈక్విటీ నిష్పత్తి 0.22 రెట్లు పెరిగింది.