Tata Altroz Racer : టాటా ఆల్ట్రోజ్​ రేసర్​ బుకింగ్స్​ షురూ.. ఇంకొన్ని రోజుల్లో లాంచ్​!-tata altroz racer bookings open unofficially launch soon ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Altroz Racer : టాటా ఆల్ట్రోజ్​ రేసర్​ బుకింగ్స్​ షురూ.. ఇంకొన్ని రోజుల్లో లాంచ్​!

Tata Altroz Racer : టాటా ఆల్ట్రోజ్​ రేసర్​ బుకింగ్స్​ షురూ.. ఇంకొన్ని రోజుల్లో లాంచ్​!

Sharath Chitturi HT Telugu
Jun 02, 2024 11:10 AM IST

Tata Altroz Racer bookings : లాంచ్​కి ముందు.. టాటా ఆల్ట్రోజ్​ రేసర్​పై కీలక అప్డేట్​! ఈ మోడల్​ బుకింగ్స్​ ఓపెన్​ అయ్యాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఇదిగో.. టాటా ఆల్ట్రోజ్​ రేసర్​!
ఇదిగో.. టాటా ఆల్ట్రోజ్​ రేసర్​!

Tata Altroz Racer on road price Hyderabad : మచ్​ అవైటెడ్​ టాటా ఆల్ట్రోజ్​ రేసర్​పై మరో కీలక అప్డేట్​! ఆల్ట్రోజ్​ స్పోర్టియర్​ వర్షెన్​గా వస్తున్న ఈ హ్యాచ్​బ్యాక్​ బుకింగ్స్​ మొదలయ్యాయి! దేశవ్యాప్తంగా.. పలు ఎంపిక చేసిన టాటా మోటార్స్​ డీలర్​షిప్​ షోరూమ్స్​లో టాటా ఆల్ట్రోజ్​ రేసర్​ అనధికారిక బుకింగ్స్​ ఓపెన్​ అయ్యాయి. రూ. 21వేల టోకెన్​ అమౌంట్​తో.. ఈ కారును బుక్​ చేసుకోవచ్చు. కాగా.. ఈ నెల మధ్యలో లాంచ్​కు రెడీ అవుతున్న ఈ ఆల్ట్రోజ్​ రేసర్​ అధికారిక బుకింగ్స్​.. ఇంకొన్ని రోజుల్లో మొదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ హ్యాచ్​బ్యాక్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

టాటా ఆల్ట్రోజ్​ రేసర్​..

2023 ఆటో ఎక్స్​పోలో ఆల్ట్రోజ్ రేసర్​ హ్యాచ్​బ్యాక్​ను మొదట ప్రదర్శించింది దిగ్గజ్​ఆటోమొబైల్​ సంస్థ టాటా మోటార్స్​. ప్రోడక్షన్ మోడల్​లో బ్లాక్-అవుట్ బానెట్, రూఫ్, ఓఆర్​వీఎం​లతో పాటు బానెట్ పైకప్పు వెంటే ఉండే డ్యూయెల్ వైట్ రేసింగ్ చారలు కనిపిస్తున్నాయి. ఇది కారుకు.. ఆకర్షణీయమైన, అగ్రెసివ్​ రూపాన్ని ఇస్తుంది.

Tata Altroz Racer bookings : స్టాండర్డ్ ఆల్ట్రోజ్ కంటే ఆల్ట్రోజ్ రేసర్​కు అతిపెద్ద మార్పు.. దాని ఇంజిన్​. 110 బీహెచ్​పీ స్టాండర్డ్​ అల్ట్రోజ్​ ఐటర్బో ఇంజిన్​ కాకుండా.. కొత్త టాటా ఆల్ట్రోజ్​ రేసర్​లో 120 బీహెచ్​పీ 1.2 లీటర్​ యూనిట్​ ఉండనుంది. టాటా నెక్సాన్​లోనూ ఇదే ఇంజిన్​ ఉంటుంది.

ఆల్ట్రోజ్ రేసర్ ధర.. ప్రస్తుతం రూ .9.20 లక్షల–10.10 లక్షల (ఎక్స్-షోరూమ్) శ్రేణిలో ఉన్న ఐటర్బో కంటే ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.

లాంచ్​ తర్వాత.. ఈ టాటా ఆల్ట్రోజ్​ రేసర్​.. హ్యుందాయ్​ ఐ20, మారుతీ సుజుకీ బలెనో వంటి మోడల్స్​కి గట్టిపోటీని ఇచ్చేందుకు రెడీ అవుతోంది.

Tata Altroz Racer launch date India : ఇక టాటా ఆల్ట్రోజ్​ రేసర్​తో సేల్స్​ని పెంచుకోవాలని టాటా మోటార్స్​ భావిస్తోంది. టాటా ఆల్ట్రోజ్​కు మంచి డిమాండ్​ ఉంది. ఆల్ట్రోజ్​ రేసర్​ కూడా కస్టమర్లను ఆకర్షింస్తుందని సంస్థ ఆశలు పెట్టుకుంది. ఇక ఇందులో సీఎన్​జీ వర్షెన్​ వస్తుందో రాదో చూడాలి.

టాటా ఆల్ట్రోజ్​ రేసర్​ లాంచ్​ డేట్​తో పాటు ఇతర వివరాలపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ వివరాలను త్వరలోనే మేము మీకు అప్డేట్​ చేస్తాము.

టాటా మోటార్స్​ మే నెల సేల్స్​..

Tata Altroz Racer price : మే నెలకు సంబంధించిన ఆటో సేల్స్​ని ప్రకటించింది. టాటా మోటార్స్​. 2023 మే(74,973)తో పోల్చుకుంటే.. 2024 మే(76,766)లో 2శాతం అధికంగా యూనిట్​లను విక్రయించింది. వీటిల్లో 75,173 యూనిట్​లను దేశీయంగా విక్రయించింది. మే నెలలో 47,075 ప్యాసింజర్​ వెహికిల్స్​ని విక్రయించింది సంస్థ. కమ్షియల్​ వెహికిల్​ సెగ్మెంట్​.. 2శాతం అభివృద్ధి చెందింది. మే నెలలో 29,691 యూనిట్​లని అమ్మింది. ఎఫ్​వై25 క్యూ1లో సేల్స్ కాస్త నెమ్మదిస్తాయని.. గత నెలలోనే వెల్లడించింది టాటా మోటార్స్​.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లో.. టాటా మోటార్స్​ షేరు ధర రూ. 924.50గా ఉంది. నెల రోజుల్లో ఈ స్టాక్​ 10శాతం పడినప్పటికీ.. ఏడాదిలో దాదాపు 73శాతం పెరగడం విశేషం.​

Whats_app_banner

సంబంధిత కథనం