తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Fortune 500 Rankings : ఫార్చ్యూన్​ 500 ర్యాంకింగ్స్​లో మెరుగైన రిలయన్స్​ స్థానం.. ఎక్కడ ఉందంటే!

Fortune 500 rankings : ఫార్చ్యూన్​ 500 ర్యాంకింగ్స్​లో మెరుగైన రిలయన్స్​ స్థానం.. ఎక్కడ ఉందంటే!

Sharath Chitturi HT Telugu

06 August 2024, 6:40 IST

google News
  • Fortune 500 rankings Reliance : బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫార్చ్యూన్ 500 కంపెనీల జాబితాలో రెండు స్థానాలు ఎగబాకింది. ఇప్పుడు ఏ స్థానంలో ఉందంటే..

ఫార్చ్యూన్​ 500 ర్యాంకింగ్స్​లో మెరుగైన రిలయన్స్​ స్థానం
ఫార్చ్యూన్​ 500 ర్యాంకింగ్స్​లో మెరుగైన రిలయన్స్​ స్థానం (Bloomberg)

ఫార్చ్యూన్​ 500 ర్యాంకింగ్స్​లో మెరుగైన రిలయన్స్​ స్థానం

బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 2024లో ఫార్చ్యూన్ 500 కంపెనీల జాబితాలో రెండు స్థానాలు ఎగబాకింది. 88వ స్థానం నుంచి 86వ స్థానానికి చేరుకుంది.

ఫార్చ్యూన్​ 500లో రిలయన్స్​ ఇండస్ట్రీస్​..

ఆయిల్స్-టు-కెమికల్స్ (ఓ2సీ) రిఫైనింగ్ దిగ్గజం రిలయన్స్​ మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా భారత్​లోనే అతిపెద్ద కంపెనీ. ఆగస్టు 5 నాటికి ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.19.585 ట్రిలియన్లుగా ఉందని కంపెనీస్మార్కెట్ క్యాప్ డేటా తెలిపింది.

ఫార్చ్యూన్ 500 జాబితాలోని అన్ని భారతీయ కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ తన అత్యున్నత స్థానాన్ని నిలబెట్టుకుంది. ఫార్చ్యూన్ 500 జాబితాలో ప్రస్తుతం 86వ స్థానంలో ఉండటం చమురు శుద్ధి సంస్థ ఇప్పటివరకు సాధించిన అత్యధిక ర్యాంకు.

ఫార్చ్యూన్ 500 జాబితాలో భారత్​కు చెందిన 9 కంపెనీలు ఉన్నాయి. వీటిలో ఐదు ప్రభుత్వ రంగంలో, మిగిలిన నాలుగు ప్రైవేట్ రంగంలో ఉన్నాయి.

ఫార్చ్యూన్ 500 జాబితాలు ఒక కంపెనీ మొత్తం ఆదాయాలను లెక్కిస్తాయి. జాబితాలే చేర్చేందుకు కంపెనీల అర్హతను ఆదాయం నిర్ణయిస్తుంది. 2024 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి రిలయన్స్ 2.6 శాతం వృద్ధితో రూ.10,00,122 కోట్లకు చేరుకుంది. కంపెనీ ఎబిట్​డా వార్షిక ప్రాతిపదికన 16.1 శాతం పెరిగి రూ .1,78,677 కోట్లకు చేరుకుంది. ఇందులో అధిక వాటా కంపెనీ ఓ2సీ, ఆయిల్ అండ్ గ్యాస్, రిటైల్, డిజిటల్ సేవలవి ఉన్నాయి.

"గ్లోబల్ 500 వ్యాపార విజయానికి అంతిమ స్కోర్​కార్డ్​. 2023లో ఫార్చ్యూన్ గ్లోబల్ 500 మొత్తం ఆదాయం 41 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆ మొత్తం ప్రపంచ జీడీపీలో మూడింట ఒక వంతుకు పైగా ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ కంపెనీలకు ఆర్థిక శక్తి ఎంత కేంద్రీకృతమై ఉందో ఇది సూచిస్తుంది," అని ఫార్చ్యూన్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ స్కాట్ డికార్లో ఒక ప్రకటనలో తెలిపారు.

ఫార్చ్యూన్​ 500 లిస్ట్​లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) 95వ స్థానం, ఇండియన్ ఆయిల్ 116వ స్థానం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 178వ స్థానం, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) 180వ స్థానం, భారత్ పెట్రోలియం (బీపీసీఎల్) 258వ స్థానంలో నిలిచాయి. ఫార్చ్యూన్ 500 గణాంకాల ప్రకారం టాటా మోటార్స్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, రాజేష్ ఎక్స్​పోర్ట్స్​ వరుసగా 271, 306, 463 స్థానాల్లో నిలిచాయి.

రిలయన్స్​ షేరు ప్రైజ్​ హిస్టరీ..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ ముగిసే సమయానికి రిలయన్స్​ షేరు 3.4శాతం పడి 2,896కి చేరింది. ఐదు రోజుల్లో సంస్థ షేర్లు 4.5శాతం పడింది. నెల రోజుల్లో ఇది దాదాపు 10శాతంగా ఉంది. ఆరు నెలల వ్యవధిలో రిలయన్స్​ షేర్లు 1.5శాతం పెరిగాయి. కాగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు 11.8శాతం వృద్ధిని నమోదు చేశాయి.

రిలయన్స్​ స్టాక్​ 52 వీక్​ హై 3,217.6గా ఉంది.

తదుపరి వ్యాసం