Nabha Natesh : హయత్ నగర్ లో రిలయన్స్ డిజిటల్ నూతన స్టోర్, ప్రారంభించిన నభా నటేష్-hayathnagar actress nabha natesh open new reliance digital store signed on products ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Nabha Natesh : హయత్ నగర్ లో రిలయన్స్ డిజిటల్ నూతన స్టోర్, ప్రారంభించిన నభా నటేష్

Nabha Natesh : హయత్ నగర్ లో రిలయన్స్ డిజిటల్ నూతన స్టోర్, ప్రారంభించిన నభా నటేష్

Bandaru Satyaprasad HT Telugu
Aug 03, 2024 05:49 PM IST

Nabha Natesh : హైదరాబాద్ హయత్ నగర్ లో రిలయన్స్ డిజిటల్ కొత్త స్టోర్ ను సినీ నటి నభా నటేష్ ప్రారంభించారు. కస్టమర్లకు నటి నభా నటేష్ సంతకం చేసిన ప్రొడక్ట్స్ అందించారు.

హయత్ నగర్ లో రిలయన్స్ డిజిటల్ నూతన స్టోర్, ప్రారంభించిన నభా నటేష్
హయత్ నగర్ లో రిలయన్స్ డిజిటల్ నూతన స్టోర్, ప్రారంభించిన నభా నటేష్

Nabha Natesh : రిలయన్స్ డిజిటల్ తన నూతన స్టోర్ ను హైదరాబాద్ హయత్ నగర్ లోని బాగత్ విలేజ్ ఆర్టీసీ సూపర్ వైజర్స్ కాలనీ ఎదురుగా ప్రారంభించింది. ఈ స్టోర్ లో సరసమైన ధరలలో లేటెస్ట్ ఎలక్ట్రానిక్స్ అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. అలాగే ఇన్-స్టోర్ సహాయం కోసం నిపుణులైన టెక్ స్క్వాడ్, ఎలక్ట్రానిక్స్ కొనుగోలు అనంతర సంరక్షణకు అంకితమైన రెస్క్యూ సర్వీస్ నిపుణులను అందుబాటులో ఉన్నారని తెలిపారు. వేగవంతమైన డెలివరీ, ఇన్ స్టాలేషన్ తో వినియోగదారులు ఎటువంటి ఆలస్యం లేకుండా తమకు ఇష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందవచ్చని తెలిపారు.

రిలయన్స్ డిజిటల్ హయత్ నగర్ స్టోర్ ను ప్రముఖ నటి నభా నటేష్ ప్రారంభించారు. నటి నభా నటేష్ మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొని ఎక్స్ క్లూజివ్ గా సంతకం చేసిన సరుకులను అందుకునే అవకాశం కూడా కల్పించారు. రిలయన్స్ డిజిటల్ కొత్త స్టోర్లో అద్భుతమైన ఎర్లీ బర్డ్ ఆఫర్లతో ప్రముఖ బ్యాంక్ కార్డులపై 10% వరకు తక్షణ తగ్గింపును అందిస్తోంది.

500 పైగా బ్రాండ్లు

రిలయన్స్ డిజిటల్ 500కు పైగా అంతర్జాతీయ, జాతీయ బ్రాండ్లకు చెందిన 2,000కు పైగా ఉత్పత్తులను అందిస్తోంది. వీటిలో తాజా స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, హోమ్ థియేటర్లు, డిజిటల్ కెమెరాలు, ల్యాప్ టాప్లు, యాక్సెసరీస్, ఇతర చిన్న ఎలక్ట్రానిక్స్ వస్తువులతో సహా వినియోగదారుల ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు అందిస్తున్నారు.

పర్సనలైజింగ్ టెక్నాలజీ

"పర్సనలైజింగ్ టెక్నాలజీ" నినాదానికి అనుగుణంగా, రిలయన్స్ డిజిటల్ వినియోగదారులకు సరసమైన ధరలలో సాంకేతిక ఎంపికల ప్రపంచాన్ని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈజీ ఈఎమ్ఐతో సహా మల్టీ ఫైనాన్స్ ఎంపికలతో ఎలక్ట్రానిక్ పరికరాలపై తిరుగులేని డీల్స్ ను అందించడం ద్వారా, రిలయన్స్ డిజిటల్ ప్రతి కస్టమర్ వారి జీవనశైలికి తగిన కచ్చితమైన సాంకేతికతను అందించడంలో సహాయపడటం లక్ష్యంగా పెట్టుకుందని నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత కథనం