తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Redmi Note 13 Launch : రెడ్​మీ నోట్​ 13 సిరీస్​ లాంచ్​- 3 స్మార్ట్​ఫోన్స్​.. సూపర్​ ఫీచర్స్​!

Redmi Note 13 launch : రెడ్​మీ నోట్​ 13 సిరీస్​ లాంచ్​- 3 స్మార్ట్​ఫోన్స్​.. సూపర్​ ఫీచర్స్​!

Sharath Chitturi HT Telugu

04 January 2024, 18:18 IST

    • Redmi Note 13 launch : రెడ్​మీ నోట్​ 13 సిరీస్​ ఇండియాలో లాంచ్​ అయ్యింది. ఇందులోని 3 స్మార్ట్​ఫోన్స్​, వాటి ఫీచర్స్​- ధరల వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
రెడ్​మీ నోట్​ 13 సిరీస్​ లాంచ్​..
రెడ్​మీ నోట్​ 13 సిరీస్​ లాంచ్​..

రెడ్​మీ నోట్​ 13 సిరీస్​ లాంచ్​..

Redmi Note 13 launch : షావోమీకి చెందిన రెడ్​మీ సంస్థ.. ఇండియాలో తాజాగా ఓ స్మార్ట్​ఫోన్​ సిరీస్​ని లాంచ్​ చేసింది. దీని పేరు రెడ్​మీ నోట్​ 13 సిరీస్​. ఇందులో మూడు గ్యాడ్జెట్స్​ ఉంటాయి. అవి.. రెడ్​మీ నోట్​ 13, నోట్​ 13 ప్రో, నోట్​ 13 ప్రో+. ఈ నేపథ్యంలో ఈ మోడల్స్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

రెడ్​మీ నోట్​ 13 ఫీచర్స్​ ఇవే..

రెడ్​మీ నోట్​ 13లో 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన ఫుల్​ హెచ్​డీ+ 6.67 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. స్క్రీన్​కి గొరిల్లా గ్లాస్​ 5 ప్రొటెక్షన్​ లభిస్తోంది. ఇక నోట్​ 13 ప్రో, నోట్​ 13 ప్రో+ స్మార్ట్​ఫోన్స్​కి కర్వ్​డ్​ ఎడ్జెస్​, గొరిల్లా గ్లాస్​ విక్టస్​ ప్రొటెక్షన్​ వంటివి లభిస్తున్నాయి. ఈ గ్యాడ్జెట్స్​.. డాల్బీ విజన్​, ఇన్​-స్క్రీన్​ ఫింగర్​ప్రింట్​ స్కానర్​ కూడా ఉన్నాయి.

Redmi Note 13 pro price in India : ఇక రెడ్​మీ నోట్​ 13 ప్రో+ లో 200ఎంపీ సామ్​సంగ్​ ఐఎస్​ఓసీఈఎల్​ఎల్​ హెచ్​పీ3 సెన్సార్​, 8ఎంపీ అల్ట్రా వైడ్​ సెన్సార్​, 2ఎంపీ లెన్స్​తో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా సెటప్​ వస్తోంది. నోట్​ 13 ప్రోలో కూడా ఇదే ఉంది. ఇక రెడ్​మీ నోట్​ 13లో 108ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ సెకెండరీ కెమెరాలు రేర్​లో వస్తున్నాయి.

సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ఈ మూడు స్మార్ట్​ఫోన్స్​లోనూ 16ఎంపీ కెమెరా వస్తోంది.

రెడ్​మీ నోట్​ 13 ప్రో+ లో మీడియాటెక్​ డైమెన్సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్​ ఉంటుంది. ప్రో మోడల్​కు క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 7ఎస్​ జెన్​ 2, స్టాండర్డ్​ మోడల్​కి మీడియాటెక్​ డైమెన్సిటీ 6080 ఎస్​ఓసీ చిప్​సెట్​లు వస్తున్నాయి.

Redmi Note 13 pro plus price in India : ప్రో+ మోడల్​లో 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ, 120వాట్​ వయర్డ్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ లభిస్తోంది. ప్రో వర్షెన్​లో 5,100ఎంఏహెచ్​ బ్యాటరీ విత్​ 67 వాట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ వస్తుంది. ఇక స్టాండర్డ్​ రెడ్​మీ నోట్​ 13లో 5000ఎంఏహెచ్​ బ్యాటరీ, 33వాట్​ ఛార్జింగ్​ వంటివి వస్తున్నాయి.

రెడ్​మీ నోట్​ 13 సిరీస్​ ధరల వివరాలు..

రెడ్​మీ నోట్​ 13 6జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 17,999.

8జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 19,999.

12జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 21,999. ఆర్కెటిక్​ వైట్​, ప్రిస్మ్​ గోల్డ్​, స్టెల్త్​ బ్లాక్​ కలర్​ ఆప్షన్స్​లో ఇవి అందుబాటులో ఉంటాయి.

Redmi Note 13 pro features : ఇక నోట్​ 13 ప్రో 8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​, 8జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​, 12జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ ధరలు వరుసగా రూ. 25,999- రూ. 27,999.- రూ. 29,999గా ఉన్నాయి.

ఇక రెడ్​మీ నోట్​ 13 ప్రో+ 8జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​, 12జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​, 12జీబీ ర్యామ్​- 512జీబీ స్టోరేజ్​ ధరలు వరుసగా రూ. 31,999- రూ. 33,999- రూ. 35,999గా ఉన్నాయి.

జనవరి 10న ఈ స్మార్ట్​ఫోన్స్​ సేల్స్​ మొదలవుతాయి.

తదుపరి వ్యాసం