Redmi Note 13 5G: జనవరి 4న భారత్ లో రెడ్ మి నోట్ 13 సిరీస్ ఫోన్ల లాంచ్; ఫీచర్స్, ప్రైస్, స్పెసిఫికేషన్స్ ఇవే..-redmi note 13 5g series to launch in india on january 4 all you need to know ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Redmi Note 13 5g: జనవరి 4న భారత్ లో రెడ్ మి నోట్ 13 సిరీస్ ఫోన్ల లాంచ్; ఫీచర్స్, ప్రైస్, స్పెసిఫికేషన్స్ ఇవే..

Redmi Note 13 5G: జనవరి 4న భారత్ లో రెడ్ మి నోట్ 13 సిరీస్ ఫోన్ల లాంచ్; ఫీచర్స్, ప్రైస్, స్పెసిఫికేషన్స్ ఇవే..

HT Telugu Desk HT Telugu
Dec 14, 2023 12:00 PM IST

Redmi Note 13 5G: చైనాకు చెందిన దిగ్గజ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్ మి నుంచి లేటెస్ట్ సిరీస్ అయిన నోట్ 13 సిరీస్ ఫోన్లు 2024 జనవరిలో భారత్ లో లాంచ్ కానున్నాయి. ఈ సిరీస్ లో రెడ్ మి నోట్ 13, రెడ్ మి నోట్ 13 ప్రొ, రెడ్ మి నోట్ 13 ప్రొ ప్లస్ మోడల్స్ ఉన్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Xiaomi)

Redmi Note 13 5G: రెడ్ మి నోట్ 13 సిరీస్ ఫోన్లు భారత్ లో జనవరి 4వ తేదీన లాంచ్ కానున్నాయి. ఈ సిరీస్ లో రెడ్ మి నోట్ 13 (Redmi Note 13), రెడ్ మి నోట్ 13 ప్రొ (Redmi Note 13 Pro), రెడ్ మి నోట్ 13 ప్రొ ప్లస్ (Redmi Note 13 Pro+) మోడల్స్ ఉన్నాయి. వీటిని చైనాలో సెప్టెంబర్ నెలలో అధికారికంగా లాంచ్ చేశారు.

Redmi Note 13 specifications: స్పెసిఫికేషన్స్

రెడ్ మి నోట్ 13 సిరీస్ లోని అన్ని ఫోన్లు 5 జీ టెక్నాలజీని సపోర్ట్ చేస్తాయి. ఈ ఫోన్లు 6.67 అంగుళాల అమొలెడ్ డిస్ ప్లే తో వస్తాయి. రెడ్ మి నోట్ 13 ప్రొ (Redmi Note 13 pro), రెడ్ మి నోట్ 13 ప్రొ ప్లస్ మోడల్స్ లో మాత్రం 1.5 కే డిస్ ప్లే ఉంటుంది. అలాగే, ప్రొ ప్లస్ వేరియంట్ లో కర్వ్డ్ డిస్ ప్లే ఉంటుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే, నోట్ 13 లో మీడియా టెక్ డైమెన్సిటీ 6080 ఎస్ఓసీ చిప్ సెట్ ఉంటుంది. Note 13 Pro లో స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2ఉంటుంది. నోట్ 13 ప్రొ ప్లస్ లో మీడియా టెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా ఎస్ఓసీ ఉంటుంది.

Redmi Note 13 features: ఫీచర్స్

రెడ్‌మి నోట్ 13 లో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అలాగే, 100 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2 ఎంపీ డెప్త్ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది. రెడ్ మి నోట్ 13 ప్రొ, రెడ్ మి నోట్ 13 ప్రొ + లలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంటుంది. రెడ్ మి నోట్ 13 ప్రొ మోడల్‌లలొ సామ్సంగ్ హెచ్ పీ 3 సెన్సార్‌తో 200 ఎంపీ ప్రైమరీ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2MP మాక్రో సెన్సార్‌ ఉన్నాయి.

Redmi Note 13 price: ధర

భారతదేశంలో రెడ్‌మి నోట్ 13 సిరీస్ ధరలను అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. అయితే, చైనాలో వీటి ధరలను పోలుస్తూ, భారత్ లో వీటి ధరలు ఎలా ఉండబోతున్నాయో అంచనా వేయవచ్చు. అలా, అంచనా వేస్తే, రెడ్ మి నోట్ 13 ధర సుమారు రూ. 14000 ఉండవచ్చు. అలాగే, రెడ్ మి నోట్ 13 ప్రొ ధర సుమారు రూ. 17,600, రెడ్ మి నోట్ 13 ప్రొ ప్లస్ ధర సుమారు రూ. 23,500 ఉండవచ్చు.

Whats_app_banner