Redmi Note 13 Pro+ : 200ఎంపీ కెమెరాతో.. రెడ్మీ నోట్ 13 ప్రో+
Redmi Note 13 Pro+ : రెడ్మీ నోట్ 13 సిరీస్‌కు మంచి డిమాండ్ లభిస్తోంది. ముఖ్యంగా ప్రో+ మోడల్‌పై ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
Redmi Note 13 Pro+ : రెడ్మీ నోట్ 13 సిరీస్‌ను ఇటీవలే చైనాలో లాంచ్ చేసింది దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమీ. రెడ్మీ నోట్ 12 సిరీస్‌కు ఇది సక్సెసర్‌గా వస్తోంది. ఇందులో స్టాండర్డ్, ప్రో, ప్రో+ వేరియంట్లు ఉన్నాయి. వీటిల్లో టాప్ ఎండ్ మోడల్.. రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్‌కు మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
రెడ్మీ నోట్ 13 ప్రో+ ఫీచర్స్..
ఈ మొబైల్లో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.67 ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. సెటర్ అలైన్డ్ పంచ్ హోల్ కటౌట్ డిజైన్ లభిస్తోంది. ఫింగర్‌ప్రింట్ స్కానర్ సైతం వస్తోంది. 'నోట్' సిరీస్‌లో ఈ ఫీచర్ ఉన్న తొలి గ్యాడ్జెట్ ఇదే!
Redmi Note 13 Pro+ price in India : డిజైన్ విషయానికొస్తే ఈ స్మార్ట్‌ఫోన్ రేర్‌లో డ్యూయెల్ టోన్ డిజైన్‌తో కూడిన ఫౌక్స్ లెథర్ టెక్స్చర్ వస్తోంది. ఐపీ68 డస్ట్, వాటర్ రెసిస్టెంట్ దీని సొంతం.
ఈ రెడ్మీ నోట్ 13 ప్రో+ రేర్‌లో లో 200ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా వైడ్, 2ఎంపీ షూటర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఫ్రెంట్లో 16ఎంపీ కెమెరా వస్తోంది.
ఇదీ చూడండి:- Vivo T2 Pro 5G: వివో నుంచి మార్కెట్లోకి మరో కొత్త 5జీ ఫోన్; ధర కూడా అందుబాటు లోనే..
ఇక ఈ డివైజ్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్, 16జీబీ ర్యామ్- 512జీబీ స్టోరేజ్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటివి లభిస్తున్నాయి. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 సాఫ్ట్‌వేర్‌పై ఇది పనిచేస్తుంది. యూఎస్బీ-సీ పోర్ట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఐఆర్ బ్లాస్టర్, 5జీ, వైఫై-6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్సీ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ సైతం ఈ గ్యాడ్జెట్లో ఉన్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్ ధర ఎంతంటే..
Redmi Note 13 Pro+ features : రెడ్మీ నోట్ 13 ప్రో+ 12జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 273 డాలర్లుగా ఉంది. ఇండియన్ కరెన్సీలో అది సుమారు రూ. 22,700. 12జీబీ ర్యామ్- 512జీబీ వేరియంట్ ధర 300 డాలర్లు (సుమారు రూ. 25వేలు)గాను, 16జీబీ ర్యామ్- 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 314 డాలర్లు (సుమారు రూ. 26,100)గాను ఉంది.
చైనాలో ఈ మోడల్ సేల్స్ ఈ నెల 26న మొదలవుతాయి. కాగా.. ఇండియాతో పాటు ఇతర మార్కెట్లలో ఈ రెడ్మీ నోట్ 13 సిరీస్ లాంచ్‌కు సంబంధించిన వివరాలను సంస్థ ఇంకా ప్రకటించలేదు.
సంబంధిత కథనం