Redmi Note 13 Pro : లాంచ్​కు సిద్ధంగా రెడ్​మీ నోట్​ 13 సిరీస్​.. ప్రో మోడల్ ఫీచర్స్​ ఇవే!-redmi note 13 pro to launch soon check features here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Redmi Note 13 Pro : లాంచ్​కు సిద్ధంగా రెడ్​మీ నోట్​ 13 సిరీస్​.. ప్రో మోడల్ ఫీచర్స్​ ఇవే!

Redmi Note 13 Pro : లాంచ్​కు సిద్ధంగా రెడ్​మీ నోట్​ 13 సిరీస్​.. ప్రో మోడల్ ఫీచర్స్​ ఇవే!

Sharath Chitturi HT Telugu
Sep 19, 2023 01:19 PM IST

Redmi Note 13 Pro : రెడ్​మీ 13 సిరీస్​ లాంచ్​కు సిద్ధమవుతోంది. ఈ సిరీస్​లోని ప్రో మోడల్​ ఫీచర్స్​ బయటకి వచ్చాయి. ఆ వివరాలు..

ఇంకొన్ని రోజుల్లో రెడ్​మీ నోట్​ 13 లాంచ్​..
ఇంకొన్ని రోజుల్లో రెడ్​మీ నోట్​ 13 లాంచ్​..

Redmi Note 13 Pro : సరికొత్త స్మార్ట్​ఫోన్​ సిరీస్​ను లాంచ్​ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది రెడ్​మీ సంస్థ. ఈ రెడ్​మీ నోట్​ 13 సిరీస్​.. ఈ నెల 21న లాంచ్​ అవుతుందని తెలుస్తోంది. ఇందులో నోట్​ 13, నోట్​ 13 ప్రో, నోట్​ 13 ప్రో ప్లస్​ గ్యాడ్జెట్స్​ ఉండనున్నట్టు సమాచారం. లాంచ్​కి ముందే.. ప్రో మోడల్​కు సంబంధించి కొన్ని ఫీచర్స్​ బయటకు వచ్చాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాము..

రెడ్​మీ నోట్​ 13 ప్రో ఫీచర్స్​ ఇవే..!

స్మార్ట్​ఫోన్​లో 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​, ఫుల్​ హెచ్​డీ ప్లస్​ రిసొల్యూషన్​తో కూడిన 6.67 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉండొచ్చు. అండర్​ డిస్​ప్లే ఫింగర్​ప్రింట్​ స్కానర్​ లభిస్తుందని సమాచారం.

ఈ గ్యాడ్జెట్ రేర్​లో 200ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా వైడ్​, 2ఎంపీ మాక్రో కెమెరా లెన్స్​లు ఉండొచ్చు. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ఇందులో 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా కూడా ఉంటుందని టాక్​ నడుస్తోంది.

ఈ రెడ్​మీ నోట్​ 13 ప్రోలో స్నాప్​డ్రాగన్​ 7ఎస్​ జెన్​ 2 ప్రాసెసర్​ ఉండనుంది. ఆండ్రాయిడ్​ 13 సాఫ్ట్​వేర్​పై ఇది పనిచేయొచ్చు. కాగా ఇందులో 5,120ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుందని, దీనికి 67వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ లభిస్తుందని తెలుస్తోంది. 6జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​, 16జీబీ ర్యామ్​- 1టీబీ స్టోరేజ్​ వేరియంట్లు ఉండొచ్చు.

ఇదీ చూడండి:- 200ఎంపీ రేర్​- 50ఎంపీ సెల్ఫీ కెమెరాతో హానర్​ 90.. ధర ఎంతంటే!

ఈ వివరాలన్నీ గీక్​బెంచ్​ అనే ప్లాట్​ఫామ్​లో దర్శనమిచ్చాయి. ఇదొక బెంచ్​మార్కింగ్​ సైట్​. స్మార్ట్​ఫోన్​ సీపీయూ, జీపీయూ పర్ఫార్మెన్స్​ని టెస్ట్​ చేసేందుకు మొబైల్​ సంస్థలు తమ గ్యాడ్జెట్స్​ని ఇక్కడికి పంపిస్తుంటాయి.

Redmi Note 13 launch date : ఈ మోడల్​కు సంబంధించిన మరిన్ని ఫీచర్స్​, ధర వంటి వివరాలపై ప్రస్తుతం క్లారిటీ లేదు. అయితే.. రెడ్​మీ 13 సిరీస్​లో.. మిడ్​ రేంజ్​ సెగ్మెంట్​లో ఎన్నడూ లేని విధంగా ఫ్లాగ్​షిఫ్​ ఫీచర్స్​ వస్తాయని షావోమీ జనరల్​ మేనేజర్​ వాంగ్​ టెంగ్​ తెలిపారు. ఇక ప్రో ప్లస్​ మోడల్​లో.. మీడియాటెక్​ డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్​సెట్​ వచ్చే అవకాశం ఉంది. ఇదే నిజమైతే.. ఈ ప్రాసెసర్​ వాడుతున్న తొలి స్మార్ట్​ఫోన్​గా ఈ మోడల్​ నిలిచిపోతుంది.

ఈ సిరీస్​ తొలుత చైనాలో లాంచ్​ అవ్వొచ్చు. అనంతరం అంతర్జాతీయ మార్కెట్​లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం