2023 December car sales : 2023 డిసెంబర్‌కి సంబంధించిన కార్ సేల్స్ డేటాను ఆటోమొబైల్ సంస్థలు ఒక్కొక్కటిగా వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు వచ్చిన కొన్ని సంస్థల డేటాను ఇక్కడ చూద్దాము..
Tata Motors car sales in December : టాటా మోటార్స్:- గత నెలలో 43,675 యూనిటల్ను విక్రయించినట్టు ప్రకటించింది టాటా మోటార్స్. 2022 డిసెంబర్‌తో పోల్చుకుంటే ఇది 8శాతం ఎక్కువ. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 1,38,455 కార్లను అమ్మినట్టు స్పష్టం చేసింది. గత ఆర్థిక ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చుకుంటే అది 5శాతం అధికం. ఇండియా ఈవీ సెగ్మెంట్లో టాటా మోటార్స్ రారాజుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సంస్థకు 80శాతం మార్కెట్ షేరు ఉంది. ఇక 2023 డిసెంబర్లో 5,006 ఈవీలను విక్రయించింది సంస్థ. 2022 డిసెంబర్‌తో పోల్చుకుంటే అది 29శాతం అధికం.
Maruti Suzuki car sales : మారుతీ సుజుకీ:- మరో దేశీయ దిగ్గజ ఆటమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ.. 2023 క్యాలెండర్ ఇయర్లో 20లక్షలకుపైగా వాహనాలను విక్రయించినట్టు ప్రకటించింది. వీటిల్లో 2.69లక్షల యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసినట్టు స్పష్టం చేసింది. ఇక 2023 డిసెంబర్లో 1.06లక్షల యూనిట్లను విక్రయించినట్టు వెల్లడించింది. గ్రాండ్ విటారా, బ్రెజా వంటి మోడల్స్ బాగా రాణిస్తున్నాయి. ఫ్రాంక్స్ ఎస్యూవీ కూడా సంస్థకు సేల్స్‌ని పెంచుతోంది.
హ్యుందాయ్ ఇండియా:- 2023 క్యాలెండర్ ఇయర్లో ఒక్క ఇండియాలోనే 6లక్షలకుపైగా వాహనాలను విక్రయించినట్టు ప్రకటించింది హ్యుందాయ్ సంస్థ. 1996లో ఎంట్రీ నుంచి ఇదే అత్యధికం అని వివరించింది. 2023 జనవరి- డిసెంబర్ మధ్యలో 6.02లక్షల వాహనాలను ఇండియాలో అమ్మింది సంస్థ. 2022తో పోల్చుకుంటే ఇది 9శాతం అధికం. ఇక 2023 డిసెంబర్లో 42,750 వాహనాలను దేశీయంగా విక్రయించిన హ్యుందాయ్ ఇండియా.. 13,700 యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది. హ్యుందాయ్‌కు క్రేటా ఎస్యూవీ బెస్ట్ సెల్లింగ్‌గా ఉంది. ఇక త్వరలోనే క్రేటా ఫేస్‌లిఫ్ట్ లాంచ్ అవ్వనుంది. దీనితో నెంబర్స్ ఇంకా పెరుగుతాయని సంస్థ అభిప్రాయపడుతోంది.
MG Motor car sales December 2023 : ఎంజీ మోటార్:- 2023లో ఇండియాలో ఎంజీ మోటార్ రీటైల్ సేల్స్ 56,902గా ఉన్నాయి. 2022తో పోల్చుకుంటే ఇది 18శాతం అధికం. ఇక డిసెంబర్ 2023లో 4,400 యూనిట్లను విక్రయించింది. 2022 డిసెంబర్‌తో పోల్చుకుంటే ఇది 13శాతం ఎక్కువే!
సంబంధిత కథనం