Realme Neo 7 : 7,000 ఎంఏహెచ్ బడా బ్యాటరీతో రియల్మీ కొత్త స్మార్ట్‌ఫోన్- ఇక ఛార్జింగ్ కష్టాలు ఉండవు..
02 December 2024, 21:20 IST
Realme Neo 7 launch date : 7,000 ఎంఏహెచ్ బడా బ్యాటరీతో రియల్మీ కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు రెడీ అవుతోంది. దీని పేరు రియల్మీ నియో 7. ఈ మోడల్‌పై ఇప్పటి వరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
రియల్మీ నియో 7
రియల్మీ తన ఫ్లాగ్షిప్ జీటీ 7 ప్రోను డిసెంబర్ 11న లాంచ్ చేయనుంది. రాబోయే స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకునే ఫీచర్లతో వస్తుందని అంచనాలు ఉన్నాయి. 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ గ్యాడ్జెట్ వస్తుండటం అతిపెద్ద విషయం! ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
రియల్మీ నియో 7: బ్యాటరీ, కీలక ఫీచర్లు..
అధికారిక లాంచ్‌కి ముందు, రియల్మీ నియో 7 బ్యాటరీ పర్ఫార్మెన్స్కి సంబంధించిన కీలక వివరాలను సంస్థ ధృవీకరించింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 23 గంటల వీడియో ప్లేబ్యాక్, 89 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 14 గంటల వీడియో కాలింగ్ లభించే విధంగా 7,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇస్తున్నట్టు కంపెనీ తెలిపింది.
లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ బ్యాకప్ కోసం చూసే వారికి ఈ స్మార్ట్‌ఫోన్ చక్కటి ఆప్షన్ అవుతుంది.
పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ, నియో 7 కేవలం 8.5 ఎంఎం థిక్‌నెస్‌తో స్లిమ్ ప్రొఫైల్‌ని మెయింటైన్ చేస్తుందని రియల్మీ చెప్పడం మరో కీలక అంశం. ఈ ఫోన్లో పంచ్-హోల్ డిస్ప్లే డిజన్ ఉంటుందని టీజర్ ద్వారా స్పష్టమైంది.
పర్ఫార్మెన్స్ పరంగా.. రియల్మీ నియో 7 మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్సెట్తో పనిచేస్తుందని లీకులు సూచిస్తున్నాయి. ఆంటుటూ బెంచ్‌మార్క్‌లో 2 మిలియన్ పాయింట్లను ఇది సంపాదించుకుంటుందని అంచనాలు ఉన్నాయి. ఈ మిడ్-రేంజ్ ప్రీమియం డివైజ్ ఐపీ 68-రేటెడ్ డస్ట్- వాటర్ రెసిస్టెన్స్‌ని కలిగి ఉంటుంది, ఫలితంగా స్మార్ట్‌ఫోన్ మన్నిక పెరుగుతుంది.
డిస్ప్లేలో 1.5కే రిజల్యూషన్‌కి మద్దతు ఇచ్చే అమోలెడ్ ప్యానెల్, మెరుగైన వ్యూ ఎక్స్‌పీరియెన్స్‌ని అందిస్తుంది. ఈ రియల్మీ నియో 7.. 80 వాట్ వైర్డ్ ఛార్జింగ్‌కి మద్దతు ఇస్తుంది. నియో 7 ఆండ్రాయిడ్ 15 ఓఎస్‌పై పనిచేస్తుందని, ఇది స్మూత్ అండ్ అప్ టు డేట్ యూజర్ ఎక్స్ పీరియన్స్‌ని అందిస్తుందని అంచనాలు ఉన్నాయి.
భారతదేశంలో రియల్మీ నియో 7 లాంచ్..
ఇండియాలో రియల్మీ నియో 7 లాంచ్ అవుతుందో లేదో ఇంకా క్లారిటీ లేదు. కానీ ఇది మిడ్ రేంజ్ సెగ్మెంట్లో రియల్మీ జీటీ సిరీస్‌లో భాగంగా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు ఉన్నాయి. ఇది వస్తే, రియల్మీ ప్రమోషనల్ టీజర్లు సూచించినట్లుగా, సుదీర్ఘ బ్యాటరీ లైఫ్, బలమైన పర్ఫార్మెన్స్తో, ముఖ్యంగా గేమింగ్ కోసం ఫోన్ కోసం చూస్తున్న భారతదేశంలోని వినియోగదారులకు ఇది కచ్చితంగా ఉపయోగపడుతుంది.
ఈ రియల్మీ నియో 7కి సంబంధించిన ఇతర ఫీచర్స్, ధర వంటి వివరాలపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ వివరాలను మేము మీకు అప్డేట్ చేస్తాము. స్టే ట్యూన్డ్!
ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్ ఛానెల్స్‌లో అందుబాటులో ఉంది. టెక్ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్‌లో హెచ్‌టీ తెలుగు ఛానెల్‌ని ఫాలో అవ్వండి..