తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Realme Gt 7 Pro : ఏఐ గేమింగ్​ ఫీచర్స్​తో రియల్​మీ సరికొత్త స్మార్ట్​ఫోన్​- గేమర్స్​కి పండగే!

Realme GT 7 Pro : ఏఐ గేమింగ్​ ఫీచర్స్​తో రియల్​మీ సరికొత్త స్మార్ట్​ఫోన్​- గేమర్స్​కి పండగే!

Sharath Chitturi HT Telugu

08 November 2024, 13:51 IST

google News
  • ఇండియాలో రియల్​మీ జీటీ7 ప్రో లాంచ్​కి రెడీ అవుతోంది. ఏఐ గేమింగ్​ ఫీచర్స్​ ఈ స్మార్ట్​ఫోన్​లో హైలైట్​గా నిలుస్తాయి. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ చూసేయండి..

రియల్​మీ సరికొత్త స్మార్ట్​ఫోన్
రియల్​మీ సరికొత్త స్మార్ట్​ఫోన్ (Realme)

రియల్​మీ సరికొత్త స్మార్ట్​ఫోన్

భారతదేశపు మొట్టమొదటి స్నాప్​డ్రాగన్​ 8 ఎలైట్ ఆధారిత స్మార్ట్​ఫోన్..​ రియల్​మీ జీటీ 7 ప్రో నవంబర్ 26, 2024న లాంచ్​కానుంది. స్మార్ట్​ఫోన్​ కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు డిజైన్, ప్రాసెసర్ కోర్స్, పనితీరు, ఇతర కీలక ఫీచర్లను కంపెనీ టీజ్ చేయడం ప్రారంభించింది. రియల్​మీ జీటీ 7 ప్రో ఏఐ గేమింగ్ సామర్థ్యాలైన జీటీ మోడ్ 2.0, ఎఐ గేమింగ్ సూపర్ ఫ్రేమ్ ఫీచర్స్​ని ఆవిష్కరించింది. ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..

రియల్​మీ జీటీ 7 ప్రో ఏఐ గేమింగ్ ఫీచర్లు..

రియల్​మీ ఇటీవల గేమింగ్ అనుభవాన్ని పెంచడానికి తన రాబోయే జీటీ 7 ప్రోలో ఏఐ గేమింగ్ ఫీచర్లు ఉంటాయని వెల్లడించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో పాటు, నవంబర్ 26 న జీటీ మోడ్ 2.0 లాంచ్ అవుతుందని ప్రకటించడానికి రియల్​మీ ఎక్స్ పోస్ట్​ని కూడా పంచుకుంది.

'జీటీ మోడ్ 2.0 ఏఐ పవర్ సేవింగ్ ఫ్రేమ్స్ మిమ్మల్ని జీఓఏటీ తరహాలో ఎక్స్​పీరియెన్స్​ని అందిస్తాయి,' అని ఆ పోస్ట్​లో సంస్థ పేర్కొంది. జీటీ మోడ్ ఫీచర్లు, సామర్థ్యాలను వెల్లడించనప్పటికీ, రియల్ మీ రెండు ఏఐ ఆధారిత గేమింగ్ ఫీచర్లను ప్రకటించింది. అవి.. ఏఐ గేమింగ్ సూపర్ రిజల్యూషన్, ఏఐ గేమింగ్ సూపర్ ఫ్రేమ్.

గేమింగ్ విజువల్స్​ని మెరుగుపరచడానికి ఏఐ సూపర్​ రిజల్యూషన్​ ద్వారా 1.5కే రిజల్యూషన్​ను అందిస్తుంది. ఏఐ సూపర్ ఫ్రేమ్ మల్టీప్లే ప్లే చేసేటప్పుడు సెకనుకు 120 ఎఫ్​పీఎస్ ఫ్రేమ్​లను అందిస్తుంది.

ఫ్రీ ఫైర్, బీజీఎంఐ, జెన్షిన్ ఇంపాక్ట్వంటి ఇంకొన్ని ఫీచర్లు.

రియల్​మీ జీటీ 7 ప్రో స్పెసిఫికేషన్లు..

రియల్​మీ 7 ప్రో చైనా వేరియంట్​లో 6.78 ఇంచ్​ 8టీ ఎల్టీపీఓ ఎకోఎల్ఈడీ ప్లస్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6000 మినిట్​ పీక్ బ్రైట్​నెస్​ ఉన్నాయి. స్నాప్​డ్రాగన్ 8 ఎలైట్ చిప్, అడ్రినో 830 జీపీయూతో ఈ ఫోన్ పనిచేయనుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్​తో సోనీ ఐఎంఎక్స్ 882 సెన్సార్, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్​తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్​​తో ఈ స్మార్ట్​ఫోన్​ రావచ్చు. ఈ స్మార్ట్​ఫోన్​ 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​ 6500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించే అవకాశం ఉంది.

అయితే రాబోయే రియల్​మీ జీటీ 7 ప్రో గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాబట్టి, స్పెసిఫికేషన్లు, అన్ని కొత్త ఫీచర్లను ధృవీకరించడానికి నవంబర్ 26 వరకు వేచి ఉండాల్సిందే.

ఇంకో విషయం! మనం ఇప్పుడు వాట్సప్ ఛానల్స్ లో ఉన్నాం! టెక్నాలజీ ప్రపంచం నుంచి ఎటువంటి నవీకరణలను మీరు మిస్ కాకుండా ఉండటానికి మమ్మల్ని అక్కడ అనుసరించండి. వాట్సప్ లో హెచ్​టీ తెలుగు ఛానల్​ని అనుసరించండి!

తదుపరి వ్యాసం