Realme GT 7 Pro : త్వరలోనే రియల్​మీ జీటీ 7 ప్రో లాంచ్​- ఈ ఫీచర్​ హైలైట్​..!-realme gt 7 pro launching in india check expected features here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Realme Gt 7 Pro : త్వరలోనే రియల్​మీ జీటీ 7 ప్రో లాంచ్​- ఈ ఫీచర్​ హైలైట్​..!

Realme GT 7 Pro : త్వరలోనే రియల్​మీ జీటీ 7 ప్రో లాంచ్​- ఈ ఫీచర్​ హైలైట్​..!

Sharath Chitturi HT Telugu
Oct 25, 2024 10:20 AM IST

Realme GT 7 Pro launch date : ఇండియాలో లాంచ్​కు రియల్​మీ జీటీ 7 ప్రో రెడీ అవుతోంది. అయితే ఈ స్మార్ట్​ఫోన్​లో ఒక హైలైట్​ ఉంది. దానితో పాటు ఈ గ్యాడ్జెట్​ ఫీచర్స్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ చూసేయండి..

రియల్​మీ జీటీ 7 ప్రో..
రియల్​మీ జీటీ 7 ప్రో.. (Realme)

రియల్​మీ తన లేటెస్ట్ ఫ్లాగ్​షిప్​ డివైజ్ రియల్​మీ జీటీ 7 ప్రోను వచ్చే నెలలో భారత్​లో లాంచ్ చేయనున్నట్లు ధృవీకరించింది. క్వాల్కమ్ స్నాప్​డ్రాగన్ 8 ఎలైట్ చిప్​సెట్​ను కలిగి ఉన్న ప్రపంచంలనే మొట్టమొదటి డివైజ్​గా ఈ స్మార్ట్​ఫోన్ అరంగేట్రం చేయనుంది! ఇది ప్రీమియం స్మార్ట్​ఫోన్ సెగ్మెంట్​లో బ్రాండ్ కు ఒక ముఖ్యమైన అడుగు. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలపై ఓ లుక్కేయండి..

రియల్​మీ జీటీ 7 ప్రో..

స్నాప్​డ్రాగన్ 8 ఎలైట్ చిప్​సెట్ అద్భుతమైన మొబైల్ ప్లాట్​ఫామ్ అని చెప్పుకోవచ్చు. అధునాతన 3ఎన్ఎమ్ ప్రాసెస్ టెక్నాలజీని ఉపయోగించి నిర్మించిన ఈ చిప్​సెట్ కొత్త 2+6 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఆర్కిటెక్చర్​ను పరిచయం చేస్తూ శక్తిసామర్థ్యంపై దృష్టి పెడుతుంది. ఈ ఆర్కిటెక్చర్ 4 గిగాహెర్ట్జ్ కంటే ఎక్కువ వేగానికి మద్దతు ఇస్తుంది. ఇది ప్రాసెసింగ్ పవర్​లో గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది. ఈ సెటప్​లోని ఆప్టిమైజేషన్​లు స్మార్ట్​ఫోన్​లలో AI పనితీరును మెరుగుపరచడం, రెస్పాన్సివ్​ యూజర్​ ఎక్స్​పీరియెన్స్​ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

పెర్ఫార్మెన్స్ అంచనాలు..

రియల్​మీ జీటీ 7 ప్రో భారతదేశంలో మొదటి స్నాప్​డ్రాగన్ 8 ఎలైట్ ఫ్లాగ్​షిప్​గా లాంచ్ అవుతుంది. ఇది హై పెర్ఫార్మెన్స్ ఆండ్రాయిడ్ స్మార్ట్​ఫోన్​ల డిమాండ్​ను తీర్చుతుంది. ఈ ఫోన్ స్పీడ్​, సామర్థ్యం, అధునాతన కృత్రిమ మేధ సామర్థ్యాలను మిళితం చేస్తుందని, వినియోగదారులకు అంతరాయం లేని అనుభవాన్ని అందించాలనే దాని నిబద్ధతను బలోపేతం చేస్తుందని కంపెనీ చెబుతోంది.

రియల్​మీ జీటీ 7 ప్రో: స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా)

రియల్​మీ జీటీ 7 ప్రో గురించి ఇటీవలి లీకులు ఇందులో డీసీ డిమ్మింగ్ సామర్థ్యాలతో శాంసంగ్-సోర్స్డ్ క్వాడ్ మైక్రో-కర్వ్డ్ డిస్​ప్లే ఉండవచ్చని వెల్లడిస్తున్నాయి. ఈ స్మార్ట్​ఫోన్​లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉండే అవకాశం ఉంది. అయితే టెలిఫోటో సామర్థ్యాలకు సంబంధించి నిర్దిష్ట వివరాలు అస్పష్టంగా ఉన్నాయి. మునుపటి మోడళ్లలో ఉన్న 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్​తో పాటు 50 మెగాపిక్సెల్ ఫ్రెంట్ కెమెరా ఉంటుంది. రియల్​మీ 13 ప్రో + కి సమానంగా ఈ ఫీచర్స్​ కనిపిస్తాయి.

స్మార్ట్​ఫోన్​లో ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, ఇన్ డిస్​ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్​ను అందించనున్నట్లు తెలుస్తోంది. దీని థిక్​నెస్​ 9 ఎంఎంగా ఉండనుందని అంచనాలు ఉన్నాయి. 6,500 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ కూడా ఇందులో ఉండనుంది.

డిజైన్ పరంగా, రియల్​మీ జీటీ 7 ప్రోలో అన్ని కెమెరా లెన్స్​లు, ఫ్లాష్ ఉన్న స్క్వేర్ కెమెరా మాడ్యూల్ ఉండొచ్చు. 6.78 ఇంచ్​ 1.5కే బీఓఈ ఎక్స్2 డిస్ప్లే, పంచ్ హోల్ కటౌట్, మినిమమ్ బెజెల్స్​తో డివైజ్​ మొత్తం విజువల్ అప్పీల్​ని పెంచే అవకాశం ఉంది.

రియల్​మీ జీటీ 7 ప్రో అమెజాన్ ఇండియాతో పాటు వివిధ ఆఫ్​లైన్​ రీటైల్ స్టోర్లలో అందుబాటులో ఉండనుంది. పూర్తి వివరాలపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం