ePluto 7G Max electric scooter : 201 కి.మీ రేంజ్‌తో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..
06 October 2023, 7:15 IST
- ePluto 7G Max electric scooter : మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చింది. దీని పేరు ప్యూర్ ఈవీ ఈప్లూటో 7జీ మ్యాక్స్. ఈ మోడల్ ధర, రేంజ్ వంటి వివరాలు మీకోసం..
201 కి.మీ రేంజ్‌తో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్!
ePluto 7G Max electric scooter : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంట్రీ ఇచ్చింది. ప్యూర్ ఈవీ అనే సంస్థ.. తాజాగా ఈప్లూటో 7జీ మ్యాక్స్ ఈ-స్కూటర్‌ను లాంచ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ ఫీచర్స్, రేంజ్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విశేషాలివే..
ఈ ఆల్ న్యూ ఈప్లూటో 7జీ మ్యాక్స్ ఈ-స్కూటర్లో హిల్ స్టార్ట్ అసిస్ట్, డౌన్‌హిల్ అసిస్ట్, కాస్టింగ్ రెజిన్, రివర్స్ మోడ్, స్మార్ట్ ఏఐ వంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ వస్తున్నాయి. రెట్రో థీమ్‌తో ఈ స్కూటర్‌ను డిజైన్ చేసింది సంస్థ. మ్యాట్ బ్లాక్, రెడ్, గ్రే, వైట్ కలర్స్‌లో ఇది అందుబాటులో ఉంటుంది.
ePluto 7G Max price : ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 3.5 కేడబ్ల్యూహెచ్ లిథియం- ఐయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్.. 3.21 హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేస్తుంది. ఏఐఎస్- 156 సర్టిఫికేట్ ఉన్న బ్యాటరీ ప్యాక్‌లో స్మార్ట్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టెమ్ ఉంటుంది. 60,000కి.మీ స్టాండర్డ్ బ్యాటరీ వారెంటీ, 70,000 కి.మీ ఎక్స్టెండెడ్ కి.మీ వారెంటీ లభిస్తున్నాయి. ఈ వెహికిల్‌ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 201 కి.మీల దూరం ప్రయాణిస్తుందని సంస్థ చెబుతోంది. మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయని వెల్లడించింది.
ఇక ఈ ఈప్లూటో 7జీ మ్యాక్స్ ఈవీలో ఎల్ఈడీ లైట్స్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్ రీజనరేటివ్ టెక్నాలజీ వంటివి ఉన్నాయి. రివర్స్ మోడ్‌తో పాటు పార్కింగ్ అసిస్ట్ ఫీచర్ కూడా వస్తోంది. ఆటో పుష్ ఫంక్షన్‌తో 5 కేఎంపీహెచ్ స్టడీ స్పీడ్‌లో వెళ్లే వెసులుబాటు ఉంటుంది. అంటే.. మేన్యువల్‌గా మనం పుష్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఎంతంటే..
ePluto 7G Max top speed : ప్యూర్ ఈవీ నుంచి వచ్చిన ఈ ఈప్లూటో 7జీ మ్యాక్స్ ఎక్స్‌షోరూం ధర రూ. 1,14,999గా ఉంది. సంస్థకు చెందిన అధికారిక వెబ్సైట్, డీలర్షిప్ షోరూమ్స్‌లో బుకింగ్స్ మొదలయ్యాయి. పండుగ సీజన్ నడుస్తుండటంతో.. కస్టమర్లను ఆకర్షించి.. కంపెనీ సేల్స్ పెంచుకోవాలని ప్యూర్ ఈవీ చూస్తోంది.
ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా..!
2 వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో మంచి పోటీ కనిపిస్తోంది. ఆటోమొబైల్ సంస్థలు పోటీ పడి మరీ కొత్త కొత్త మోడల్స్‌ను తీసుకొస్తున్నాయి. ఈవీ స్టార్టప్ సంస్థ ఎంఎక్స్మోటో.. తన పోర్ట్‌ఫోలియోను పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. దీని పేరు ఎంఎక్స్‌వీ ఈకో! ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉన్నాయి. చిన్న బ్యాటరీ ప్యాక్ రేంజ్ 100కి.మీ అని, టాప్ స్పీడ్ 70కేఎంపీహెచ్ అని సంస్థ చెబుతోంది. పెద్ద బ్యాటరీ ప్యాక్ రేంజ్ 120కేఎంపీహెచ్ అని, టాప్ స్పీడ్ 75కేఎంపీహెచ్ని స్పష్టం చేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.