VinFast electric car : ఇండియా మార్కెట్లోకి మరో కొత్త ఈవీ ప్లేయర్.. 3 వెహికిల్స్ రెడీ!
VinFast electric car : ఇండియా మార్కెట్లోకి మరో కొత్త ఈవీ ప్లేయర్ ఎంట్రీ ఇవ్వబోతోంది. అదే విన్‌ఫాస్ట్. సంస్థ నుంచి 2024 ఏప్రిల్‌లో ఓ ఈవీ లాంచ్ కాబోతోందని టాక్ నడుస్తోంది.
VinFast electric car : అంతర్జాతీయ మార్కెట్లో టెస్లాకు గట్టిపోటీనిస్తున్న విన్‌ఫాస్ట్ అనే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ.. ఇప్పుడు ఇండియాలో అడుగుపెట్టబోతోంది! వియత్నాంకు చెందిన ఈ సంస్థ నుంచి.. 2024 ఏప్రిల్‌లో తొలి మోడల్.. ఇండియాలో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ఇండియా మార్కెట్ కోసం విన్‌ఫాస్ట్ సంస్థ మొత్తం 3 ఈవీలను సిద్ధం చేస్తోందట. వీఎఫ్ ఈ-34 ఎలక్ట్రిక్ వెహికిల్ ముందుగా లాంచ్‌కానుందని సమాచారం.
మార్కెట్లోకి కొత్త ఈవీ..
ఈ వీఎఫ్ ఈ-34 మోడల్ని సీబీయూ (కంప్లీట్లీ బిల్ట్-అప్) యూనిట్‌గా ఇండియాలోకి తీసుకురావాలని సంస్థ చూస్తోంది. దీని తర్వాత వీఎఫ్6, వీఎఫ్7 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు కూడా ఇండియాలో లాంచ్ అవుతాయి. ఈ ఈవీలతో పాటు రానున్న సంవత్సరాల్లో పెద్ద సైజు సెడాన్ కూడా దేశంలో ప్రవేశపెట్టాలని సంస్థ ప్లాన్ చేస్తోంది.
VinFast India : 2022 జూన్‌లో విన్‌ఫాస్ట్ వీఎఫ్8 ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. తొలిసారిగా ఇండియాలో దర్శనమిచ్చింది. దీని టెస్ట్ డ్రైవ్ జరిగిన తర్వాత మళ్లీ కనిపించలేదు. దీని రేంజ్ 471 కి.మీలు. ఈ ఇంజిన్ 397 హెచ్‌పీ పవర్‌ను, 620 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
ఇండియాలో విన్‌ఫాస్ట్ ఎంట్రీ కోసం వేగంగా పనులు జరుగుతున్నాయి. గురుగ్రామ్‌లో ఇప్పటికే ఓ ఆఫీస్ ఓపెన్ అయ్యింది. పలువురిని రిక్రూట్ కూడా చేసుకున్నారు. అన్ని అనుకున్నట్టు జరిగితే.. 2024 ఏప్రిల్‌లో సంస్థ నుంచి తొలి ఈవీ బయటకు వస్తుంది. టెస్లాకు పోటీనిస్తుండటంతో.. ఇది కూడా ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికిల్గానే ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
VinFast India latest news : ఇండియాలోకి టెస్లా ఎంట్రీ ఇవ్వనుందని కొన్ని నెలల ముందు వరకు వార్తలు జోరుగా సాగాయి. ఇప్పుడు పెద్దగా వార్తలు రావట్లేదు. టెస్లా, భారత ప్రభుత్వం కూడా ఈ విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. ఒకవేళ టెస్లా ఎంట్రీ ఇచ్చినా.. పోటీని తట్టుకోవడమే కాకుండా.. మరింత రసవత్తరంగా మార్చే విధంగా విన్‌ఫాస్ట్ సంస్థ చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఇండియా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఈవీ సెగ్మెంట్‌కు క్రేజీ డిమాండ్ కనిపిస్తోంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు.. అటు దేశీయ సంస్థలు, ఇటు విదేశీ కంపెనీలు విపరీతంగ పోటీ పడుతున్నాయి. బీవైడీ వంటి దిగ్గజ ఈవీ సంస్థలు కూడా ఇండియాలో అడుగుపెట్టాయి.
సంబంధిత కథనం