Honda electric scooter : హోండా నుంచి బుడ్డి ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇదిగో 'మోటోకాంపాక్టో'!
15 September 2023, 13:34 IST
- Honda electric scooter : హోండా నుంచి ఓ బుడ్డి ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తోంది. దీని పేరు హోండా మోటోకాంపాక్టో. ఈ ఈవీ విశేషలను ఇక్కడ తెలుసుకుందాము..
హోండా నుంచి బుడ్డి ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇదిగో 'మోటోకాంపాక్టో'!
Honda electric scooter : 1980 దశకంలో ఓ మైక్రో-స్కూటర్‌ను లాంచ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హోండా. దీని పేరు 'మోటోకాంపో'. ఇక ఇప్పుడు.. ఈ బుడ్డి స్కూటర్‌కు ఈవీ టచ్ ఇచ్చింది! దీని పేరు 'మోటోకాంపాక్టో' ఈ మోడల్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
మోటోకాంపాక్టో ఈ-స్కూటర్ విశేషాలివే..
హోండా సిటీ బూట్లో పట్టే విధంగా ఈ మోటోకాంపోను రూపొందించింది సంస్థ. రవాణాకు, స్టోరేజ్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది. దీనిని 'ట్రంక్ బైక్' అని కూడా ప్రచారాలు చేసింది హోండా. ఇందులో 50సీసీ ఇంజిన్ ఉండేది. దీని టాప్ స్పీడ్ 48కేఎంపీహెచ్.
Honda Motocompacto : ఇక ఇప్పుడు హోండా రివీల్ చేసిన ఆల్-న్యూ, ఈకో-ఫ్రెండ్లీ మోటోకాంపాక్టో ఈ-స్కూటర్ కూడా ఆకర్షణీయంగా ఉంది. ఈ స్కూటర్ బరువు 18.6కేజీలు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఫోల్డ్ చేసి.. కారు బూట్లో పెట్టుకోవచ్చు. కారు వెళ్లలేని ప్రదేశాల్లో దీనిని ఉపయోగించుకోవచ్చు.
ఇందులో ఉన్న బ్యాటరీతో 19.3కి.మీల వరకు ప్రయాణించవచ్చు. 0-100శాతం రీఛార్జ్‌కు 3.5 గంటల సమయం పడుతుందని సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది నవంబర్ నాటికి.. ఈ హోండా మోటోకాంపాక్టో ఎలక్ట్రిక్ స్కూటర్.. డెలివరీలను మొదలుపెట్టాలని సంస్థ భావిస్తోంది. దీని ధర 995 డాలర్లు. ఇండియన్ కరెన్సీలో అది సుమారు రూ. 83వేలు!
Honda Motocompacto price : 2040 నాటికి తమ పోర్ట్‌ఫోలియోలో అన్ని ఈవీలే ఉండే విధంగా ప్లాన్ చేస్తున్న హోండాకు.. ఈ మోటోకాంపాక్టో సక్సెస్ చాలా కీలకంగా మారనుంది. ఈ మోడల్ ఇతర ఫీచర్స్పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇండియాలో ఈ మోడల్ లాంచ్ అవుతుందా? లేదా? అన్న విషయంపై సంస్థ నుంచి ఇంకా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.
హోండా ఎలివేట్‌కు క్రేజీ డిమాండ్..
Honda Elevate SUV waiting period : ఇక ఇండియాలో హోండా కార్యకలాపాల గురించి మాట్లాడుకుంటే.. సంస్థ ఇటీవలే లాంచ్ చేసిన ఎలివేట్ ఎస్‌యూవీకి విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. లాంచ్ అయిన కొన్ని రోజులకే, ఈ మోడల్ వెయిటింగ్ పీరియడ్ 6 నెలలు దాటేసింది! హోండా ఎలివేట్ ఎస్‌యూవీని.. సెప్టెంబర్ 4న లాంచ్ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ వెహికిల్ కోసం బుకింగ్స్ వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా వెయిటింగ్ పీరియడ్ 6నెలలకు చేరింది. మరీ ముఖ్యంగా.. టోటల్ బుకింగ్స్‌లో టాప్ ఎండ్ వేరియంట్స్కే 60శాతం వాటా ఉండటం విశేషం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.