తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tvs E-scooter ‘X’: టీవీఎస్ నుంచి కొత్త ఈ స్కూటర్ ‘ఎక్స్’; రేంజ్ 140 కిమీ.. ధర మాత్రం..?

TVS e-scooter ‘X’: టీవీఎస్ నుంచి కొత్త ఈ స్కూటర్ ‘ఎక్స్’; రేంజ్ 140 కిమీ.. ధర మాత్రం..?

HT Telugu Desk HT Telugu

24 August 2023, 16:44 IST

google News
  • TVS e-scooter ‘X’: సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను టీవీఎస్ మోటార్స్ ఎక్స్ (‘X’) మార్కెట్లోకి లాంచ్ చేసింది. చూడగానే ఆకట్టుకునేలా డైనమిక్ డిజైన్ తో ఈ ప్రీమియం సెగ్మెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీర్చిదిద్దింది. ఇది భారత్ లో ఇప్పటివరకు వచ్చిన ఈ స్కూటర్లలో అత్యంత ఖరీదైనది కావడం విశేషం.

టీవీఎస్ మోటార్స్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్
టీవీఎస్ మోటార్స్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ (TVS Motor)

టీవీఎస్ మోటార్స్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్

TVS e-scooter ‘X’: సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను టీవీఎస్ మోటార్స్ ఎక్స్ (‘X’) పేరుతో మార్కెట్లోకి లాంచ్ చేసింది. చూడగానే ఆకట్టుకునేలా డైనమిక్ డిజైన్ తో ఈ ప్రీమియం సెగ్మెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీర్చిదిద్దింది. ఇది భారత్ లో ఇప్పటివరకు వచ్చిన ఈ స్కూటర్లలో అత్యంత ఖరీదైనది కావడం విశేషం. ఈ టీవీఎస్ ఎక్స్ ఈ స్కూటర్ టీవీఎస్ వారి స్మార్ట్ కనెక్ట్ ప్లాట్ ఫామ్ తో వస్తుంది. ఇందులో 10.25 ఇంచ్ ల హెచ్ డీ టిల్ట్ స్క్రీన్ ఉంటుంది.

ధర ఎంతో తెలుసా?

ఈ టీవీఎస్ లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ ధర రూ. 2.5 లక్షలు (ఎక్స్ షో రూమ్ ధర). ఇది భారత్ లో ఇప్పటివరకు వచ్చిన ఈ స్కూటర్లలో అత్యంత ఖరీదైనది. అదనంగా రూ. 18 వేలు చెల్లించి ఫస్ట్ ఎడిషన్ ప్యాకేజ్ పొందవచ్చు. ఈ స్కూటర్ బుకింగ్స్ ఈ రోజు, 24 ఆగస్ట్ అర్ధరాత్రి నుంచి ప్రారంభమవుతాయి. వెహికిల్ డెలివరీస్ నవంబర్ నెలలో ఉంటాయి. ఈ స్కూటర్ మామూలు ఎలక్ట్రిక్ స్కూటర్ల కన్నా 2.5 రెట్లు ధృఢమైనది. ఇది మూడు రైడింగ్ మోడ్ లలో లభిస్తుంది. అవి ఎక్స్టీల్త్ (Xtealth), ఎక్స్ రైడ్ (Xtride), ఎక్సానిక్ (Xonic) రైడింగ్ మోడ్స్.

రేంజ్ ఎంతో తెలుసా?

ఈ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ తో సింగిల్ చార్జింగ్ తో గరిష్టంగా 140 కిమీల వరకు ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్ కు అమర్చిన 11 కేడబ్ల్యూ బ్యాటరీని 3 గంటల 40 నిమిషాల్లో జీరొ నుంచి 80% వరకు చార్జి చేయవచ్చు. అలాగే, ఇది సున్నా నుంచి 40 కిమీల వేగానికి జస్ట్ 2.6 సెకన్లలో చేరుకుంటుంది. అలాగే సున్నా నుంచి 60 కిమీల వేగానికి 4.5 సెకన్లలో చేరుకుంటుంది. ఈ బైక్ కు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, మోనో షాక్ రియర్ ఫోర్క్స్ ఉంటాయి. అలాగే, ముందు వైపు 220 ఎంఎం సింగిల్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్, వెనుకవైపు 195 ఎంఎం రియర్ డిస్క్ బ్రేక్ ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కు 12 ఇంచ్ ల అలాయ్ వీల్స్ ను అమర్చారు.

తదుపరి వ్యాసం