mXmoto electric scooter : క్రూజ్ కంట్రోల్ ఫీచర్‌తో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర ఎంతంటే!
mXmoto electric scooter : క్రూజ్ కంట్రోల్ ఫీచర్‌తో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. అదే.. ఎంఎక్స్మోటో ఎంఎక్స్‌వీ ఈకో. ఈ మోడల్ ధర ఎంతంటే..
mXmoto electric scooter : భారతీయ ఈవీ స్టార్టప్ సంస్థ ఎంఎక్స్మోటో.. తన పోర్ట్‌ఫోలియోను పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. దీని పేరు ఎంఎక్స్‌వీ ఈకో! ఈ మోడల్ ఫీచర్స్, రేంజ్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఎంఎక్స్‌వీ ఈకో విశేషాలివే..
ఎంఎక్స్మోటో నుంచి వస్తున్న సరికొత్త ఈవీలో ట్రెడిషన్ స్కూటర్ లుక్ కనిపిస్తుంది. ఇందులో సర్క్యులర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఏప్రాన్- మౌంటెడ్ క్రోమ్ స్లేటెడ్ గ్రిల్, ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎల్స్, రౌండెడ్ క్రోమ్ మిర్రర్స్, వైడ్ హ్యాండిల్‌బార్, ఫ్లాట్ ఫుట్‌బోర్డ్, టేపరింగ్ బాడీ ప్యానెల్స్, స్లీక్ ఎల్ఈడీ టెయిల్ల్యాంప్ వంటివి వస్తున్నాయి. డైనమిక్ ఎల్ఈడీ లైట్లు వస్తుండటంతో రోడ్ కండీషన్లు మెరుగ్గా కనిపిస్తాయి. హెడ్‌ల్యాంప్‌లో ఆటో-ఇల్యుమినేషన్ ఫంక్షనింగ్ ఉందని తెలుస్తోంది.
mXmoto MXV Eco price : ఇక ఈ ఎంఎక్స్‌వీ ఈకోలో టీఎఫ్టీ డిస్ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, నేవిగేషన్ వంటి ఫీచర్స్ సైతం లభిస్తున్నాయి. మల్టీ-స్పోక్ అలాయ్ వీల్స్ వస్తున్నాయి.
ఇక ఈ ఈ-స్కూటర్లో సెల్ఫ్ డైగ్నాసిస్, ఆటో రిపేర్ ఫీచర్స్ ఉన్నాయి. వెహికిల్‌లో ఉన్న సెన్సార్లు, కనెక్టివిటీ కారణంగా బండిలో ఎక్కడ సమస్య వచ్చింది? అన్న విషయాన్ని వెంటనే తెలుసుకోవచ్చు. ఎలక్ట్రిక్ పరికరాల్లో ఏమైనా లోపాలు కనిపిస్తే.. వాటిని స్వయంగా కరెక్ట్ చేసుకునే విధంగా ఇందులోని కాంపొనెంట్స్ ఉన్నాయి.
ఇదీ చూడండి:- mXmoto electric bike : మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జులైలో ‘ఎంఎక్స్9’ లాంచ్!
ఈ ఎంఎక్స్‌వీ ఈకో ఎలక్ట్రిక్ స్కూటర్లో క్రూజ్ కంట్రోల్, రివర్స్ అసిస్ట్, పార్క్ అసిస్ట్ వంటి ఫీచర్స్ సైతం ఉన్నాయి. ఇవి హైలైట్‌గా నిలుస్తున్నాయి.
ఎంఎక్స్‌వీ ఈకో ధర ఎంతంటే..!
mXmoto MXV Eco range : ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉన్నాయి. చిన్న బ్యాటరీ ప్యాక్ రేంజ్ 100కి.మీ అని, టాప్ స్పీడ్ 70కేఎంపీహెచ్ అని సంస్థ చెబుతోంది. పెద్ద బ్యాటరీ ప్యాక్ రేంజ్ 120కేఎంపీహెచ్ అని, టాప్ స్పీడ్ 75కేఎంపీహెచ్ని స్పష్టం చేస్తోంది. ఈ బ్యాటరీలు హబ్ మౌంటెడ్ 3కేడబ్ల్యూహెచ్ ఎలక్ట్రిక్ మోటార్‌కు కనెక్ట్ అయ్యి ఉంటాయి.
ఇక ఈ ఎంఎక్స్‌వీ ఈకో ఈవీ ఎక్స్‌షోరూం ధర రూ. 84,999గా ఉంది. ఈ ప్రైజ్ పాయింట్లో అదిరిపోయే ఫీచర్స్‌తో వస్తున్న ఈ స్కూటర్.. కస్టమర్లను ఆకర్షిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. డెలివరీలు ఎప్పుడు మొదలవుతాయి? అన్న విషయాన్ని సంస్థ ప్రకటించాల్సి ఉంది.
సంబంధిత కథనం