mXmoto electric bike : మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జులైలో ‘ఎంఎక్స్9’ లాంచ్!
mXmoto electric bike : ఎంక్స్9 ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది ఎంఎక్స్మోటో సంస్థ. జులైలో ఈ బైక్ లాంచ్కానుంది. పూర్తి వివరాలు..
mXmoto electric bike : దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. కొత్త కొత్త మోడల్స్‌ను లాంచ్ చేసేందుకు సంస్థలు పోటీ పడుతున్నాయి. అంతేకాకుండా.. ఈవీలు తయారు చేసి విక్రయించి, వ్యాపారాన్ని వృద్ధిచేసుకునేందుకు కొత్త కొత్త సంస్థలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఎంఎక్స్మోటో సంస్థ కూడా ఇలాంటిదే! ఈ సంస్థకు చెందిన తొలి ఎలక్ట్రిక్ బైక్.. జులైలో లాంచ్కానుంది. దీని పేరు "ఎంఎక్స్మోటో ఎంఎక్స్9". ఈ ఎలక్ట్రిక్ బైక్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఎంఎక్స్9 ఎలక్ట్రిక్ వెహికిల్ హైలైట్స్ ఇవే..
ఈ కొత్త ఈవీలో 17 ఇంచ్ వీల్స్, రీజనరేటివ్ బ్రేకింగ్‌తో కూడిన 60 ఏఎంపీ కంట్రోలర్లు వస్తున్నాయి. ఫలితంగా బైక్ ఔట్పుట్ పవర్ 16శాతం పెరుగుతుంది. వెహికిల్ పర్ఫార్మెన్స్ సైతం మెరుగుపడుతుంది. ఈ బైక్‌ను ప్రముఖ డిజైనర్, క్రియేటర్ మెకెల్లో సిల్వా.. యూరోప్‌లో డిజైన్ చేశారు.
ఈ ఎంక్స్9 ఈవీలో లైఫ్పీఓ4 బ్యాటరీ టెక్నాలజీ ఉంటుంది. ఇది సేఫ్టీకి పెట్టింది పేరుగా గుర్తింపు తెచ్చుకుందని సంస్థ చెబుతోంది. ఈ టెక్నాలజీ వల్ల బ్యాటరీ రేంజ్, రైడింగ్ టైమ్ మెరుగుపడుతుంది. ఫలితంగా.. రోజువారీ ప్రయాణాలతో పాటు లాంగ్ ట్రిప్‌లకు కూడా ఈ బైక్‌ను ఉపయోగించుకోవచ్చని సంస్థ చెబుతోంది.
mXmoto MX9 electric bike : ఎంఎక్స్మోటోకు గురుగ్రామ్‌లో ఓ మేన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఉంది. ఏడాదికి 3వేలు- 4వేల ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందించే సామర్థ్యం ఈ ఫ్యాక్టరీ సొంతం. ఈ నేపథ్యంలో ఎంఎక్స్9 తర్వాత.. బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇండియాలో లాంచ్ చేయాలని సంస్థ ప్లాన్ చేస్తోంది.
ఇదీ చూడండి:- Ola new electric scooter : ఓలా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సీఈఓ ట్వీట్‌కు అర్థం ఇదేనా?
"చౌకైన ధరల్లో ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే విధంగా హై పర్ఫార్మెన్స్ ఈవీలను రూపొందించడమే మా లక్ష్యం," అని ఎంఎక్స్మోటో ఎండీ రాజేంద్ర మల్హోత్రా తెలిపారు.
లాంచ్ తర్వాత.. దేశవ్యాప్తంగా ఉన్న సంస్థ ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌లు, డీలర్షిప్ నెట్‌వర్క్‌లలో ఈ ఎంఎక్స్9 ఎలక్ట్రిక్ బైక్ అందుబాటులో ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది.
త్వరలో లాంచ్‌కానున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..
Bajaj Auto electric scooter news : దిగ్గజ ఆటోమొబైల్ సంస్థలు 2 వీలర్ ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెంచాయి. తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇండియాలో లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. బజాజ్ ఆటో నుంచి స్వింగర్, జీనీ పేర్లతో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు రాబోతున్నట్టు మార్కెట్లో ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఇండియా పేటెంట్స్ డిజైన్ అండ్ ట్రైడ్మార్క్స్ వెబ్సైట్లో స్వింగర్, జీనీ పేర్లు మే నెలలో కనిపించాయి. వీటిని బజాజ్ ఆటో ట్రైడ్మార్క్ చేసుకున్నట్టు తేలింది. వీటికి సంబంధించిన ఇతర వివరాలేవీ అందుబాటులో లేవు. కానీ ఇవి ఎలక్ట్రిక్ స్కూటర్లని మార్కెట్లో అంచనాలు మొదలయ్యాయి.
ఇండియా మార్కెట్లోకి త్వరలోనే 2 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది సింపుల్ ఎనర్జీ సంస్థ. ఇవి.. ఇప్పటికే మార్కెట్లో ఉన్న సింపుల్ 1 కన్నా తక్కువ ధరలో ఉంటాయని వెల్లడించింది. ప్రస్తుతం సింపుల్ 1 ఎక్స్‌షోరూం ధర రూ. 1.45లక్షలు- రూ. 1.5లక్షల మధ్యలో ఉంది.
మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాల లాంచ్‌ల వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం