Ola new electric scooter : ఓలా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సీఈఓ ట్వీట్‌కు అర్థం ఇదేనా?
Ola new electric scooter : ఓలా ఎలక్ట్రిక్ సంస్థ నుంచి కొత్త స్కూటర్ రాబోతోందా? సంస్థ సీఈఓ భవిష్ అగర్వాల్ తాజాగా చేసిన ట్వీట్‌ను చూస్తుంటే.. అవుననే సమాధానమే లభిస్తోంది.
Ola new electric scooter : ఇండియా ఎలక్ట్రిక్ 2 వీలర్ సెగ్మెంట్లో దూసుకెళుతున్న ఓలా.. మరో ప్రాడక్ట్ లాంచ్‌కు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ మేరకు ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ చేసిని ఓ ట్వీట్ ఆసక్తికరంగాగా మారింది. జులైలో కొత్త ప్రాడక్ట్ లాంచ్ ఉంటుంది అన్నట్టుగా ఆయన ట్వీట్ చేశారు.
"జులైలో జరిగే ఈవెంట్లో ఓ కొత్త ప్రాడక్ట్‌ను ప్రకటిస్తాము. ఈ ఈవెట్ను #endICEAge షో అని పిలుస్తున్నాము. ఇది పార్ట్ 1 మాత్రమే. ఈ షోతో స్కూటర్లలో ఐసీఈ ఏజ్ స్కూటర్లకు ముగింపు పడుతుంది! ఎస్1 ప్రో, ఎస్ 1 ఎయిర్‌తో పాటు మరెన్నో..," అని భవిష్ అగర్వాల్ ట్వీట్ చేశారు.
ఐసీఈ అంటే.. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్‌తో కూడిన స్కూటర్లు. వీటిని తగ్గించేందుకు ప్రపంచం కృషిచేస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భవిష్ అగర్వాల్ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. క్రిప్టిక్గా ఉన్న ఈ ట్వీట్ కింద నెటిజన్లు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. 'యెస్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తోంది. మోర్ పవర్, మోర్ రేంజ్' అని ఓ వ్యక్తి కామెంట్ చేయగా.. ‘వెయిటింగ్. చాలా థ్రిల్లింగా ఉంది,’ అని ఇంకొ నెటిజన్ రాసుకొచ్చారు. 'కొత్త లాంచ్‌లు సరే.. కానీ సర్వీస్ మాటేంటి? మీ సర్వీస్ బాగాలేదు,' అని ఇంకొందరు కామెంట్లు పెడుతుండటం గమనార్హం.
ఇదీ చూడండి:- Best electric scooters in India : మార్కెట్లో ఉన్న ది బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోలో.. ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రో, ఓలా ఎస్1 ఎయిర్ వంటి ప్రాడక్ట్స్ ఉన్నాయి. వీటి ఎక్స్‌షోరూం ధరలు వరుసగా రూ. 1.30లక్షలు, రూ. 1.40లక్షలు, రూ. 99,999గా ఉన్నాయి. మరి నెటిజన్లు అనుకుంటున్నట్టుగా.. ఓలా ఎలక్ట్రిక్ నుంచి మరో కొత్త స్కూటర్ వస్తే, సంస్థ పోర్ట్‌ఫోలియో మరింత శక్తివంతంగా మారుతుందనడంలో సందేహం లేదు. ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో ఓలాకు ఇప్పటికే మంచి గుర్తింపు ఉందన్న విషయం తెలిసిందే.
మరి జులైలో కొత్త ప్రాడక్ట్‌ను చూపిస్తారా.. లేక ఈవెంట్ ఎప్పుడు జరుగుతుంది? అన్న విషయాన్ని వచ్చే నెలలో చెబుతారా? అన్నది వేచిచూడాలి.
చౌకైన వడ్డీతో స్కూటర్ పొందండి..
తమ వినియోగదారులకు లాభదాయకమైన ఫైనాన్సింగ్ ఆప్షన్‌లను ఇటీవలే తీసుకువచ్చింది ఓలా ఎలక్ట్రిక్. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఎల్ అండ్ టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సహా ప్రముఖ ఫైనాన్సింగ్ సంస్థల భాగస్వామ్యంతో.. జీరో డౌన్ పేమెంట్‌తో 60 నెలల కాలవ్యవధికి కేవలం 6.99శాతం వడ్డీ రేటుతో ఓలా స్కూటర్ని ఇంటికి తీసుకువెళ్లే సదుపాయం కల్పిస్తోంది. దీనితో, అతి తక్కువ నెలవారీ ఈఎంఐలతో, జీరో డౌన్ పేమెంట్‌తో ఓలా స్కూటర్‌కి యజమాని అయ్యే అవకాశాన్ని సంస్థ కల్పిస్తోంది.
ఈ ఫైనాన్సింగ్ ఎంపికలతో ఈవీని సొంతం చేసుకునేందుకు అయ్యే ఖర్చు.. ఇప్పుడు వేరే ఏదైనా వాహనాన్ని కొనడానికి అయ్యే ఖర్చుతో పోలిస్తే సగమేనని సంస్థ చెబుతోంది. ఓలా యాప్ ద్వారా ఈ ఫైనాన్సింగ్ ఆప్షన్ల పూర్తి వివరాలను తెలుసుకోవచ్చని పేర్కొంది. ఈ ఫైనాన్సింగ్ ఆప్షన్స్‌ను ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కూడా ఎంపిక చేసుకోవచ్చని వివరించింది.
సంబంధిత కథనం