Electric scooters : సింపుల్ ఎనర్జీ నుంచి త్వరలోనే రెండు కొత్త ఈ- స్కూటర్లు!
Simple Energy electric scooters : ప్రముఖ 2 వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ ఒక అప్డేట్ ఇచ్చింది. వచ్చే త్రైమాసికంలో రెండు కొత్త ఈ-స్కూటర్లను లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది.
Simple Energy electric scooters : ఇండియా మార్కెట్లోకి త్వరలోనే 2 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది సింపుల్ ఎనర్జీ సంస్థ. ఇవి.. ఇప్పటికే మార్కెట్లో ఉన్న సింపుల్ 1 కన్నా తక్కువ ధరలో ఉంటాయని వెల్లడించింది. ప్రస్తుతం సింపుల్ 1 ఎక్స్‌షోరూం ధర రూ. 1.45లక్షలు- రూ. 1.5లక్షల మధ్యలో ఉంది.
తక్కువ ధరలో ఈ-స్కూటర్లు..
ఎలక్ట్రిక్ స్కూటర్ల సెగ్మెట్లో తమ పోర్ట్‌ఫోలియోను పెంచుకోవాలని చూస్తోంది సింపుల్ 1. ఇందులో భాగంగానే వచ్చే త్రైమాసికంలో రెండు ఈ-స్కూటర్లను తీసుకొస్తోంది. వీటి ధర రూ. 1లక్ష- రూ. 1.2లక్షల మధ్యలో ఉండొచ్చు. వీటిల్లో బ్యాటరీ ప్యాక్ చిన్నగా ఉండే అవకాశం ఉంది. ఫలితంగా రేంజ్ కూడా తగ్గొచ్చు. తక్కువ ధరతో వస్తుండటంతో ఈ సింపుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఫీచర్స్ కూడా పెద్దగా ఉండకపోవచ్చు. లుక్ అట్రాక్టివ్‌గా ఉండే అవకాశం ఉంది. లాంచ్ తర్వాత ఈ 2 వీలర్స్.. టీవీఎస్ ఐక్యూబ్, అథెర్ 450ఎక్స్, ఓలా ఎస్1 ఎయిర్‌కు గట్టిపోటీనిస్తుందని అంచనాలు ఉన్నాయి.
సింపుల్ 1లోని ఎలక్ట్రిక్ మోటార్.. పీక్ పవర్ ఔట్పుట్ 8.5 కేడబ్ల్యూగా ఉంది. 72 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేయగలదు. ఐపీ67 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఈ మోటార్‌కు వస్తుంది. దీని టాప్ స్పీడ్ 105 కేఎంపీహెచ్. 0-40 కేఎంపీహెచ్‌ను కేవలం 2.77 సెకన్లలో అందుకోగలదు. ఈకో, రైడ్, డాష్, సోనిక్ వంటి మోడ్స్ ఉన్నాయి.
ఇదీ చూడండి:- Honda electric scooters : హోండా నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు..
ఇందులోని 5 కేడబ్ల్యూహెచ్‌తో కూడిన రెండు బ్యాటరీ ప్యాక్స్‌ను పూర్తిగా ఛార్జ్ చేసేందుకు 5 గంటల 54 నిమిషాల సమయం పడుతుంది. పోర్టెబుల్ బ్యాటరీ ఛార్జింగ్‌కు 2 గంటల 7 నిమిషాలు, ఫిక్స్డ్ బ్యాటరీకి 3 గంటల 47 నిమిషాల సమయం పడుతుంది.
సింపుల్ 1లో పార్క్ అసిస్ట్, బ్లూటూత్, 4జీ కనెక్టివిటీ, ఓటీఏ అప్డేట్స్, ఆన్‌బోర్డ్ నావిగేషన్, డాక్యుమెంట్ స్టోరేజ్, మొబైల్ అప్లికేషన్, 7 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ క్లస్టర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
మరి త్వరలోనే రానున్న 2 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల ఫీచర్స్ ఎలా ఉంటాయో వేచి చూడాలి. ధరతో పాటు ఇతర వివరాలు లాంచ్ సమయంలో అందుబాటులోకి రావొచ్చు.
సంబంధిత కథనం