World environment day : ది బెస్ట్​ రేంజ్​ ఉన్న టాప్​ ఎలక్ట్రిక్​ కార్లు ఇవే..!-world environment day top electric cars in india with best range ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  World Environment Day : ది బెస్ట్​ రేంజ్​ ఉన్న టాప్​ ఎలక్ట్రిక్​ కార్లు ఇవే..!

World environment day : ది బెస్ట్​ రేంజ్​ ఉన్న టాప్​ ఎలక్ట్రిక్​ కార్లు ఇవే..!

Sharath Chitturi HT Telugu
Jun 05, 2023 06:50 PM IST

World environment day : పర్యావరణ ప్రేమికుల్లో చాలా మంది ఎలక్ట్రిక్​ వాహనాలవైపు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియాలో మంచి రేంజ్​ ఇచ్చే ఈవీల వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..

ది బెస్ట్​ రేంజ్​ ఉన్న టాప్​ ఎలక్ట్రిక్​ కార్లు ఇవే..!
ది బెస్ట్​ రేంజ్​ ఉన్న టాప్​ ఎలక్ట్రిక్​ కార్లు ఇవే..! (HT AUTO)

World environment day 2023 : వాతావరణ మార్పులపై ఇటీవలి కాలం విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేకమంది ప్రజలు.. సాధారణ వాహనాలను విడిచి ఈవీలవైపు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ఎలక్ట్రిక్​ వాహనాలకు డిమాండ్​ పెరుగుతోంది. అయితే.. మంచి రేంజ్​ ఉన్న వాహనాన్ని చూసి కొనుగోలు చేయాలని కస్టమర్లు భావిస్తున్నారు. వీరిలో మీరు కూడా ఉన్నారా? మంచి రేంజ్​ ఇచ్చే ఈవీని తీసుకోవాలని చూస్తున్నారా? అయితే.. ఇండియాలో.. ది బెస్ట్​ రేంజ్​ ఇస్తున్న ఈవీల వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

టాటా నెక్సాన్​ ఈవీ మ్యాక్స్​..

దేశ ఈవీ సెగ్మెంట్​లో రారాజుగా కొనసాగుతోంది టాటా మోటార్స్​. ఇందుకు కారణం ఈ అటోమొబైల్​ సంస్థ పోర్ట్​ఫోలియో. ముఖ్యంగా టాటా నెక్సాన్​ ఈవీ మ్యాక్స్​.. 400 కిలోమీటర్లకుపైగా రేంజ్​ను ఇస్తోంది. 7.2కేడబ్ల్యూ ఏసీ ఫాస్ట్​ ఛార్జర్​తో కేవలం 6-7 గంటల్లోనే ఫుల్​ ఛార్జింగ్​ చేసుకోవచ్చు. వేగంగా కావాలంటే 50 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్​ ఛార్జర్​తో గంటలో పూర్తిగా ఛార్జ్​ చేసుకోవచ్చు కూడా.

ఎంజీ జెడ్​ఎస్​ ఈవీ..

జెడ్​ఎస్​ ఈవీని గతేడాది మార్చ్​లో అప్డేట్​ చేసింది ప్రముఖ వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్​. ఫలితంగా రేంజ్​ మెరుగుపడింది. సంస్థ ప్రకారం.. ఈ ఈవీని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. 461కి.మీల దూరం ప్రయాణించవచ్చు! 0-100 కేఎంపీహెచ్​ను కేవలం 8.5 సెకన్లలో అందుకోగలదు కూడా.

ఇదీ చూడండి:- Best electric scooters in India : మార్కెట్​లో ఉన్న ది బెస్ట్​ ఎలక్ట్రిక్​ స్కూటర్లు ఇవే!

హ్యుందాయ్​ ఐయానిక్​ 5..

ప్రీమియం ఎలక్ట్రిక్​ కారు కొనాలని చూస్తున్న వారికి ఈ హ్యుందాయ్​ ఐయానిక్​ 5 మంచి ఆప్షన్​ అవుతుంది! ఇందులోని 72.6 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 631కి.మీల వరకు ప్రయాణించవచ్చు. 350కేడబ్ల్యూ డీసీ ఛార్జర్​తో 10-80శాతం ఛార్జింగ్​ను కేవలం 18 నిమిషాల్లో పూర్తి చేసుకోవచ్చు!

మెర్సిడెస్​ బెంజ్​ ఈక్యూఎస్​ ఎస్​యూవీ..

Electric cars with highest range in India : ఈ లగ్జరీ ఎస్​యూవీలో 107.8 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. దీని రేంజ్​ 857 కి.మీలు. డీసీ ఫాస్ట్​ ఛార్జర్​కు 400వీ వోల్టేజ్​ సప్లైను అందిస్తే.. కేవలం 30 నిమిషాల్లోన 80శాతం వరకు ఛార్జింగ్​ అవుతుంది. ఈ మోడల్​ టాప్​ స్పీడ్​ 210కేఎంపీహెచ్​.

ఆడీ ఈ-ట్రాన్​ జీటీ..

ఈ ఆడీ ఈ ట్రాన్​లో 93కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. దీని రేంజ్​ 500కి.మీలు. 0-100 కేఎంపీహెచ్​ను కేవలం 4.1 సెకన్లలో అందుకోగలదు!

Whats_app_banner

సంబంధిత కథనం