Ola Electric scooter: చవకైన వడ్డీ రేటుతో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను సొంతం చేసుకోండి..
Ola Electric scooter: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి జీరో డౌన్ పేమెంట్‌తో 60 నెలల కాలవ్యవధితో మార్కెట్‌లో అతి తక్కువ వడ్డీ రేటును ఓలా ఆఫర్ చేస్తోంది.
Ola Electric scooter: భారతదేశపు అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, 2W సెగ్మెంట్‌లో అత్యుత్తమ S1 స్కూటర్ లైనప్ ను కలిగి ఉంది. ఇప్పుడు తాజాగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులకు లాభదాయకమైన ఫైనాన్సింగ్ ఆప్షన్‌లను తీసుకువచ్చింది. IDFC ఫస్ట్ బ్యాంక్ మరియు L&T ఫైనాన్షియల్ సర్వీసెస్ సహా ప్రముఖ ఫైనాన్సింగ్ సంస్థల భాగస్వామ్యంతో, జీరో డౌన్ పేమెంట్‌తో 60 నెలల కాలవ్యవధికి కేవలం 6.99% వడ్డీ రేటుతో ఓలా స్కూటర్ ని ఇంటికి తీసుకువెళ్లే సదుపాయం కల్పిస్తోంది. దీనితో, అతి తక్కువ నెలవారీ EMIలతో, జీరో డౌన్ పేమెంట్‌తో ఓలా స్కూటర్ కి యజమాని అయ్యే అవకాశాన్ని ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) కల్పిస్తోంది.
Ola Electric scooter finance options: మార్కెట్ లీడర్ ఓలా
మార్కెట్ లీడర్‌గా, ప్రముఖ ఫైనాన్సింగ్ భాగస్వాములతో భాగస్వామ్యంతో టైర్ 1 లోనే కాకుండా టైర్ 2 మరియు టైర్ 3 నగరాల్లో కూడా అత్యంత లాభదాయకమైన ఫైనాన్సింగ్ ఎంపికలనువినియోగదారులకు అందిస్తున్నామని ఓలా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకుష్ అగర్వాల్ తెలిపారు. EV 2W సెగ్మెంట్లో భారత్ లో మంచి మార్కెట్ ఉందన్నారు. ఈ ఫైనాన్సింగ్ ఎంపికలతో EVని సొంతం చేసుకునేందుకు అయ్యే ఖర్చు ఇప్పుడు వేరే ఏదైనా వాహనాన్ని కొనడానికి అయ్యే ఖర్చుతో పోలిస్తే సగమేనని తెలిపారు. ఓలా యాప్ ద్వారా ఈ ఫైనాన్సింగ్ ఆప్షన్ల పూర్తి వివరాలను తెలుసుకోవచ్చని వెల్లడించారు. ఈ ఫైనాన్సింగ్ ఆప్షన్స్ ను ఆన్లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో కూడా ఎంపిక చేసుకోవచ్చు.