తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Multibagger Penny Stock : ఏడాదిలో 400శాతం పెరిగిన మల్టీబ్యాగర్​ పెన్నీ స్టాక్​..!

Multibagger penny stock : ఏడాదిలో 400శాతం పెరిగిన మల్టీబ్యాగర్​ పెన్నీ స్టాక్​..!

Sharath Chitturi HT Telugu

09 January 2024, 13:05 IST

    • Multibagger penny stock : మల్టీబ్యాగర్​ పెన్నీ స్టాక్​ గుజరాత్​ టూల్​రూమ్​ షేరు.. ఏడాదిలో 400శాతం పెరిగింది! ఫలితంగా.. రూ. 1లక్ష పెట్టుబడిని ఏడాదిలోనే రూ. 5లక్షలకు తీసుకెళ్లింది.
ఏడాదిలో 400శాతం రిటర్నులు ఇచ్చిన మల్టీబ్యాగర్​ పెన్నీ స్టాక్​..
ఏడాదిలో 400శాతం రిటర్నులు ఇచ్చిన మల్టీబ్యాగర్​ పెన్నీ స్టాక్​.. (Photo: iStock)

ఏడాదిలో 400శాతం రిటర్నులు ఇచ్చిన మల్టీబ్యాగర్​ పెన్నీ స్టాక్​..

Multibagger penny stock: 'మల్టీబ్యాగర్​ స్టాక్​'.. ఈ పదం అంటే స్టాక్​ మార్కెట్​ మదుపర్లకు చాలా ఇష్టం. తక్కువ కాలంలోనే భారీ రిటర్నులు ఇచ్చే ఈ తరహా స్టాక్స్​పై ఇన్​వెస్టర్ల ఫోకస్​ ఎప్పుడు ఉంటుంది. ఒక్కటి తగిలినా.. లైఫ్​ సెట్​ అనుకునే వాళ్లు చాలా మంది ఉంటారు. అంచనాలకు తగ్గట్టుగానే.. ఈ స్టాక్స్​ మల్టీఫోల్డ్​ రిటర్నులు తెచ్చిపెడతాయి. గుజరాత్​ టూల్​రూమ్​ స్టాక్​ ఇందుకు తాజా ఉదాహరణ. ఈ స్టాక్​.. కేవలం ఏడాది కాలంలో 400శాతం పెరిగింది! పైగా.. ఇదొక పెన్నీ స్టాక్​ కావడం విశేషం. వివరాల్లోకి వెళితే..

మల్టీబ్యాగర్​ గుజరాత్​ టూల్​రూమ్​ పెన్నీ స్టాక్​..

దలాల్​ స్ట్రీట్​ మదుపర్ల ఫోకస్​ ఇప్పుడు ఈ గుజరాత్​ టూల్​రూమ్​ షేరుపై పడింది. గత కొన్ని రోజులుగా.. ఈ స్టాక్​ అప్పర్​ సర్క్యూట్స్​ హిట్​ చేస్తోంది. మంగళవారం ఎర్లీ ట్రేడ్​లో కూడా అప్పర్​ సర్క్యూట్​ తగిలింది.

ఏడాది క్రితం రూ. 12.65 వద్ద ఉన్న ఈ గుజరాత్​ టూల్​రూమ్​ పెన్నీ స్టాక్​.. ఇప్పుడు రూ. 62.28కి చేరింది. అంటే.. ఏడాదిలో 400శాతం పెరిగినట్టు!

Gujarat Toolroom share price : గత నెలలో రోజుల వ్యవధిలో రూ. 57.99 నుంచి రూ. 62.28 వరకు పెరిగింది గుజరాత్​ టూల్​రూమ్​ స్టాక్​. అంటే 7.5శాతం రిటర్నులు ఇచ్చినట్టు. ఇక మూడు నెలల వ్యవధిలో 24.90 నుంచి రూ. 62.28కు పెరిగిన ఈ మల్టీబ్యాగర్​ పెన్నీ స్టాక్​.. 150శాతం రిటర్నులు తెచ్చిపెట్టింది. 6 నెలల వ్యవధిలో రూ. 13.09 నుంచి రూ. 62.28కు పెరిగింది. అది 300శాతం పెరిగినట్టు! ఇక ఏడాది కాలంలో.. రూ. 12.65 నుంచి రూ. 62.28కు పెరిగింది. ఫలితంగా.. 400శాతం రిటర్నులు తెచ్చిపెట్టునట్టు అయ్యింది.

రూ. 1లక్షలు = రూ. 5 లక్షలు..

స్టాక్​ మార్కెట్​లో.. గుజరాత్​ టూల్​రూమ్​ షేరులో నెల రోజుల క్రితం రూ. 1లక్ష పెట్టి ఉంటే, ఇప్పుడు దాని విలువ రూ. 1,07,500గా ఉండేది. అదే 3 నెలల ముందు రూ.1 లక్ష పెట్టి ఉంటే, దాని విలువ రూ. 2.50లక్షలుగా ఉండేది. 6 నెలల ముందు ఈ మల్టీబ్యాగర్​ స్టాక్​- గుజరాత్​ టూల్​రూమ్​ షేరులో రూ. 1లక్ష పెట్టి ఉంటే, మీ సంపద రూ. 4లక్షలు అయ్యేది. ఏడాది క్రితం రూ. 1లక్ష పెట్టి ఉంటే, ఇప్పుడు మీ సంపద రూ.5 లక్షల వరకు వెళ్లేది.

Multibagger Gujarat Toolroom share price : ఈ గుజరాత్​ టూల్​రూమ్​ మల్టీబ్యాగర్​ పెన్నీ స్టాక్​ కేవలం బీఎస్​ఈలోనే ట్రేడ్​కు అందుబాటులో ఉంది. ఈ సంస్థ మార్కెట్​ క్యాపిటల్​ రూ. 345కోట్లు. స్టాక్​ 52 వీక్​ హై వచ్చేసి రూ. 62.28. 52వీక్​ లో వచ్చేసి రూ. 8.58.

(గమనిక:- ఇది అవగాహన కోసం ప్రచురించిన కథనం మాత్రమే. పెన్నీ స్టాక్స్​లో పెట్టుబడి అంటే రిస్క్​తో కూడుకున్న వ్యవహారం అని గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా స్టాక్​లో ఇన్​వెస్ట్​ చేసే ముందు.. మీరు మీ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

తదుపరి వ్యాసం