Stocks to buy today : రూ. 120 దగ్గర ఉన్న ఈ స్టాక్​ కొంటే భారీ లాభాలు..!-stocks to buy today 9 jan 2023 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : రూ. 120 దగ్గర ఉన్న ఈ స్టాక్​ కొంటే భారీ లాభాలు..!

Stocks to buy today : రూ. 120 దగ్గర ఉన్న ఈ స్టాక్​ కొంటే భారీ లాభాలు..!

Sharath Chitturi HT Telugu
Jan 09, 2024 08:24 AM IST

Stocks to buy today : ట్రేడర్లు ట్రాక్​ చేయాల్సిన నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..
స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో భారీగా నష్టపోయాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 671 పాయింట్లు కోల్పోయి 71,355 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 198 పాయింట్ల నష్టంతో 21,513 వద్ద ముగిసింది. ఇక 709 పాయింట్లు కోల్పోయిన బ్యాంక్​ నిఫ్టీ 47,450 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీలో వీక్​నెస్​ కనిపిస్తోంది. 21,350 మార్క్​ దిగువన క్లోజ్​ అయితే.. నిఫ్టీ మరింత పతనమవ్వొచ్చు! 21,650 రెసిస్టెన్స్​గా ఉంది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 16.03 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 155.96 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

Stocks to buy today : ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ లాభాల్లో మొదలుపెట్టే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ.. దాదాపు 140 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

అమెరికా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో భారీ లాభపడ్డాయి. ఎస్​ అండ్​ పీ 500 1.41శాతం, నాస్​డాక్​ 2.2శాతం మేర లాభపడ్డాయి. డౌ జోన్స్​ 0.58శాతం వృద్ధిచెందింది.

స్టాక్స్​ టు బై..

Stocks to buy : హెచ్​సీఎల్​ టెక్నాలజీస్​:- బై రూ. 1447.90, స్టాప్​ లాస్​ రూ. 1420, టార్గెట్​ రూ. 1495 

సుందరమ్​ ఫైనాన్స్​:- బై రూ. 3719, స్టాప్​ లాస్​ రూ. 3590, టార్గెట్​ రూ. 3912

Paytm share price target : పేటీఎం:- బై రూ. 692, స్టాప్​ లాస్​ రూ. 680, టార్గెట్​ రూ. 715

బ్యాంక్​ ఆఫ్​ ఇండియా:- బై రూ. 119, స్టాప్​ లాస్​ రూ. 114, టార్గెట్​ రూ. 125

శ్రీరామ్​ ఫైనాన్స్​:- బై రూ. 2195- రూ. 2200, స్టాప్​ లాస్​ రూ. 2141, టార్గెట్​ రూ. 2270

ఆస్ట్రల్​:- బై రూ. 1810- రూ. 1805, స్టాప్​ లాస్​ రూ. 1865, టార్గెట్​ రూ. 1900

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం