తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Multibagger Stock : 3ఏళ్లల్లో 1100శాతం పెరిగిన మల్టీబ్యాగర్​ స్టాక్​- ఇప్పుడు కొన్నా భారీ లాభాలు!

Multibagger stock : 3ఏళ్లల్లో 1100శాతం పెరిగిన మల్టీబ్యాగర్​ స్టాక్​- ఇప్పుడు కొన్నా భారీ లాభాలు!

Sharath Chitturi HT Telugu

04 September 2023, 19:20 IST

    • Multibagger stock : ఓ స్టాక్​.. మూడేళ్లల్లో ఏకంగా 1100శాతం పెరిగింది. ఇంకా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
3ఏళ్లల్లో 1100శాతం పెరిగిన మల్టీబ్యాగర్​ స్టాక్
3ఏళ్లల్లో 1100శాతం పెరిగిన మల్టీబ్యాగర్​ స్టాక్

3ఏళ్లల్లో 1100శాతం పెరిగిన మల్టీబ్యాగర్​ స్టాక్

Multibagger stock : బీసీఎల్​ ఇండస్ట్రీస్​ అనే మల్టీబ్యాగర్​ స్టాక్​.. మూడేళ్లల్లో ఏకంగా 1100శాతం పెరిగి, మదుపర్లకు భారీ లాభాలను ఇచ్చింది. ఈ సంస్థ షేర్లను ఇప్పుడు కొన్నా.. మంచి లాభాలు సంపాదించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Upcoming compact SUVs in India : ఇండియాలో లాంచ్​కు రెడీ అవుతున్న ఎస్​యూవీలు ఇవే..!

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో కొత్త వేరియంట్లు.. త్వరలోనే లాంచ్​!

Tata Nexon SUV : టాటా నెక్సాన్​లో కొత్త ఎంట్రీ లెవల్​ వేరియంట్లు.. భారీగా దిగొచ్చిన ఎస్​యూవీ ధర!

Gold price today : స్థిరంగా పసిడి ధరలు- తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఇలా..

మల్టీబ్యాగర్​ బీసీఎల్​ స్టాక్​..

ఎఫ్​ఎంసీజీ, రియల్​ ఎస్టేట్​, కెమికల్​ సెగ్మెంట్స్​​లో వ్యాపారాలు సాగిస్తోంది ఈ బీసీఎల్​ ఇండస్ట్రీస్​. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ ముగిసే సమయానికి ఈ స్టాక్​ రూ. 492 వద్ద స్థిరపడింది. ఐదు రోజుల్లో దాదాపు 3శాతం లాభపడిన ఈ బీసీఎల్​ ఇండస్ట్రీస్​ షేరు.. నెల రోజుల్లో సుమారు 4శాతం వృద్ధిచెందింది. గత 6 నెలల్లో 10.2శాతం పెరిగింది. ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు ఏకంగా 52శాతం వృద్ధిని సాధించింది. ఇక ఏడాది కాలంలో దాదాపు 37శాతం పెరిగింది. మూడేళ్ల క్రితం ఈ స్టాక్​ రూ. 40 వద్ద ట్రేడ్​ అయ్యేది. నేటి ట్రేడింగ్​ సెషన్​తో పోల్చుకుంటే.. మూడేళ్లల్లో ఈ సంస్థ షేర్లు మదుపర్లకు 1100శాతం కన్నా ఎక్కువ రిటర్నులు ఇచ్చినట్టు!

BCL Industries share price target : ఈ బీసీఎల్​ ఇండస్ట్రీస్​ షేర్లను ఇప్పుడు కొన్నా.. దీర్ఘకాలంలో మంచి లాభాలు వస్తాయని ఇన్​క్రెడ్​ ఈక్విటీస్​ చెబుతోంది. షేర్​ ప్రైజ్​ టార్గెట్​ను రూ. 925గా ప్రకటించింది. అంటే.. ఇక్కడి నుంచి ఇంకో 85శాతం ఎక్కువ!

"ఈ సంస్థకు చెందిన కొత్త ప్లాంట్​.. పశ్చిమ్​ బెంగాల్​లో ఓపెన్​ అయ్యింది. సంస్థ చెసే వ్యాపారంలో వాల్యూమ్​లు పెరుగుతాయి. వాల్యూ కూడా పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న వాల్యుయేషన్​ను పరిగణిస్తే.. ఈ స్టాక్​ టార్గెట్​ ప్రైజ్​ రూ. 925. ఇది బుల్​ కేస్​ పరిస్థితి. బేర్​ మార్కెట్​లో బీసీఎల్​ ఇండస్ట్రీస్​ షేర్​ ప్రైజ్​ టార్గెట్​ రూ. 660," అని ఇన్​క్రెడ్​ ఈక్విటీస్​ వెల్లడించింది.

Multibaggar BCL Industries share : ఈ బీసీఎల్​ ఇండస్ట్రీస్​ ఒక స్మాల్​-క్యాప్​ కంపెనీ. దీని మార్కెట్​ వాల్యూ సుమారు రూ. 1,225 కోట్లు.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. స్మాల్​ క్యాప్​/మల్టీబ్యాగర్​ స్టాక్స్​లో పెట్టుబడి రిస్క్​తో కూడుకున్న వ్యవహారం. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు.. మీ ఫైనాన్షియల్​ ఎడ్వైజర్లను సంప్రదించడం శ్రేయస్కరం.)

తదుపరి వ్యాసం