PAN Aadhaar linking deadline : పాన్- ఆధార్ లింక్ చేసుకున్నారా? ఈరోజే లాస్ట్ డే!
30 June 2023, 11:25 IST
- PAN Aadhaar linking : పాన్- ఆధార్ లింక్ చేసుకున్నారా? లేకపోతే త్వరపడండి. ఈరోజే లాస్ట్ డేట్..
పాన్- ఆధార్ లింక్ చేసుకున్నారా?
PAN Aadhaar linking last date : పాన్- ఆధర్ కార్డ్ లింకింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తుది గడువు నేటితో (శుక్రవారం, జూన్ 30) ముగియనుంది. మరి ఈ డెడ్‌లైన్‌ను ప్రభుత్వం పొడగిస్తుందో, లేదో తెలియదు. ఈ నేపథ్యంలో ఎవరైనా పాన్- ఆధార్ కార్డులను ఇంకా లింక్ చేసుకోకపోయుంటే.. వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే గడువు ముగిసే లోపు లింక్ చేసుకోవడం శ్రేయస్కరం.
పాన్- ఆధార్ లింక్ చేసుకోకపోతే.. ఏం అవుతుంది?
- మీ పాన్ కార్డు పనిచేయదు
- పెండింగ్‌లో ఉన్న ట్యాక్స్ రీఫండ్స్, వాటిపై రావాల్సిన వడ్డీ పడదు.
- టీడీఎస్ ఎక్కువగా డిడక్ట్ అవుతుంది.
- టీసీఎస్ కూడా ఎక్కువగా కట్ అవుతుంది.
ఆదాయపు పన్నుశాఖ నిబంధనల ప్రకారం.. పాన్- ఆధార్ లింకింగ్ అందరికి తప్పనిసరి. రూ. 1000, అంతకన్నా ఎక్కువ లేట్ ఫీజ్ వాటిని లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి:- Aadhaar Ration Card Linking : ఆధార్- రేషన్ కార్డు లింక్ చేసుకున్నారా? లాస్ట్ డేట్ ఇదే..!
రెండు కార్డులు లింక్ అవ్వట్లేదా...?
PAN Aadhaar linking last date extended : ఒక్కోసారి పాన్- ఆధార్ కార్డు లింక్ అవ్వట్లేదని కొందరు చెబుతున్నారు. ఇందుకు గల కారణాలని ఆదాయపు పన్నుశాఖ వెల్లడించింది.
పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ మ్యాచ్ అవ్వకపోవడంతో రెండు కార్డులు లింక్ అవ్వకపోవచ్చు. ఈ నేపథ్యంలో ముందు పాన్ కార్డును అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే రెండింటినీ లింక్ చేసుకోవాలి.
www/onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html
https://www.pan.utiitsl.com
ఈ రెండు లింక్స్‌లోకి వెళ్లి పాన్ కార్డును అప్లే చేసుకోవచ్చు. ఆ తర్వాత పాన్ ఆధార్ లింకింగ్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.
వీరికి వర్తించదు..
PAN Aadhaar linking latest news : జమ్ముకశ్మీర్, అసోం, మేఘాలయవాసులు పాన్- ఆధార్ కార్డులను లింక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎన్ఆర్ఐలు, 80ఏళ్లు పైబడిన వారు, భారత పౌరసత్వం లేని వారికి కూడా మినహాయింపు ఉంది.
వాస్తవానికి పాన్ ఆధార్ లింకింగ్‌కు సంబంధించిన డెడ్‌లైన్‌ను ఇప్పటికే చాలాసార్లు వాయిదా వేసింది ప్రభుత్వం. మరి ఈసారి కూడా పోస్ట్‌పోన్ చేస్తుందా? లేదా? చూడాలి.
ఆధార్ వివరాలు ఉచితంగా మార్చుకోండి..
పౌరులు తమ ఆధార్ కార్డులో అడ్రస్ వంటి వివరాలను మార్చుకోవాలనుకుంటే, సెప్టెంబర్ 14 వరకు ఆన్ లైన్ లో వారు ఉచితంగా ఆ మార్పులు చేసుకోవచ్చు. ఈ మేరకు ఆధార్ కార్డులను జారీ చేసే అథారిటీ యూఐడీఏఐ వెసులుబాటు కల్పించింది. గతంలో ఈ గడువు జూన్ 14 వరకు మాత్రమే ఉండేది. ఈ మార్చి నెలలో ఈ ఉచిత ఆధార్ అప్ డేట్ డ్రైవ్ ను యూఐడీఏఐ ప్రారంభించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.