How to link Aadhaar to LPG : ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్‌కు ఆధార్‌ను లింక్ చేయండి ఇలా..
22 May 2023, 7:21 IST
- How to link Aadhaar to LPG : కొత్తగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ తీసుకుంటున్నారా? అయితే.. కనెక్షన్‌కు ఆధార్ కార్డును ఎలా లింక్ చేయాలో ఇక్కడ తెలుసుకోండి..
ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్‌కు ఆధార్ కార్డును లింక్ చేయడం ఎలా?
How to link Aadhaar to LPG : దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీని ఇస్తోంది భారత ప్రభుత్వం. అయితే సబ్సిడీ అమౌంట్ పొందాలంటే ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్‌ను ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు.. సబ్సిడీ అమౌంట్ డైరక్ట్‌గా బ్యాంక్ అకౌంట్లోకి పడిపోతుంది. ఈ నేపథ్యంలో ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్‌కు ఆధార్ కార్డును ఎలా లింక్ చేయాలో ఇక్కడ తెలుసుకుందాము..
ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్..
ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్‌కు ఆధార్‌ను లింక్ చేసే ముందు.. బ్యాంక్ అకౌంట్‌ను ఆధార్ నెంబర్‌తో లింక్ చేసుకోవాలి. అనంతరం ఆధార్ కార్డు ఫొటో కాపీనీ సంబంధిత గ్యాస్ ఏజెన్సీ డీలర్‌కు ఇవ్వాలి. అప్పుడు అది ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్‌కు లింక్ అవుతుంది.
ఆధార్ కార్డును భారత్ గ్యాస్ కనెక్షన్‌కు లింక్ చేయడం ఎలా?
వెబ్సైట్ ద్వారా..
స్టెప్ 1:- ముందుగా యూఐడీఏఐ వెబ్సైట్లోకి వెళ్లండి.
link Aadhaar number to LPG connection : స్టెప్ 2:- ఫార్మ్‌ను డౌన్లోడ్ చేసుకోండి.
స్టెప్ 3:- మీ రెసిడెన్షియల్ అడ్రెస్‌ను ఫిల్ చేయండి.
స్టెప్ 4:- ఎలాంటి బెనిఫిట్ (ఎల్పీజీ)ను ఎంచుకోవాలని అనుకుంటున్నారో సెలక్ట్ చేసుకోండి.
స్టెప్ 5:- ఆధార్ నెంబర్‌తో పాటు మీ వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేయండి.
స్టెప్ 6:- సబ్మీట్ బటన్ మీద క్లిక్ చేయండి. మీకు ఒక ఓటీపీ వస్తుంది.
స్టెప్ 7:- అప్లికేషన్ సబ్మీషన్ కోసం ఓటీపీని ఫిల్ చేయండి.
ఇదీ చూడండి:- Aadhaar card status : మీ ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్ స్టేటస్‌ను చెక్ చేసుకోండిలా..
డిస్ట్రిబ్యూటర్‌కు ఇస్తుంటే..
Aadhaar card latest news : స్టెప్ 1:- భారత్ గ్యాస్ అధికారిక వెబ్సైట్లో నుంచి ఫార్మ్‌ను డౌన్లోడ్ చేసుకోండి.
స్టెప్ 2:- ఫార్మ్‌ను ప్రింటౌంట్ తీసుకోండి.
స్టెప్ 3:- ఫార్మ్‌లోని పూర్తి వివరాలు వెల్లడించండి
స్టెప్ 4:- మీ సమీపంలోని ఎల్పీజీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వద్దకు వెళ్లండి. మీ అప్లికేషన్‌ను సమర్పించండి. సంబంధిత డాక్యుమెంట్లు ఇవ్వాలి.
ఆధార్ కార్డును హెచ్‌పీ గ్యాస్‌తో లింక్ చేయడం ఎలా..
డిస్ట్రిబ్యూటర్ ద్వారా..
Link Aadhaar to HP gas online : స్టెప్ 1:- హెచ్‌పీ గ్యాస్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లండి.
స్టెప్ 2:- సబ్సిడరీ ఫార్మ్‌ను డౌన్లోడ్ చేసుకోండి.
స్టెప్ 3:- ప్రింటౌట్ తీసుకోండి.
స్టెప్ 4:- సంబంధిత వివరాలు ఫార్మ్‌లో రాయండి
స్టెప్ 5:- మీ సమీపంలోని ఎల్పీజీ హెచ్‌పీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయానికి వెళ్లండి. సంబంధిత పత్రాలతో పాటు ఫార్మ్‌ను సబ్మీట్ చేయండి.
స్టెప్ 6:- లేదా.. కార్యాలయంలోని బాక్స్‌లోనూ ఫార్మ్‌ను డ్రాప్ చేయవచ్చు.
ఐవీఆర్ఎస్ పద్ధతిలో..
Link Aadhaar to Bharat gas online : హెచ్‌పీ గ్యాస్ కాల్ సెంటర్‌కు కాల్ చేయండి. ఐవీఆర్ఎస్ ద్వారా ఆధార్ కార్డును లింక్ చేసే ఆప్షన్‌ను ఎంచుకోండి. ఒక్కో జిల్లాకు ఒక్కో ఐవీఆర్ఎస్ నెంబర్ ఉంటుంది. ఇది హెచ్‌పీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది.
భారత్ గ్యాస్‌లో చెప్పిన పద్ధతినే ఉపయోగించి.. హెచ్‌పీ గ్యాస్లోను వెబ్సైట్ ద్వారా ఆధార్ కార్డును లింక్ చేసుకోవచ్చు.