Aadhaar Ration Card Linking : ఆధార్- రేషన్ కార్డు లింక్ చేసుకున్నారా? లాస్ట్ డేట్ ఇదే..!
Aadhaar Ration Card Linking : మీ రేషన్ కార్డును ఆధార్‌తో లింక్ చేశారా? ఇంకా చేయకపోతే.. మీకోసమే ప్రభుత్వం డెడ్‌లైన్‌ను మార్చింది. ఈ నేపథ్యంలో కార్డులను ఎలా లింక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాము..
Aadhaar Ration Card Linking : ఆధార్ కార్డు- రేషన్ కార్డు అనుసంధానానికి డెడ్‌లైన్‌ను ఈ నెల 30 నుంచి 2023 సెప్టెంబర్ 30కి పొడగించింది కేంద్ర ప్రభుత్వం. ఫలితంగా.. ఈ ప్రక్రియను పూర్తి చేయని వారికి అదనంగా సమయం లభించింది. సెప్టెంబర్ 30లోపు రేషన్ కార్డుకు ఆధార్‌ను లింక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత తుది గడువును పొడగిస్తారా? లేదా? అన్న విషయంపై క్లారిటీ లేదు. అందుకే.. తుది గడువు కన్నా ముందే ప్రక్రియను పూర్తి చేయడం మంచిది.
ఎందుకు చేసుకోవాలి..?
వన్ నేషన్ వన్ రేషన్ కార్డు ప్రోగ్రామ్‌లో భాగంగా ఆధార్ కార్డు లింకింగ్ ప్రక్రియను చేపట్టింది కేంద్రం. ఫలితంగా దేశమంతటా ఈ పథకాన్ని సక్రమంగా అమలుచేస్తే.. రేషన్ కార్డు విషయంలో అవతకవకలు జరగకుండా ఉంటుందని కేంద్రం భావిస్తోంది. ఈ ప్రక్రియతో మోసాలను తగ్గించి, అర్హత ఉన్న వారికి రేషన్‌ను అందించవచ్చని కేంద్రం అభిప్రాయపడుతోంది. దేశంలో చాలా మందికి ఒకటి కన్నా ఎక్కువ రేషన్ కార్డులు ఉన్నట్టు గుర్తించిన కేంద్రం.. అనర్హులు లబ్ధిపొందకుండా చూసుకునేందుకే ఈ చర్యలు చేపట్టినట్టు స్పష్టం చేసింది. ఒక్కసారి రేషన్ కార్డుకు ఆధార్ కార్డును లింక్ చేస్తే.. డూప్లికేట్ రేషన్ కార్డును వినియోగించుకోలేరు. ఫలితంగా అక్రమాలు తగ్గే అవకాశం ఉంటుంది.
ఆధార్- రేషన్ కార్డు అనుసంధానం ఎలా చేయాలి?
రేషన్ కార్డుకు ఆధార్‌ను అనుసంధానించేందుకు ఆన్లైన్, ఆఫ్‌లైన్ మోడ్స్ ఉన్నాయి.
ఆన్లైన్లో ఇలా..
స్టెప్ 1:- ముందుగా మీరు యూఐడీఏఐ వెబ్సైట్ uidai.gov.inకి వెళ్లండి.
స్టెప్ 2:- ఇప్పుడు 'స్టార్ట్ నౌ' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3- ఆ తర్వాత జిల్లా, రాష్ట్రం పేరుతో సహా మీ చిరునామాను సమర్పించండి.
స్టెప్ 4:- "రేషన్ కార్డ్ బెనిఫిట్" ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
ఇదీ చూడండి:- Ration card: ఇక వారికి రేషన్ ఇవ్వరు... రేషన్ కార్డు నిబంధనలలో కీలక మార్పు!
How to link Aadhaar with ration card : స్టెప్ 5:- మీ ఆధార్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్, ఈ-మెయిల్ చిరునామా, మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.
స్టెప్ 6:- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
స్టెప్ 7:- ఓటీపీని నమోదు చేసిన తర్వాత, స్క్రీన్‌పై ప్రాసెస్ పూర్తి సందేశం కనిపిస్తుంది.
స్టెప్ 8:- ఇప్పుడు మీ ఆధార్ ధృవీకరణ జరుగుతుంది. మీ రేషన్ కార్డుతో లింక్ అయిపోతుంది.
ఆఫ్‌లైన్‌లో ఇలా..
రేషన్ కార్డ్‌ని ఆధార్‌తో ఆఫ్‌లైన్‌తో లింక్ చేయడానికి, అవసరమైన డాక్యుమెంట్స్‌ను రేషన్ కార్డ్ సెంటర్లో సమర్పించాలి. ఆధార్ కాపీ, రేషన్ కార్డు , పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను ఇచ్చి.. ఆధార్ బయోమెట్రిక్ డేటా వెరిఫికేషన్‌తో రేషన్ కార్డును అనుసంధానం చేసుకోవచ్చు.
సంబంధిత కథనం