తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Budget 2024 Reactions: ‘అది బడ్జెట్ ప్రసంగం కాదు.. కాంగ్రెస్ మేనిఫెస్టో’ - పీ చిదంబరం

Budget 2024 reactions: ‘అది బడ్జెట్ ప్రసంగం కాదు.. కాంగ్రెస్ మేనిఫెస్టో’ - పీ చిదంబరం

HT Telugu Desk HT Telugu

23 July 2024, 13:58 IST

google News
    • Budget 2024: బడ్జెట్ పై కాంగ్రెస్ నేతలు వ్యంగ్య విమర్శలు ప్రారంభించారు. అది బడ్జెట్ కాదని, అది 2024 లోక్ సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ రూపొందించిన మేనిఫెస్టో అని కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం వ్యాఖ్యానించారు. ఈ బడ్జెట్ లో కాంగ్రెస్ మేనిఫెస్టో నుంచే చాలా అంశాలు కాపీ కొట్టారని ఆయన విమర్శించారు.
బడ్జెట్ 2024 పై కాంగ్రెస్ నేతల విమర్శలు
బడ్జెట్ 2024 పై కాంగ్రెస్ నేతల విమర్శలు

బడ్జెట్ 2024 పై కాంగ్రెస్ నేతల విమర్శలు

Budget 2024 reactions: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024 పలువురు సీనియర్ నాయకులు స్పందించారు. కేంద్ర బడ్జెట్ పై కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పించారు. అది 2024 లోక్ సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ రూపొందించిన మేనిఫెస్టో లా ఉందని అని కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ మేనిఫెస్టో చదివారు..

బడ్జెట్ ప్రసంగం పేరుతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ మేనిఫెస్టోను చదివారని కాంగ్రెస్ నేత చిదంబరం విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో నుంచి ఈఎల్ ఐ, అప్రెంటిస్ షిప్ పథకాన్ని కాపీ కొట్టారని ఆరోపించారు. ‘‘ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ మేనిఫెస్టో లోక్ సభ 2024ను గౌరవనీయ ఆర్థిక మంత్రి చదివారని తెలిసి నేను సంతోషిస్తున్నాను. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 30వ పేజీలో పేర్కొన్న ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ELI)ను ఆమె వాస్తవంగా ఆమోదించినందుకు సంతోషంగా ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 11వ పేజీలో పేర్కొన్న ప్రతి అప్రెంటీస్ కు భృతితో పాటు అప్రెంటిస్ షిప్ పథకాన్ని ఆమె ప్రవేశపెట్టడం సంతోషంగా ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని మరికొన్ని ఆలోచనలను ఆర్థిక మంత్రి కాపీ కొట్టి ఉంటే బాగుండేది. మిస్ అయిన వాటిని నేను తరువాత మళ్లీ చెబుతాను’’ అని ఆయన ట్వీట్ చేశారు.

సామాన్యుడి ఆదాయం పెంచే నిర్ణయాలేవీ లేవు

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కేంద్ర బడ్జెట్ 2024ను "నిరాశాజనకంగా" అభివర్ణించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంఎన్ఆర్ఈజీఏ) ప్రస్తావన లేకపోవడం, సామాన్యుడి ఆదాయాన్ని మెరుగుపర్చడానికి తగిన చర్యలు తీసుకోకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఆదాయ అసమానతలను తొలగించే ప్రయత్నాలేవీ చేయలేదన్నారు. ఏంజెల్ ఇన్వెస్టర్లపై పన్నును రద్దు చేసే ఒకే ఒక్క నిబంధనను స్వాగతిస్తున్నాననన్నారు. ఐదేళ్ల క్రితమే ఈ ప్రతిపాదనను అరుణ్ జైట్లీకి సిఫారసు చేశానని శశి థరూర్ గుర్తు చేశారు. న్నారు.

ఇది కుర్సీ బచావో బడ్జెట్

టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ 2024 బడ్జెట్ ను కుర్సీ బచావో బడ్జెట్ గా అభివర్ణించారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చేయాలన్న ప్రజల కలను సాకారం చేసే బడ్జెట్ ఇదని త్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ ప్రశంసించారు. అన్ని వర్గాల ముఖ్యంగా యువత, మహిళల కలల బడ్జెట్ ఇదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలకు రూ.11 లక్షల కోట్లకు పైగా మూలధన వ్యయాన్ని కేటాయించడం భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయని అన్నారు.

తదుపరి వ్యాసం