Stock Market : 6 నెలల్లో ఈ స్టాక్ 235 శాతం పెరిగింది.. ఇన్వెస్టర్లు నెక్ట్స్ ఏం చేయాలి?-this stock has increased by 235 percent in 6 months what should investors do next supreme power equipment share price ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stock Market : 6 నెలల్లో ఈ స్టాక్ 235 శాతం పెరిగింది.. ఇన్వెస్టర్లు నెక్ట్స్ ఏం చేయాలి?

Stock Market : 6 నెలల్లో ఈ స్టాక్ 235 శాతం పెరిగింది.. ఇన్వెస్టర్లు నెక్ట్స్ ఏం చేయాలి?

Anand Sai HT Telugu
Jul 11, 2024 06:30 AM IST

Supreme Power Equipment Share Price : గత ఏడాది సుప్రీమ్ పవర్ ఎక్విప్‌మెంట్ కంపెనీ ఐపీఓకి వచ్చింది. అప్పటి నుంచి ఈ కంపెనీ షేరు ధరలు విపరీతంగా పెరిగాయి. గత 6 నెలల్లో షేరు ధర 235 శాతం పెరిగింది.

సుప్రీమ్ పవర్ ఎక్విప్‌మెంట్
సుప్రీమ్ పవర్ ఎక్విప్‌మెంట్

సుప్రీమ్ పవర్ ఎక్విప్‌మెంట్ షేరు ధర గురించి స్టాక్ మార్కెట్లో ఎక్కువగా చర్చ నడుస్తోంది. ఎక్కువగా మాట్లాడుకునే షేర్ల జాబితాలో ఈ కంపెనీ కూడా ఉంది. గత 6 నెలల్లో కంపెనీ షేరు ధర 235 శాతం పెరిగింది. గత ఏడాది కంపెనీ ఐపీఓ వచ్చింది. స్టాక్ మార్కెట్లో కంపెనీ లిస్టింగ్ 29 డిసెంబర్ 2023న జరిగింది.

గత ఏడాది డిసెంబర్లో ఐపీఓలో సుప్రీమ్ పవర్ ఎక్విప్‌మెంట్ షేరు ధర రూ.102.90 వద్ద లిస్ట్ అయింది. అప్పటి నుంచి కంపెనీ షేరు ధర రూ.320కి చేరింది. జనవరిలో ఈ స్టాక్ 73 శాతం పెరిగింది. అయితే ఫిబ్రవరి, మార్చి నెలల్లో కంపెనీ షేరు ధరలు క్షీణించాయి. గొప్ప రాబడినిచ్చే ఈ స్టాక్ వరుసగా 22 శాతం, 16 శాతం పడిపోయింది.

ఇన్వెస్టర్ల కోణంలో చూస్తే మంచి విషయం ఏమిటంటే ఏప్రిల్‌లో కంపెనీ షేర్లు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ సమయంలో స్టాక్ 51 శాతం రాబడిని ఇచ్చింది. ఈ షేరు ధర మేలో 11 శాతం, జూన్ లో 70 శాతం పెరిగింది.

జూలైలో కొన్ని రోజుల పాటు స్టాక్స్ క్షీణత కనిపించింది. ఈ నెలలో స్టాక్ ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. బుధవారం కంపెనీ షేరు ధర 4 శాతం క్షీణించింది. మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే ఈ స్టాక్ ఈ వారం 14 శాతం పడిపోయింది. ఈ షేరు రూ.300 స్థాయికి చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్లు ప్రస్తుతానికి దీనికి దూరంగా ఉండాలని చెబుతున్నారు.

కంపెనీ ఆర్థిక పరిస్థితి విషయానికొస్తే 2024 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.113.59 కోట్లుగా ఉంది. ఈ కాలంలో ఇబిటా రూ.23.33 కోట్లుగా ఉంది. అదే సమయంలో పన్ను చెల్లింపు అనంతర లాభం రూ.14.30 కోట్లుగా ఉంది. మార్చి నెలలో సుప్రీమ్ పవర్‌కు రూ.12.41 కోట్ల ఆర్డర్ వచ్చింది. అప్పటి వరకు కంపెనీకి రూ.51.35 కోట్ల ఆర్డర్ ఉంది.

గమనిక : ఇది పెట్టుబడి సలహా కాదు. స్టాక్ మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోండి.

Whats_app_banner