Stocks to buy : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 53 పాయింట్లు పడి 79,997 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 22 పాయింట్లు పెరిగి 24,324 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 443 పాయింట్లు నష్టపోయి 52,660 వద్దకు చేరింది.
నిఫ్టీ ఔట్‌లుక్‌పై హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ షెట్టి మాట్లాడుతూ.. గతంలో జూన్ 24న ఇదే తరహా బిల్డ్ జరగడంతో తర్వాతి వారంలో స్థిరమైన కదలిక వచ్చింది. ఇది సానుకూల సంకేతం. నిఫ్టీలో అంతర్లీన ధోరణి సానుకూలంగా కొనసాగుతోంది. వచ్చే కొన్ని సెషన్లలో 24,400 నుంచి 24,500 స్థాయిలకు చేరుకునే అవకాశం ఉంది. నిఫ్టీకి తక్షణ మద్దతు 24,170 స్థాయిలో ఉంది," అన్నారు.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 124.33 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1651.36 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
ఎఫ్ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 6874.66 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. డీఐఐలు రూ. 385.29 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 5 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. డౌ జోన్స్ 0.17శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.54శాతం, నాస్డాక్ 0.9శాతం మేర పెరిగాయి.
జైడస్ వెల్నెస్: రూ.2118.25 వద్ద కొనండి, టార్గెట్ రూ.2222, స్టాప్ లాస్ రూ.2050.
వోల్టాంప్ ట్రాన్స్ఫార్మర్స్: రూ.13219.85 వద్ద కొనండి, టార్గెట్ రూ.13950, స్టాప్ లాస్ రూ.12780.
కోరమాండల్ ఇంటర్నేషనల్: రూ.1580 నుంచి రూ.1592 వరకు కొనండి, టార్గెట్ రూ.1640, స్టాప్ లాస్ రూ.1555.
ఎక్సైడ్ ఇండస్ట్రీస్: రూ.568 వద్ద కొనండి, టార్గెట్ రూ.588, స్టాప్ లాస్ రూ.545
ఐఆర్సీటీసీ: రూ.1020 నుంచి రూ.1030, టార్గెట్ రూ.1070, స్టాప్ లాస్ రూ.970.
సంబంధిత కథనం