తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oppo A3 Pro Launch : ఒప్పో ఏ3 ప్రో లాంచ్​- ఈ మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​ ఇవే..

Oppo A3 Pro launch : ఒప్పో ఏ3 ప్రో లాంచ్​- ఈ మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​ ఇవే..

Sharath Chitturi HT Telugu

14 April 2024, 18:20 IST

    • Oppo A3 Pro price : Oppo A3 Pro launch : ఒప్పో ఏ3 ప్రో లాంచ్​ అయ్యింది. ఈ మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​ని ఇక్కడ చూసేయండి..
ఒప్పో ఏ3 ప్రో లాంచ్.. ఫీచర్స్​, ధర వివరాలివే..
ఒప్పో ఏ3 ప్రో లాంచ్.. ఫీచర్స్​, ధర వివరాలివే.. (Representative image)

ఒప్పో ఏ3 ప్రో లాంచ్.. ఫీచర్స్​, ధర వివరాలివే..

Oppo A3 Pro price : దిగ్గజ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ ఒప్పో.. చైనా మార్కెట్​లో సరికొత్త గ్యాడ్జెట్​ని లాంచ్​ చేసింది. దీని పేరు ఒప్పో ఏ3 ప్రో. ఇప్పటికే మార్కెట్​లో ఒప్పో ఏ2 ప్రోకి సక్సెసర్​గా లాంచ్​ అయ్యింది కొత్త స్మార్ట్​ఫోన్​. ఈ నేపథ్యంలో ఈ కొత్త గ్యాడ్జెట్​ ఫీచర్స్​తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఒప్పో ఏ3 ప్రో ఫీచర్స్​ ఇవే..

ఈ ఒప్పో ఏ3 ప్రో స్మార్ట్​ఫోన్​లో 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.7 ఇంచ్​ అమెలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. ఐపీ69 రేటింగ్​ దీని సొంతం. 360 యాంటీ ఫాల్​ బాడీ ఇందులో ఉంటుంది.

మీడియాటెక్​ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్​తో ఈ ఒప్పో ఏ3 ప్రో పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​, 12జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​, 12జీబీ ర్యామ్​- 512జీబీ స్టోరేజ్​ వేరియంట్లు ఈ కొత్త స్మార్ట్​ఫోన్​లో ఉన్నాయి. ఆండ్రాయిడ్​ 14 ఆధారిత ఒప్పో కలర్​ఓఎస్​ 14 స్కిన్​ సాఫ్ట్​వేర్​పై ఈ మొబైల్​ పనిచేస్తుంది.

Oppo A3 Pro price in India : ఇక ఈ స్మార్ట్​ఫోన్​లో 64ఎంపీతో కూడిన రేర్​ కెమెరా ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 8ఎంపీ ఫ్రెంట్​ కెమెరాను ఇస్తోంది ఒప్పో సంస్థ. ఇందులో 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది.

ఇదీ చూడండి:- OnePlus sales: వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్ సహా ఇతర వన్ ప్లస్ ప్రొడక్ట్స్ అమ్మకాలు నిలిచిపోనున్నాయా?

ఒప్పో ఏ3 ప్రో- ధర ఎంతంటే..

ఇందాక చెప్పినట్టు.. ఒప్పో ఏ3 ప్రోలో 3 వేరియంట్లు ఉన్నాయి. ఒప్పో కొత్త స్మార్ట్​ఫోన్​ ధరలు 2,199 యువాన్​- 2,499 యువాన్​ మధ్యలో ఉన్నాయి. అంటే.. ఇండియాలో సుమారు రూ. 25,810- రూ. 29,400 మధ్యలో అని అర్థం.

Oppo A3 Pro price launch in India : చైనాలో ఈ గ్యాడ్జెట్​.. ఏప్రిల్​ 19న సేల్​లోకి వెళుతుంది. మూడు కలర్​ ఆప్షన్స్​లో ఇది లభిస్తోంది.

ఇక ఈ ఒప్పో ఏ3 ప్రో స్మార్ట్​ఫోన్​ ఇండియా లాంచ్​పై ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు. సంస్థ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా.. త్వరలోనే దీనిపై ఓ అప్డేట్​ బయటకి వచ్చే అవకాశం ఉంది.

ఇంకో విషయం! హెచ్​టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్ ఛానల్స్​లో ఉంది! టెక్నాలజీ ప్రపంచం నుంచి ఎటువంటి అప్డేట్స్​ని మీరు మిస్ కాకుండా ఉండటానికి మమ్మల్ని అక్కడ అనుసరించండి. వాట్సప్ లో హెచ్​టీ తెలుగు ఛానల్​ని అనుసరించండి.

తదుపరి వ్యాసం