Oppo F25 Pro 5G: భారత్ లో ఒప్పో ఎఫ్ 25 ప్రో 5జీ లాంచ్: ధర, ఫీచర్స్, లాంచ్ ఆఫర్లు-oppo f25 pro 5g launched in india price specs launch offers and more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oppo F25 Pro 5g: భారత్ లో ఒప్పో ఎఫ్ 25 ప్రో 5జీ లాంచ్: ధర, ఫీచర్స్, లాంచ్ ఆఫర్లు

Oppo F25 Pro 5G: భారత్ లో ఒప్పో ఎఫ్ 25 ప్రో 5జీ లాంచ్: ధర, ఫీచర్స్, లాంచ్ ఆఫర్లు

HT Telugu Desk HT Telugu
Feb 29, 2024 02:15 PM IST

Oppo F25 Pro 5G launch: చైనా ప్రత్యర్థులకు పోటీగా ఎఫ్25 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ ను ఒప్పొ భారత్ లో లాంచ్ చేసింది. ఈ 5 జీ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధరను రూ.23,999 గా నిర్ణయించింది. ఈ స్మార్ట్ ఫోన్ లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఓఎల్ఈడీ డిస్ ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్ సెట్ వంటి ప్రత్యేకతలున్నాయి.

ఒప్పో ఎఫ్ 25 ప్రో 5 జీ స్మార్ట్ ఫోన్
ఒప్పో ఎఫ్ 25 ప్రో 5 జీ స్మార్ట్ ఫోన్

Oppo F25 Pro 5G launch: కొత్త స్మార్ట్ ఫోన్ లను లాంచ్ చేసే విషయంలో ఇటీవల కాస్త వెనుకబడిన ఒప్పో ఎట్టకేలకు.. లేటెస్ట్ గా ఒప్పో ఎఫ్ 25 ప్రో 5 జీ స్మార్ట్ ఫోన్ ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. రియల్ మీ 12 ప్రో, రెడ్ మీ నోట్ 13 ప్రో వంటి ఇతర చైనా కంపెనీల ప్రత్యర్థులకు తాజా స్మార్ట్ ఫోన్ గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.

ఒప్పో ఎఫ్ 25 ప్రో 5జీ ధర

మనదేశంలో ఒప్పో ఎఫ్25 ప్రో 5జీ (Oppo F25 Pro 5G) 8 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999 కాగా, 8 జీబీ ర్యామ్/256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25,999గా నిర్ణయించారు. మార్చి 5 నుంచి ఫ్లిప్ కార్ట్, అమెజాన్, ఒప్పో స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. ఈ ఒప్పో లేటెస్ట్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ను హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.2,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.

ఒప్పో ఎఫ్25 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు

ఒప్పో ఎఫ్25 ప్రో 5జీ (Oppo F25 Pro 5G) లో 120 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్ తో, 1100 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ డిస్ ప్లే ఉంది. ఈ మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ ఐపి 54 ప్రొటెక్షన్ తో, అలాగే, పాండా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఒప్పో ఎఫ్ 25 ప్రో 5 జీ స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్ సెట్ ను అమర్చారు. అలాగే, అన్ని గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ కార్యకలాపాల కోసం మాలి-జి 68 ఎంసి 4 జిపియు ను కూడా పొందుపర్చారు. 8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్ 4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.

ఒప్పో ఎఫ్25 ప్రో 5జీ కెమెరా

ఆప్టిక్స్ పరంగా చూస్తే, ఈ (Oppo F25 Pro 5G) స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ తో ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్ లకు సంబంధించిన అన్ని అవసరాలను తీర్చడానికి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ కూడా ఉంది. పోర్ట్రెయిట్ మోడ్, నైట్ మోడ్, ఎక్స్ట్రా హెచ్డీ మోడ్, పానో, స్లో మోషన్, టైమ్-ల్యాప్స్, డ్యూయల్ వ్యూ వీడియో, స్టిక్కర్, టెక్స్ట్ స్కానర్, గూగుల్ లెన్స్ వంటి అనేక కెమెరా మోడ్ లకు ఈ కెమెరా యాప్ సపోర్ట్ చేస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ స్మార్ట్ ఫోన్ వెనుక కెమెరా, అలాగే, ముందు కెమెరాల నుండి 30 ఎఫ్పిఎస్ వద్ద 4కె వీడియోలను రికార్డ్ చేయగలదు.