తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus Pad Pro : సూపర్​ ఫీచర్స్​తో వన్​ప్లస్​ ప్యాడ్​ ప్రో.. లాంచ్​ ఎప్పుడు?

OnePlus Pad Pro : సూపర్​ ఫీచర్స్​తో వన్​ప్లస్​ ప్యాడ్​ ప్రో.. లాంచ్​ ఎప్పుడు?

Sharath Chitturi HT Telugu

17 June 2024, 15:43 IST

google News
  • Oneplus pad pro : వన్​ప్లస్​ ప్యాడ్​ ప్రో లాంచ్​కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఫీచర్స్​ ఇప్పటికే లీక్​ అయ్యాయి. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి.

వన్​ప్లస్​ ప్యాడ్​ ప్రో..
వన్​ప్లస్​ ప్యాడ్​ ప్రో..

వన్​ప్లస్​ ప్యాడ్​ ప్రో..

Oneplus pad pro : వన్​ప్లస్​.. తన మొదటి టాబ్లెట్​ని గత ఏడాది ఏప్రిల్లో లాంచ్ చేసింది. ఇక ఇప్పుడు.. మరో కొత్త ట్యాబ్లపెట్​ని వచ్చే నెలలో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు రూమర్స్​ వస్తున్నాయి. వన్​ప్లస్​ ప్యాడ్ 2 వచ్చే ఏడాది వరకు ఆలస్యమవుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ ఒప్పో సబ్ బ్రాండ్.. వన్​ప్లస్​ ప్యాడ్ ప్రోగా పిలిచే శక్తివంతమైన టాబ్లెట్​ని ప్రవేశపెట్టాలని చూస్తోంది.

కంపెనీ నుంచి అధికారిక ప్రకటనకు ముందు, చైనీస్ ఐటిహోమ్ నుంచి వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. వన్​ప్లస్​ నుంచి కొన్ని కీలక టాబ్లెట్ యాక్సెసరీలు కీబోర్డ్, స్టైలస్​తో సహా ఎఫ్​సీసీ సర్టిఫికేషన్ పొందాయి.

రాబోయే కీబోర్డ్ మోడల్ నంబర్ ఓపీకే2402 కలిగి ఉంటుందని, దీనిని టిన్​లాంగ్ మొబైల్ తయారు చేస్తుందని నివేదిక వెల్లడించింది. ఇందులో ఆరు వరుసల కీ లేఅవుట్, పెద్ద టచ్ ప్యాడ్, ఎన్​ఎఫ్​సీ చిప్ ఉంటాయి. స్టైలస్ ఎఫ్​పీసీ బ్లూటూత్ యాంటీనాతో వస్తుందని, అంటే ఇది టాబ్లెట్​కు వైయర్​లెస్​గా కనెక్ట్ అవుతుందని అంటున్నారు.

యాక్ససరీలతో పాటు, వన్​ప్లస్​ ప్యాడ్ ప్రో గురించి దాని డిస్​ప్లే, చిప్సెట్, బ్యాటరీతో సహా అనేక కీలక స్పెసిఫికేషన్లను కూడా మరో లీక్ వెల్లడించింది.

వన్ ప్లస్ ప్యాడ్ ప్రో స్పెసిఫికేషన్లు (అంచనా):

Oneplus pad pro launch date in India : టిప్​స్టర్ టెక్​ఇన్ఫోసోషల్స్​ పెట్టిన పోస్ట్​ ప్రకారం.. వన్​ప్లస్ ప్యాడ్ ప్రో 900 నిట్స్ గరిష్ట బ్రైట్​నెస్, 3000 x 2120 పిక్సెల్స్ రిజల్యూషన్​తో 12.1 ఇంచ్​ 3కే ఎల్​సీడీ డిస్​ప్లేను కలిగి ఉండవచ్చు.

స్నాప్​డ్రాగన్​ 8 జెన్ 3 చిప్​సెట్​తో పనిచేసే ఈ టాబ్లెట్​లో 16 జీబీ వరకు ఎల్​పీడీడీఆర్​5ఎక్స్​ ర్యామ్, 512 జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ ఉండే అవకాశం ఉంది.

రాబోయే వన్​ప్లస్​ టాబ్లెట్ 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరాను కలిగి ఉంటుందని చెబుతున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ షూటర్ కూడా ఇందులో ఉండనుంది. వన్​ప్లస్​ ప్యాడ్ ప్రోలో 9510 ఎంఏహెచ్ బ్యాటరీ, 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండవచ్చు. కనెక్టివిటీ విషయానికొస్తే, ఈ టాబ్లెట్ బ్లూటూత్ 5.4, వైఫై 7, ఎన్ఎఫ్సి సపోర్ట్​ వస్తుందని తెలుస్తోంది. వన్​ప్లస్​ ప్యాడ్ ప్రో బిల్ట్-ఇన్ లీనియర్ మోటారుతో స్టైలస్ సపోర్ట్​తో వచ్చే అవకాశం ఉంది.

ఈ మోడల్​ లాంచ్​ డేట్​పై క్లారిటీ రావాల్సి ఉంది.

తదుపరి వ్యాసం