Vivo X Fold 3 Pro vs OnePlus Open: ఈ రూ.1 లక్ష విలువ చేసే ఫోల్డెబుల్ స్మార్ట్‌ఫోన్స్‌లో ఏది బెస్ట్?
10 June 2024, 15:20 IST
Vivo X Fold 3 Pro : వీవో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో వర్సెస్ వన్‌ప్లస్ ఓపెన్. ఈ రెండిట్లో ఏ ఫోల్డెబుల్ స్మార్ట్‌ఫోన్ కొంటే బెటర్? ఇక్కడ తెలుసుకోండి..
వీవో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో వర్సెస్ వన్‌ప్లస్ ఓపెన్
Vivo X Fold 3 Pro price in India : వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో గత వారం భారత ఫోల్డెబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అరంగేట్రం చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ థిన్ డిజైన్ని కలిగి ఉండటమే కాకుండా, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ సపోర్ట్ చేసే భారతదేశపు తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో.. ఈ గ్యాడ్జెట్‌ని.. వన్‌ప్లస్ ఓపెన్‌తో పోల్చి, ఈ రెండింట్లో ఏది బెస్ట్? ఏది కొనొచ్చు? అనేది ఇక్కడ తెలుసుకుందాము..
వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో వర్సెస్ వన్‌ప్లస్ ఓపెన్..
డిజైన్: వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రోని ఫోల్డ్ చేసినప్పుడు 11.2 ఎంఎం, తెరిచినప్పుడు 5.2 ఎంఎం మాత్రమే ఉంటుంది. కేవలం 236 గ్రాముల బరువుండే ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆర్మర్ ఆర్కిటెక్చర్‌తో రూపొందించారు. మరోవైపు, వన్‌ప్లస్ ఓపెన్ బరువు 239 గ్రాములు. టైటానియం అల్లాయ్, కార్బన్ ఫైబర్ హింజ్‌తో రూపొందించిన ఈ స్మార్ట్‌ఫోన్ తేలికైన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌గా ఉంటుంది.
Vivo X Fold 3 Pro features : డిస్ప్లే: వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రోలో 6.53 ఇంచ్ కవర్ డిస్ప్లే, 8.03 ఇంచ్ మెయిన్ ఫోల్డెబుల్ డిస్ప్లే, అమోఎల్ఈడీ, ఎల్టీపీఓ 8 టెక్నాలజీ ఉన్నాయి. ఈ రెండు డిస్ప్లేలు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 హెర్ట్జ్ లోకల్ పీక్ బ్రైట్‌నెస్‌ని సపోర్ట్ చేస్తాయి.
వన్‌ప్లస్ ఓపెన్‌లో 6.31 ఇంచ్ కవర్ డిస్ప్లే, 7.82 ఇంచ్ మెయిన్ డిస్ప్లే ఉన్నాయి. రెండు డిస్ప్లేలు ఎల్టీపీఓ 3.0 డిస్ప్లే టెక్నాలజీతో సూపర్ ఫ్లూయిడ్ అమోలెడ్ని సపోర్ట్ చేస్తాయి. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ని సపోర్ట్ చేస్తాయి.
కెమెరా: హై క్వాలిటీ ఫోటోగ్రఫీ కోసం, వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో ట్రిపుల్ కెమెరా సెటప్‌ని కలిగి ఉంది. ఇందులో ఓఐఎస్తో 50 మెగాపిక్సెల్ వీసీఎస్ ప్రధాన కెమెరా ఉంది. 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ఏఎఫ్ కెమెరా, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 64 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా వంటివి ఉంటాయి.
OnePlus Open price in India : వన్‌ప్లస్ ఓపెన్ కోసం ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 40 మెగాపిక్సెల్ సోనీ ఎల్వైటి-టీ808 ప్రధాన కెమెరా, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 64 మెగాపిక్సెల్ ఓమ్నివిజన్ ఓవీ 64 బీ కెమెరా, 48 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 581 అల్ట్రా-వైడ్ కెమెరాతో వస్తుంది.
పర్ఫార్మెన్స్: మల్టీటాస్కింగ్ సామర్థ్యాల కోసం, వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో స్నాప్‌డ్రాగన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. వన్‌ప్లస్ ఓపెన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ ఉంది. ఈ రెండు డివైజ్‌లు 16 జీబీ ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను సపోర్ట్ చేస్తాయి.
OnePlus Open features : బ్యాటరీ: వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో 100 వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5700 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. మరోవైపు, వన్‌ప్లస్ ఓపెన్‌లో 4805 ఎంఏహెచ్ బ్యాటరీ, 67వాట్ల సూపర్ వూక్ ఛార్జింగ్ ఉన్నాయి.
ధర : వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో ధర రూ.159999, వన్‌ప్లస్ ఓపెన్ ప్రారంభ ధర రూ.139999.