తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus Nord Ce 4 : సూపర్​ ఫీచర్స్​తో వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 4.. ఇంకొన్ని రోజుల్లో లాంచ్​!

OnePlus Nord CE 4 : సూపర్​ ఫీచర్స్​తో వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 4.. ఇంకొన్ని రోజుల్లో లాంచ్​!

Sharath Chitturi HT Telugu

25 March 2024, 15:30 IST

  • OnePlus Nord CE 4 : సూపర్​ ఫీచర్స్​తో వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 4.. ఇంకొన్ని రోజుల్లో లాంచ్​కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్​ఫోన్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 4.. వచ్చేస్తోంది! ధర ఎంతంటే..
వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 4.. వచ్చేస్తోంది! ధర ఎంతంటే.. (OnePlus)

వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 4.. వచ్చేస్తోంది! ధర ఎంతంటే..

OnePlus Nord CE 4 expected price : మోస్ట్ అవైటెడ్ మిడ్ రేంజ్ స్మార్ట్​ఫోన్లలో ఒకటైన వన్​ప్లస్ నార్డ్ సీఈ 4 లాంచ్ డేట్ దగ్గరపడుతోంది. అదే సమయంలో.. ఈ గ్యాడ్జెట్​పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఏప్రిల్ 1న ఈ స్మార్ట్​ఫోన్​ని గ్రాండ్​గా లాంచ్​ చేసేందుకు సంస్థ ఏర్పాట్లు చేసుకుంటోంది.కాగా నార్డ్ సీఈ3 లైట్​తో పోలిస్తే ఈ సరికొత్త వెర్షన్​లో ఆకర్షణీయమైన అప్​గ్రేడ్​లు, మార్పులు కనిపించొచ్చు. అంతరాయం లేని మొబైల్ బ్రౌజింగ్ అనుభవాన్ని అందించే ట్రెడీషన్​ని కొనసాగిస్తూ.. సీఈ 4 మార్కెట్లో ప్రకంపనలు సృష్టించడానికి సిద్ధంగా ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Stock Market News: శనివారమైనా రేపు స్టాక్ మార్కెట్ పని చేస్తుంది.. కారణం ఏంటంటే..?

Personal loan for business : వ్యాపారం కోసం పర్సనల్​ లోన్​ తీసుకుంటున్నాారా? తప్పు చేసినట్టే!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. ఈ రూ. 390 స్టాక్​ని ట్రాక్​ చేయండి- భారీ లాభాలు!

Mahindra XUV 3XO : గంటలో 50వేల బుకింగ్స్​.. ఇదీ మహీంగ్స్​ ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ క్రేజ్​!

వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 4..

గ్యాడ్జెట్స్ 360 నివేదిక ప్రకారం.. రాబోయే వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 4 స్మార్ట్​ఫోన్​లో రెండు ఆకర్షణీయమైన కొత్త కలర్ వేరియంట్లు ఉంటాయి. అవి.. డార్క్ క్రోమ్, సెలాడన్ మార్బుల్. రెండొవది, రిఫ్రెషింగ్ మింట్​ ఆకుపచ్చ రంగును కలిగి ఉంటుంది. దీనికి లగ్జరీ మార్బుల్​ తరహా ఫినిషింగ్ వస్తోంది​. ఇవి కొత్త స్మార్ట్​ఫోన్​కి మరింత అట్రాక్షన్​ని ఇచ్చే విధంగా ఉన్నాయి.

OnePlus Nord CE 4 price in India : వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 4లో 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్, 93.4 శాతం స్క్రీన్ టు బాడీ రేషియోతో 6.7 ఇంచ్​ ఫ్లూయిడ్ అమోలెడ్​ ప్యానెల్ ఉండనుంది. పవర్​ఫుల్​ స్నాప్​డ్రాగన్ 7 జెన్ 3 చిప్​సెట్​తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఇది స్మూత్ పెర్ఫార్మెన్స్​ను నిర్ధరిస్తుంది. 8 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, అదనంగా 8 జీబీ వర్చువల్ ర్యామ్ వంటి మెమరీ ఆప్షన్లను యూజర్లు పొందవచ్చు. వన్​ప్లస్​ సీఈ 4 మైక్రో ఎస్​డీ కార్డ్ స్లాట్ కూడా ఉంది. దీని ద్వారా 1 టీబీ వరకు ఎక్స్​ప్యాండెబుల్​ స్టోరేజ్​ని అందిస్తుంది. ఇది వినియోగదారుల్లో పెరుగుతున్న మల్టీమీడియా అవసరాలను తీరుస్తుంది.

వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 4 ధర ఎంతంటే..

OnePlus Nord CE 4 launch date in India : ఇక ధర విషయానికొస్తే.. వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 4 మోడల్ ధర సుమారు రూ .25,000 ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇదే నిజమైతే.. మిడ్​- రేంజ్​ సెగ్మెంట్​లో ఈ గ్యాడ్జెట్​ మరింత పోటీని పెంచేస్తుంది!

బ్యాటరీ సామర్థ్యం విషయానికి వస్తే, ఈ స్మార్ట్​ఫోన్​లో.. 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో పాటు 100 వాట్ల సూపర్వీఓఓకే ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని సమాచారం. ఆక్సిజన్ ఓఎస్ 14 ఆధారిత లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టెంపై పనిచేసే ఈ ఫోన్ వేగవంతమైన, సమర్థవంతమైన పనితీరును అందించనుంది. ఛార్జింగ్ సామర్థ్యం ప్రత్యేకత ఏమిటంటే.. కేవలం 29 నిమిషాల్లో పరికరాన్ని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు!

కెమెరా స్పెసిఫికేషన్లపై వివరాలపై ఇంకా క్లారిటీ లేదు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 16 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెన్సార్​తో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా ఉంటుందని టాక్​ నడుస్తోంది.

ప్రస్తుతం వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 4పై ఈ సమాచారమే ఉంది. లాంచ్​ సమయానికి పూర్తి వివరాలపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం