OnePlus Nord CE 3 Lite: వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో..-big savings alert oneplus nord ce 3 lite 5g gets a price cut on amazon ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus Nord Ce 3 Lite: వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో..

OnePlus Nord CE 3 Lite: వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో..

HT Telugu Desk HT Telugu
Mar 09, 2024 07:32 PM IST

OnePlus Nord CE 3 Lite: వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. ఆమెజాన్ లో ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు కేవలం రూ .17,999 లకు లభిస్తుంది.

వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్
వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ (OnePlus)

OnePlus Nord CE 3 Lite: వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో డిస్కౌంట్ ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒరిజినల్ ధర రూ.19,999 కాగా, ఇప్పుడు 10% తగ్గింపుతో రూ.17,999 లకు అందుబాటులో ఉంది. ధర తగ్గింపుతో పాటు అదనంగా అమెజాన్ లో పలు ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కొనుగోలుదారులు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ తో అదనపు వడ్డీ ఛార్జీలు లేకుండా ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. జీఎస్టీ ఇన్వాయిస్ తో అయితే, 28% వరకు ఆదా చేసే అవకాశాన్ని ఆమెజాన్ అందిస్తోంది. అంతేకాకుండా, ఈ ఫోన్ కు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. మీ పాత వర్కింగ్ కండిషన్ లో ఉన్న ఫోన్ ను ఎక్స్చేంజ్ చేస్తే, రూ.16,700 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

వన్ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ స్పెసిఫికేషన్స్

వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ (OnePlus Nord CE 3 Lite 5G) లో 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ అసిస్ట్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్న ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. అలాగే, ముందువైపు అద్భుతమైన సెల్ఫ్ పోర్ట్రెయిట్స్ కోసం 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ (OnePlus Nord CE 3 Lite 5G) లో 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ తో 6.72 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 13.1 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ పై పనిచేసే ఈ డివైస్ స్మూత్ పెర్ఫార్మెన్స్, సీమ్ లెస్ మల్టీ టాస్కింగ్ అందిస్తుంది. ఇందులో 67వాట్ సూపర్ వూక్ ఎండ్యూరెన్స్ ఎడిషన్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

Whats_app_banner