OnePlus Nord CE 3 Lite 5G Sale: వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ మొబైల్ ఫస్ట్ సేల్ నేడే.. బడ్స్ ఉచితం: ధర, ఆఫర్లు ఇవే
OnePlus Nord CE 3 Lite 5G First Sale: వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ నేడు సేల్‍కు రానుంది. తొలి రోజున కొన్ని ఆఫర్లు ఉన్నాయి. వన్‍ప్లస్ నార్డ్ బడ్స్ సీఈని ఉచితంగా పొందవచ్చు.
OnePlus Nord CE 3 Lite 5G First Sale: వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్ ఫస్ట్ సేల్ నేడు (ఏప్రిల్ 11) షురూ కానుంది. నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఈ మొబైల్ తొలిసారి సేల్‍కు రానుంది. ఫస్ట్ సేల్ సందర్భంగా టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ ఉచితంగా దక్కించుకునే ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ఒక్క రోజే ఈ అవకాశం ఉంటుందని వన్‍ప్లస్ పేర్కొంది. రూ.20వేలలోపు ధరతోనే ఈ వన్‍ప్లస్ నయా మొబైల్ ఉంది. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. OnePlus Nord CE 3 Lite 5G ధర, ఆఫర్లు, సేల్, స్పెసిఫికేషన్ల వివరాలను ఇక్కడ చూడండి.
వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ధర, సేల్
OnePlus Nord CE 3 Lite 5G Price, Variants: వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వస్తోంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఉండే బేస్ వేరియంట్ ధర రూ.19,999, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ఉండే టాప్ మోడల్ రేటు రూ.21,999గా ఉంది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్ (Amazon), వన్‍ప్లస్ అధికారిక వెబ్‍సైట్ (oneplus.in), వన్‍ప్లస్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్లలో నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఈ మొబైల్ సేల్ మొదలవుతుంది. పాస్టెల్ లైమ్, క్రొమాటిగ్ గ్రే కలర్ ఆప్షన్‍లో ఈ OnePlus Nord CE 3 Lite 5G మొబైల్ అందుబాటులోకి వస్తుంది.
OnePlus Nord CE 3 Lite 5G: ఆఫర్లు
వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ఫోన్‍ను కొనుగోలు చేస్తే వన్‍ప్లస్ నార్డ్ బడ్స్ సీఈ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌ను ఉచితంగా దక్కించుకోవచ్చు. ఈ ఆఫర్ నేడు (ఏప్రిల్ 11) మాత్రమే, స్టాక్ ఉన్నంత వరకు ఉంటుందని వన్‍ప్లస్ వెల్లడించింది.
వన్‍ప్లస్ నార్డ్ సీఈ లైట్ 5జీ మొబైల్‍ను ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,000 తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. అంటే బేస్ వేరియంట్‍ను రూ.18,999కే సొంతం చేసుకోవచ్చు.
రూ.99కే సంవత్సరం అదనపు వారెంటీని పొందవచ్చు.
ఆరు నెలల స్పాటిఫై ప్రీమియమ్ సబ్‍స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ స్పెసిఫికేషన్లు
- OnePlus Nord CE 3 Lite 5G: 6.72 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ ఎల్‍సీడీ డిస్‍ప్లేతో వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ మొబైల్ వచ్చింది. 120హెర్జ్ట్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది.
- స్నాప్‍డ్రాగన్ 695 ప్రాసెసర్ ఈ వన్‍ప్లస్ బడ్జెట్ 5జీ మొబైల్‍లో ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13.1తో అడుగుపెడుతోంది.
- వెనుక మూడు కెమెరాల సెటప్‍తో వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ వచ్చింది. 108 మెగాపిక్సెల్ (MP) ప్రైమరీ కెమెరా, 2 MP మాక్రో షూటర్, 2 MP డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్ వచ్చింది.
- వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ మొబైల్‍లో 5,000mAh బ్యాటరీ ఉండగా.. 67 వాట్ల సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. డ్యుయల్ స్టీరియో స్పీకర్లను ఈ ఫోన్ కలిగి ఉంది.
సంబంధిత కథనం