OnePlus Nord CE 3 Lite 5G: బడ్జెట్ రేంజ్‍లో వన్‍ప్లస్ కొత్త 5జీ మొబైల్ వచ్చేసింది: ధర, స్పెసిఫికేషన్‍ల వివరాలివే..-oneplus nord ce 3 lite 5g price in india revealed in india after official launch check specifications features ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus Nord Ce 3 Lite 5g: బడ్జెట్ రేంజ్‍లో వన్‍ప్లస్ కొత్త 5జీ మొబైల్ వచ్చేసింది: ధర, స్పెసిఫికేషన్‍ల వివరాలివే..

OnePlus Nord CE 3 Lite 5G: బడ్జెట్ రేంజ్‍లో వన్‍ప్లస్ కొత్త 5జీ మొబైల్ వచ్చేసింది: ధర, స్పెసిఫికేషన్‍ల వివరాలివే..

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 04, 2023 08:03 PM IST

OnePlus Nord CE 3 Lite 5G: వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ఇండియాలో లాంచ్ అయింది. రూ.20వేలలోపు ధరలోనే అడుగుపెట్టింది. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను ఈ ఫోన్ కలిగి ఉంది.

OnePlus Nord CE 3 Lite 5G: బడ్జెట్ రేంజ్‍లో వన్‍ప్లస్ 5జీ మొబైల్ వచ్చేసింది (Photo: OnePlus)
OnePlus Nord CE 3 Lite 5G: బడ్జెట్ రేంజ్‍లో వన్‍ప్లస్ 5జీ మొబైల్ వచ్చేసింది (Photo: OnePlus)

OnePlus Nord CE 3 Lite 5G launched: వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్‍లో ఈ వన్‍ప్లస్ నయా స్మార్ట్ ఫోన్ మంగళవారం విడుదలైంది. ఫుల్ హెచ్‍డీ+ ఎల్‍సీడీ డిస్‍ప్లే, డ్యుయల్ స్టీరియో స్పీకర్లను ఈ మొబైల్ కలిగి ఉంది. 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. నార్డ్ సీఈ 2 లైట్ 5జీకి సక్సెసర్‌గా ఈ వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ అడుగుపెట్టింది. బడ్జెట్ రేంజ్‍లోనే లాంచ్ అయింది. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో ఈ ఫోన్ వచ్చింది. OnePlus Nord CE 3 Lite 5G ధర, సేల్, పూర్తి స్పెసిఫికేషన్లను ఇక్కడ తెలుసుకోండి.

OnePlus Nord CE 3 Lite 5G: డిస్‍ప్లే

6.72 ఇంచుల Full HD+ LCD డిస్‍ప్లేతో వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ వచ్చింది. 120 హెర్ట్జ్ (Hz) డైనమిక్ రిఫ్రెష్ రేట్, 680 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్ ఉంటాయి. ఈ డిస్‍ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉంటుంది.

OnePlus Nord CE 3 Lite 5G: ప్రాసెసర్, ఓఎస్

వన్‍ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ ఫోన్‍లో స్నాప్‍డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 (Android 13) ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 13.1తో లాంచ్ అయింది. 8జీబీ వరకు LPDDR4X ర్యామ్‍తో వస్తోంది. ఇంటర్నల్ స్టోరేజీని ఉపయోగించుకొని వర్చువల్‍గా ర్యామ్‍ను పొడిగించుకునే ఫీచర్ కూడా ఉంటుంది.

108 మెగాపిక్సెల్ కెమెరాతో..

OnePlus Nord CE 3 Lite 5G: వెనుక మూడు కెమెరాల సెటప్‍తో వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ఫోన్ వచ్చింది. 108 మెగాపిక్సెల్ సామ్‍సంగ్ HM6 ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఈ ఫోన్‍కు ఇచ్చింది వన్‍ప్లస్.

OnePlus Nord CE 3 Lite 5G: స్టీరియో స్పీకర్లు

5జీ, 4జీ ఎల్‍టీఈ, వైఫై, 3.5mm హెడ్‍ఫోన్ జాక్, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‍బీ టైప్-సీ పోర్టు కనెక్టివిటీ ఫీచర్లతో వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ వచ్చింది. డ్యుయల్ స్టీరియో స్పీకర్లు ఈ ఫోన్‍కు ఉన్నాయి.

బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

OnePlus Nord CE 3 Lite 5G: వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ మొబైల్‍లో 5,000mAh బ్యాటరీ ఉంది. 67 వాట్ల SuperVOOC ఫాస్ట్ చార్జింగ్‍కు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 0 నుంచి 80 శాతం చార్జ్ 30 నిమిషాల్లోనే అవుతుందని వన్‍ప్లస్ పేర్కొంది. ఈ మొబైల్ మొత్తంగా 195 గ్రాముల బరువు ఉంటుంది.

వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ధర, సేల్

OnePlus Nord CE 3 Lite 5G Price: వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ రెండు వేరియంట్లలో విడుదలైంది.

8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: రూ.19,999

8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: రూ.21,999

పాస్టెల్ లైమ్, క్రోమాటిక్ గ్రే కలర్ ఆప్షన్‍లలో వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ అందుబాటులోకి వచ్చింది. ఈ కామర్స్ సైట్ అమెజాన్ (Amazon), వన్‍ప్లస్ అధికారిక వెబ్‍సైట్, వన్‍ప్లస్ స్టోర్లలో ఏప్రిల్ 11వ తేదీన ఈ మొబైల్ సేల్‍కు వస్తుంది.

OnePlus Nord CE 3 lite 5G Offer: తొలి సేల్‍లో వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ఫోన్‍ను ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ.1000 డిస్కౌంట్ పొందవచ్చు. అంటే బేస్ వేరియంట్‍ను రూ.18,999కే సొంతం చేసుకోవచ్చు.

Whats_app_banner