Ola S1 electric scooter : 'ఎస్1' స్కూటర్‌కు గుడ్ బై చెప్పిన ఓలా ఎలక్ట్రిక్!
29 July 2023, 13:10 IST
- Ola S1 electric scooter : ఎస్1 ఎయిర్ డెలివరీల కోసం సన్నద్ధవుతున్న ఓలా ఎలక్ట్రిక్.. తన పోర్ట్‌ఫోలియోలోని పాత మోడల్‌ను డిస్కంటిన్యూ చేసింది. ఇకపై ఓలా ఎస్1 కనిపించదు. పూర్తి వివరాలు..
'ఎస్1' స్కూటర్‌ను డిస్కంటిన్యూ చేసిన ఓలా ఎలక్ట్రిక్!
Ola S1 electric scooter : ఎస్1 ఎయిర్ ఎంట్రీతో ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్‌కు గుడ్ బై చెప్పేసింది ఓలా ఎలక్ట్రిక్ సంస్థ. ఫలితంగా.. ఇప్పుడు ఈ సంస్థ పోర్ట్‌ఫోలియోలో ఎస్1 ఎయిర్, ఎస్1 ప్రో మోడల్స్ మాత్రమే ఉంటాయి.
ఎస్1 ఎయిర్ కోసం వెయిటింగ్..!
ఓల్ ఎస్1 ఎయిర్ పర్చేజ్ విండో.. ఎస్1 కమ్యూనిటీకి అందుబాటులో తీసుకొచ్చింది ఈ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ. ఈ కొత్త ఈ-స్కూటర్లో 3కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 5 గంటల్లో ఇది ఫుల్ ఛార్జ్ అవుతుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 125కి.మీల దూరం వరకు ప్రయాణిస్తుందని సంస్థ చెబుతోంది. ఇందులోని హబ్ మోటార్.. 4.5కేడ్ల్యూ పవర్‌ను జనరేట్ చేస్తుంది. 0-40 కేఎంపీహెచ్ స్పీడ్‌ను 3.3 సెకన్లలో అందుకోగలదు ఈ వాహనం. 0-60కేఎంపీహెచ్‌కు 5.7 సెకన్ల సమయం పడుతుంది. ఈ మోడల్ టాప్ స్పీడ్ 90కేఎంపీహెచ్. ఈకో, నార్మల్, స్పోర్ట్స్ వంటి రైడింగ్ మోడ్స్ ఇందులో ఉన్నాయి.
Ola S1 discontinued : ఇక ఫీచర్స్ విషయానికొస్తే.. ఇందులో క్రూజ్ కంట్రోల్, టచ్‌స్క్రీన్ క్లస్టర్ వంటివి వస్తున్నాయి. ప్రాక్సిమిటీ అన్‌లాక్, కాల్ అలర్ట్స్, పార్టీ మోడ్, నావిగేషన్, వెకేషన్ మోడ్, డిజిటల్ కీ, డాక్యుమెంట్ స్టోరేజ్ వంటివి లభిస్తున్నాయి.
ఇదీ చూడండి:- Ather 450X: ఇండియన్ మార్కెట్లో మరో ఎలక్ట్రిక్ స్కూటర్; ట్రెండీ లుక్స్ తో అదరగొడ్తోంది..
ఈ ఓలా ఎస్1 ఎయిర్‌లోని ఫ్రెంట్, రేర్ వీల్స్‌కు డ్రమ్ బ్రేక్స్ లభిస్తున్నాయి. సస్పెన్షన్ కోసం ఫ్రెంట్లో టెలిస్కోపిక్ ఫోర్క్స్, రేర్‌లో డ్యూయెల్ షాక్ అబ్సార్బర్స్ వంటివి ఉంటాయి. ఇప్పటి వరకు ఉన్న స్టీల్ వీల్స్ స్థానంలో అలాయ్ వీల్స్ వస్తుండటం హైలైట్. 7 ఇంచ్ స్క్రీన్ దీని సొంతం.
Ola S1 Air : మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ఎక్స్‌షోరూం ధర రూ. 85,099- రూ. 1.1లక్షల మధ్యలో ఉంటుంది. దీనిని డిస్కంటిన్యూ చేస్తుండటంతో.. ఎస్1 ఎయిర్‌పై ఫోకస్ పెరిగింది. దీని ధర ఎంత? ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. కాగా.. దీనిపై సంస్థ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
31న పర్చేజ్ విండో ఓపెన్..
పాత కస్టమర్ల కోసం ఇప్పటికే ఓలా ఎస్1 ఎయిర్ పర్జేచ్ విండో ఓపెన్ అయ్యింది. ఇక ప్రజల కోసం ఈ నెల 31న ఓపెన్ అవుతుంది. ఈ మోడల్ ధరతో పాటు డెలివరీలు ఎప్పుడు మొదలవుతాయి? వంటి ప్రశ్నలపై సంస్థ స్పందించాల్సి ఉంది.
ఓలా నుంచి ఎలక్ట్రిక్ బైక్..!
Ola electric bike range : ఎలక్ట్రిక్ బైక్స్‌పై కూడా ఓలా సంస్థ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ కొత్త మోడల్.. ఆగస్టు 15న లాంచ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. బైక్ లాంచ్‌పైనే కాకుండా.. దాని రేంజ్పైనా సంస్థ అధిక దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న వార్తలు నిజమైతే.. ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 300-315 కి.మీల దూరం ప్రయాణిస్తుంది! కచ్చితంగా ఇది భారతీయులను ఆకర్షించే విషయమే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.