Ola S1 Air : ఓలా ఎస్​1 ఎయిర్​లో క్రేజీ ఫీచర్స్​..!-planning to buy ola s1 air key features you should know ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ola S1 Air : ఓలా ఎస్​1 ఎయిర్​లో క్రేజీ ఫీచర్స్​..!

Ola S1 Air : ఓలా ఎస్​1 ఎయిర్​లో క్రేజీ ఫీచర్స్​..!

Sharath Chitturi HT Telugu
Jul 24, 2023 01:58 PM IST

Ola S1 Air : ఓలా ఎస్​1 ఎయిర్​ ఇప్పుడు ఒక హాట్​ టాపిక్​. ఈ నేపథ్యంలో ఈ స్కూటర్​ ఫీచర్స్​ వివరాలపై ఓ లుక్కేద్దాము..

ఓలా ఎస్​1 ఎయిర్​లో క్రేజీ ఫీచర్స్​..!
ఓలా ఎస్​1 ఎయిర్​లో క్రేజీ ఫీచర్స్​..!

Ola S1 Air : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో ఎలక్ట్రిక్​ స్కూటర్లతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది ఓలా ఎలక్ట్రిక్​ సంస్థ. ఇక ఇప్పుడు ఈ సంస్థ నుంచి ఓలా ఎస్​1 ఎయిర్​ లాంచ్​కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ-సూటర్​ ఫీచర్స్​తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఫీచర్స్​.. మామూలుగా లేవుగా!

ఇండియాలో అతి చౌకైనా ఈవీగా ఈ ఎస్​1 ఎయిర్​ నిలుస్తుంది. సంస్థ లైనప్​లోని ఎస్​1, ఎస్​1 ప్రో సరసన ఈ కొత్త మోడల్​ ఉంటుంది. ఇందులో 3 కేడబ్ల్యూహెచ్​ లిథియం- ఐయాన్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే ఏకంగా 125కి.మీల దూరం ప్రయాణిస్తుందని సంస్థ చెబుతోంది. ఎస్​1, ఎస్​1 ప్రో ఉన్నట్టు కాకుండా, ఈ మోడల్​లో బెల్ట్​ డ్రైవ్​ స్థానంలో హబ్​ మోటార్​ ఉంటుంది. దీనిని ఓలా హైపర్​డ్రైవ్​ మోటార్​ అని పిలుస్తున్నారు. దీని ద్వారా ఎలక్ట్రిక్​ స్కూటర్​ పవర్​ ఔట్​పుట్​ అనేది 6 బీహెచ్​పీకి పెరుగుతుందని సమాచారం. ఈకో, నార్మల్​, స్పోర్ట్స్​ వంటి రైడ్​ మోడ్స్​ కూడా ఇందులో ఉంటాయి. దీని టాప్​ స్పీడ్​ 90కేఎంపీహెచ్​ అని సంస్థ చెబుతోంది.

Ola S1 Air feautres : కొత్త ఈవీలో మూవ్​ఓఎస్​ 3 సాఫ్ట్​వేర్​ ఉంటుంది. మూడ్స్​, డాక్యుమెంట్​ స్టోరేజ్​, వైఫై కనెక్టివిటీ, ఫాల్​ డిటెక్షన్​, హాలో ల్యాంప్​, హజార్డ లైట్స్​, ప్రాక్సిమిటీ వంటి ఫీచర్స్​ దీనితో పాటు వస్తాయి. ఇక ఈ స్కూటర్​లో ఆల్​- ఎల్​ఈడీ హెడ్​లైట్స్​, 7 ఇంచ్​ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ కన్సోల్​, సైడ్​ స్టాండ్​ అలర్ట్​, రివర్స్​ మోడ్​, ఓటీఏ అప్డేట్స్​, స్మార్ట్​ఫోన్​ కనెక్టివిటీ, జీపీఎస్​ నేవిగేషన్​, రిమోట్​ బూట్​ అన్​లాక్​ వంటి ఆప్షన్స్​ కూడా వస్తున్నాయి.

ఇదీ చూడండి:- ఓలా నుంచి ఎలక్ట్రిక్​ కారు.. లాంచ్​ ఎప్పుడంటే!

ఎస్​1 ఎయిర్​లో 34లీటర్​ బూట్​ స్పేస్​ ఉంటుంది. మొత్తం ఐదు రంగుల్లో ఇది అంబాటులోకి రానుంది. అవి కోరల్​ గ్లామ్​, జెట్​ బ్లాక్​, లిక్విడ్​ సిల్వర్​, నియో మింట్​, పోర్సెలిన్​ వైట్​.

ఓలా ఎస్​1 ఎయిర్​ డెలివరీ ఎప్పుడంటే..

Ola S1 Air price : వాస్తవానికి ఈ మోడల్​ను గతేడాదే ఆవిష్కరించింది ఓలా ఎలక్ట్రిక్​ సంస్థ. కానీ రోడ్డు మీదకు రాలేదు. బ్యాటరీతో పాటు ఇతర ఫీచర్స్​ను అప్డేట్​ చేయడం ఇందుకు ఓ కారణం అని తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఈ-స్కూటర్​ కొనుగోళ్ల విండో జులై 31న ప్రారంభమవుతుంది. ఇప్పటికే బుక్​ చేసుకున్న వారికి జులై 28నే విండో ఓపెన్​ అవుతుంది. ఎలక్ట్రిక్​ వెహికిల్​ ఇంట్రొడక్టరీ ప్రైజ్​ రూ. 1.09లక్షలు (ఎక్స్​షోరూం). ఇంట్రొడక్టరీ ఆఫర్​ ముగిసిన తర్వాత ఎక్స్​షోరూం ధర రూ. 1.19లక్షలకు పెరుగుతుంది. ఈ ఏడాది ఆగస్టు తొలినాళ్ల నుంచి డెలివరీలు మొదలవుతాయి.

Whats_app_banner

సంబంధిత కథనం