తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Nothing Phone 2 Launch Date : నథింగ్​ ఫోన్​ 2.. ఎప్పుడు లాంచ్​ అవుతుంది?

Nothing Phone 2 launch date : నథింగ్​ ఫోన్​ 2.. ఎప్పుడు లాంచ్​ అవుతుంది?

29 January 2023, 7:01 IST

    • Nothing Phone 2 launch date India : నథింగ్​ ఫోన్​ 1 సక్సెస్​తో ఇప్పుడు అందరి దృష్టి నథింగ్​ ఫోన్​ 2పై పడింది. ఈ క్రమంలో.. ఈ స్మార్ట్​ఫోన్​పై ఉన్న అంచనాలు ఇప్పడు ఓసారి చూద్దాం..
నథింగ్​ ఫోన్​ 2.. ఎప్పుడు లాంచ్​ అవుతుంది?
నథింగ్​ ఫోన్​ 2.. ఎప్పుడు లాంచ్​ అవుతుంది? (HT Tech)

నథింగ్​ ఫోన్​ 2.. ఎప్పుడు లాంచ్​ అవుతుంది?

Nothing Phone 2 launch date India : నథింగ్​ ఫోన్​ 1కు మార్కెట్​లో మంచి డిమాండ్​ లభిస్తోంది. ఈ స్మార్ట్​ఫోన్​ లాంచ్​ అయ్యి చాలా నెలలు గడిచిపోతోంది కూడా! ఇక ఇప్పుడు నథింగ్​ ఫోన్​ 2పై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఫలితంగా.. నథింగ్​ ఫోన్​ 2 ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలో ఈ కొత్త స్మార్ట్​ఫోన్​ లాంచ్​, ధర, ఫీచర్స్​పై ఉన్న అంచనాలను ఓసారి చూద్దాము..

ట్రెండింగ్ వార్తలు

iPad Air 2024: రెండేళ్ల నిరీక్షణకు తెర; లేటెస్ట్ ఎం2 చిప్ తో ఐప్యాడ్ ఎయిర్ 2024 సిరీస్ లాంచ్

Massive discounts on Mahindra cars: ఎక్స్ యూ వీ 300 సహా మహీంద్ర కార్లపై బంపర్ ఆఫర్స్, హెవీ డిస్కౌంట్స్..

Indegene Limited IPO: అదిరిపోయే జీఎంపీతో ఓపెన్ అయిన ఇండిజీన్ లిమిటెడ్ ఐపీఓ; ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు..

iQOO Z9x launch : ఇండియాలో ఐక్యూ జెడ్​9ఎక్స్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​..!

నథింగ్​ ఫోన్​ 2 లాంచ్​ ఎప్పుడు?

నథింగ్​ ఫోన్​ 1ను 2022 జులై 12న లాంచ్​ చేశారు. ఈ సంస్థ నుంచి ఇప్పటివరకు వచ్చిన ఏకైక మొబైల్​ ఇదే. అయితే.. నథింగ్​ ఫోన్​ 2ను ఇప్పట్లో లాంచ్​ చేసే ఉద్దేశం లేదని, తమ ఫోకస్​ అంతా నథింగ్​ ఫోన్​ 1పైనే ఉందని ఆ సంస్థ ఫౌండర్​ కార్ల్​ పై తెలిపారు. నథింగ్​ ఫోన్​ 1కు చాలా అప్డేట్స్​ తీసుకొస్తామని వెల్లడించారు.

Nothing Phone 2 launch date : ఇవాల్టి ఫోన్​.. రేపు పాతదైపోతుంది! లేటెస్ట్​ అప్డేట్స్​తో మార్కెట్​లో ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్​ఫోన్స్​ లాంచ్​ అవుతూనే ఉంటాయి. పోటీని తట్టుకోవాలంటే.. కొత్త కొత్త మోడల్స్​ను లాంచ్​ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన.. నథింగ్​ ఫోన్​ 2 కూడా వచ్చే అవకాశం ఉంటుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఏడాది జులైలో నథింగ్​ ఫోన్​ 1 వార్షికోత్సవం జరగనుంది. అప్పటి నుంచి.. డిసెంబర్​ మధ్య కాలంలో నథింగ్​ ఫోన్​ 2 లాంచ్​పై ఓ అప్డేట్​ రావొచ్చని అంచనాలు ఉన్నాయి.

నథింగ్​ ఫోన్​ 2- డిజైన్​..

నథింగ్​ ఫోన్​ 2 డిజైన్​.. నథింగ్​ ఫోన్​ 1తో పోలి ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ట్రాన్స్​పరెంట్​ బ్యాక్​ డిజైన్​ రావొచ్చు. గ్లిఫ్​ లైట్స్​ డిజైన్​ మారొచ్చు. యాపిల్​ ఐఫోన్​ 14లోని బాక్సీ డిజైన్​ రావొచ్చు. లేదా ఐఫోన్​ 15లో ఉంటుందని ఊహాగానాలు ఉన్న కర్వ్​డ్​ ఎడ్జ్​ కూడా ఈ నథింగ్​ ఫోన్​ 2లో ఉండొచ్చు!

నథింగ్​ ఫోన్​ 2- ఫీచర్స్​..

Nothing Phone 2 features : మిడ్​రేంజ్​ స్పెసిఫికేషన్స్​తో.. మార్కెట్​లోకి అడుగుపెట్టింది నథింగ్​ ఫోన్​ 1. ఇక ఇప్పుడు.. నథింగ్​ ఫోన్​ 2కు అప్​గ్రేడ్స్​ వస్తాయని అంచనాలు ఉన్నాయి. స్నాప్​డ్రాగన్​ 7 జెన్​ 1 ఇందులో ఉండొచ్చు. ఇదే జరిగితే మొబైల్​ పర్ఫార్మెన్స్​ ఇంకా పెరుగుతుంది. 120హెచ్​జెడ్​ ఓఎల్​ఈడీ డిస్​ప్లే ఉండొచ్చు. రేర్​లో 50ఎంపీ డ్యూయెల్​ కెమెరా సెటప్​ ఉంటుందని ఊహాగానాలు ఉన్నాయి. ఛార్జింగ్​ స్పీడ్​ 45డబ్ల్యుకి అప్​గ్రేడ్​ అవ్వొచ్చు.

నథింగ్​ ఫోన్​- ధర..

Nothing Phone 2 price in India : ఇండియా స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో నథింగ్​ ఫోన్​ 1 రూ. 31,999కి లాంచ్​ అయ్యింది. నథింగ్​ ఫోన్​ 2 ధర అంతకన్నా ఎక్కువగా ఉండొచ్చు. నథింగ్​ ఫోన్​ 2 ధర రూ. 40వేల వరకు పలకొచ్చని తెలుస్తోంది.

నథింగ్​ ఫోన్​ 2కు సంబంధించిన మరిన్ని వివరాలపై రానున్న రోజుల్లో స్పష్టత లభించే అవకాశం ఉంది.